నాలుగు వేదాలలో అత్యంత కీలకమైనది సామవేదం. ఋగ్వేదం పాక్షికమైనది యజుర్వేదము పాక్షికమైనది వాటిని కలిపి చూడటమే సామవేదం. సామవేదం యొక్క మహా పదం "తత్వమసి" తత్ అంటే నీవు త్వం అంటే నేను అసి అయి ఉన్నాను .అంటే నీవే నేను అయి ఉన్నాను పరమాత్మ జీవాత్మ ఒకటే అయి ఉన్నది అని అర్థము ఋగ్వేదం విశ్వతత్వానికి సంబంధించినదైతే యజుర్వేదం మానవ తత్వానికి సంబంధించినది ఈ రెండింటిని ఒక్కటి చేసి చూపేదే సామవేదం.
విశ్వమంతా బ్రహ్మమయమైనప్పుడు మానవదేహమంతా బ్రహ్మమయమైనప్పుడు రెండూ ఒక్కటే రెండింటిలో ఉన్నది బ్రహ్మమే అని తెలియజేసేది సామవేదం విశ్వమంతా సమిష్టి మేధస్సు ద్వారా ఆవిర్భవించింది అందుకే విశ్వం అనంతం అది బ్రహ్మమయం అందులో వందల కోట్ల నక్షత్ర మండలాలు కూటములు గ్రహాలు ఉంటాయి నక్షత్రాలన్నీ గురుత్వాకర్షణ శక్తి చేత బంధించబడి ఉంటాయి విశ్వంలో నిరంతరం మార్పులు జరుగుతూ ఉంటాయి దానిని భౌతిక పరిణామం అంటారు విశ్వమంతా గనము ద్రవము వాయువులుగా జీవ నిర్జీవ పదార్థాలుగా విభజించబడి ఉంటుంది విశ్వం పంచభూతాత్మకం విశ్వాన్ని నడిపించే శక్తి ప్రాణ శక్తిగా గురుత్వాకర్షణ శక్తిగా అయస్కాంత శక్తిగా ఆకర్షణ శక్తిగా వికర్షణ శక్తిగా విద్యుత్తులుగా రూపాంతరం చెందును విశ్వంలో సృష్టి స్థితి లయలు ఉంటాయి విశ్వంలో ఖాళీ ప్రదేశంలో ఎక్కువ విశ్వమంతా కనిపించే భిన్నత్వంలో దాగి ఉన్నది ఏకత్వమే అదే భగవంతుడు ప్రజ్ఞ కుషించుకుంటే భిన్నత్వం ప్రజ్ఞ విస్తరించే కొలది ఏకత్వం విశ్వతత్వంలో ఆత్మ అణాత్మ పరస్పరం కలిసి ఉంటాయి.
విశ్వమంతా వ్యాపించి ఉన్న ఆత్మనే విశ్వాత్మా లేక పరమాత్మ అంటారు విశ్వమంతాకి ఆధారం శుద్ధ చైతన్యమే అందుకే సిద్ధ పురుషులు విశ్వంలో ఉన్న ప్రతి వస్తువులో భగవంతుడిని చూస్తారు ఇలా విశ్వాన్ని గురించి విశ్వతత్వాన్ని అందులో విస్తరించిన భగవంతుడిని గురించి తెలియజేసేది ఋగ్వేదం అందుకే దీనిని అంతరిక్ష శాస్త్రం అంటారు
మానవదేహము వ్యష్టి మేధస్సు ద్వారా ఆవిర్భవించింది అందుకే అది పరిమితమైనది మానవదేహమంతా అణువులమయం ప్రతి అణువులో శుద్ధ చైతన్యం ఉంటుంది ఆ శుద్ధ చైతన్యానికి ఆధారం భగవంతుడు కాబట్టి మానవదేహమంతా బ్రహ్మమయం మానవదేహం కూడా పంచభూతాత్మకంగా ఉండి పంచభూతాలు నిరంతరం దేహం లోపల కు ప్రవేశించి బయటకు విడుదల అవుతూ ఉంటాయి మానవదేహానికి పుట్టుక జీవించుట మరణించుట ఉంటాయి
కాబట్టి మార్పులు చెందే మానవదేహం అశాశ్వతం ఆత్మ దేహము పరస్పరం కలిసి ఉంటాయి మేనుకు ఆధారం నేను అంటే ఆత్మ నేను అంటే శుద్ధ చైతన్యం నేను అంటే భగవంతుడు ఆత్మస్థితి కలిగిన క్షణంలో మాత్రమే సత్య దర్శనం అవుతుంది సత్య దర్శనాన్ని పొందిన సిద్ధ పురుషులు దేహంలోని ప్రతి భాగంలో భగవంతుని దర్శిస్తారు విశ్వాన్ని మానవదేహానికి మధ్యగల సూక్ష్మమైన సంబంధాన్ని గురించి వివరించేదే సామవేదం.
వేదం ఒక్కటే అని ప్రయోగపూర్వకంగా నిరూపించేదే సామవేదం ఋగ్వేదాన్ని యజుర్వేదాన్ని అనుసంధానం చేసినదే సామవేదం. సామవేదం అంతాపూర్ణమే అని తెలియజేస్తుంది విశ్వతత్వంలో ఉన్నది మానవతత్వంలో ఉన్నది అంతా ఒక్కటే అని ప్రయోగపూర్వకంగా వివరించి నిరూపించే శాస్త్రమే సామవేదం.
రెండవది లేదు ఉన్నది ఒక్కటే అని బ్రహ్మం తప్ప వేరే మరొకటి లేదని ఏకత్వం ఒక్కటే అని అదే అనేక రూపాలుగా కనబడుతున్నదని లోపల బయట అంతటా ఒక్కటే ఉందని వివరించేదే సామవేదం అందరూ నీవే అన్నింటిలో ఉన్నది నీవే నీకు పుట్టుక మరణాలు లేవు నీవు విశ్వానికి తండ్రివి నీవు విశ్వానికి యజమానివి అని తెలియజేసేదే సామవేదం రెండవది లేదు ఉన్నదంతా ఒక్కటే అని తెలిపేదే అద్వైత శాస్త్రం.
శారీరక మమకారం ఉంటే దేహమే నీవు అనే భ్రమలో ఉంటావు శారీరక మమకారం తొలగిపోతే దేహానికి విడిగా ఉంటావు విడిగా ఉన్న దేహానికి ఆధారమైన నేను అనేది భగవంతుడే సూక్ష్మతత్వమైన శుద్ధ చైతన్యం గురించి స్థూలతత్వమైన స్థూల జగత్తు గురించి తెలిపి వాటి మధ్య ఉన్న ఏకత్వమే భగవంతుడని వివరించేదే సామవేదం.
విశ్వంలో ఏదైతే ఉందో అదంతా మానవుని లోనే ఉందని మానవుడు విశ్వానికి ప్రతిరూపమని తెలియజేస్తూ విశ్వం బ్రహ్మమైనప్పుడు మానవుడు కూడా బ్రహ్మమే అని నిరూపిస్తుంది సామవేదం.
సర్వేజనా సుఖినోభవంతు స్వస్తి
No comments:
Post a Comment