Monday, September 4, 2023

నేను రాసుకున్న ఆధ్యాత్మిక కథ

  అడవిలో తపస్సు చేసుకుంటూ ఉండే జ్ఞాన దాసు అనే ఒక మహాత్ముడు కాలువలో స్నానం చేస్తున్నప్పుడు దేవుడిని నమ్మని కైవల్య అనే వేటగాడు పరమ నాస్తికుడు ఆ మహాత్ముడు స్నానం చేసే విషయాన్ని గమనించి అతని వైపు ప్రవహించే నీటిలో తన మలాన్ని విసర్జించాడు.
       అది ఆ మహాత్ముడు చూస్తూనే ఉన్నాడు తనలో తానే నవ్వుకుంటూ చాలాసేపు స్నానం చేసి దోసిలితో కడుపునిండా ఆ నీళ్లనే తాగి తన ఆశ్రమానికి వెళ్ళి పోయాడు.
     ఏదో తెలియని ఆలోచన వచ్చింది వేటగాడు ఇంటికి వెళ్తూ మార్గమధ్యంలో వెళుతుండగా అతని మదిలో అదే ఆలోచన బయలుదేరింది మలం పారిన నీటిలో స్నానం చేసిన మహాత్ముడు గురించి ఆలోచిస్తూ ఆలోచిస్తూ అలా నడుచుకుంటూ అడవి దారికుండా వెళ్తూ ఉన్నప్పుడు ఒకచోట లోయలో పడిపోతాడు గట్టిగా అరిచేసరికి అదే లోయలో ఒక గుహలోనుండి జ్ఞాన దాసు గారు బయటికి వస్తారు కైవల్య అంటూ గాయాలతో మూలుగుతున్న వ్యక్తిని పిలిచి అక్కడి నుంచి తీసుకెళ్లి తన గుహలో వారం రోజులపాటు నిద్రాహారాలు లేకుండా సపర్యలు చేస్తాడు జ్ఞానదాసు స్వామి.
       స్పృహలోకి వచ్చిన తర్వాత వారం రోజులు లేవలేని స్థితిలో ఉన్నప్పుడు జ్ఞాన దాసు స్వామిని నిస్వార్ధంగా చేసిన సేవలు అతని కాటిణ్యమైన హృదయాన్ని కరిగించి వేశాయి.
     కొండలను సైతం కదిలించే శక్తి కలిగిన వారికి బండ రాయి లాంటి గుండెను కదించటం వింతేమీ కాదు.
         నాకు మీరు ఎందుకు సేవలు చేశారు మలం కలిసిన నీటిని ఎందుకు చిరునవ్వుతో తాగారు అని ప్రశ్నించగా అప్పుడు కైవల్యకు జ్ఞాన దాసుగారు ఇలా సమాధానం చెప్పారు.
      నాకు మలమూ మల్లెపువ్వుకు తేడా తెలియదు నా దృష్టిలో రెండు సమానమే అందుకే నాకు ఏ రుచి ఏ వాసన తెలియదు భగవంతుడి రుచి భగవంతుడి వాసనా భగవంతుడు స్పర్శ భగవంతుడు దర్శనం నిరంతరం అనుభూతి చెందుతున్నాను ప్రతి ప్రాణిలో ప్రకృతి అంతా భగవంతుడే అన్న అనుభవ సత్యం అవగతం చేసుకున్నప్పుడు భగవంతుడు కానిది ఏదీ లేదు అని చెప్పగా తన కన్నీటితో జ్ఞానదాసు స్వామి కాళ్ళను కడిగి తనని శిష్యునిగా చేర్చుకోమని జ్ఞానోపదేశం చేయమని వేడుకుని శిష్యుడిగా మారిపోయాడు.
     ఆపై కైవల్య దాసుడిగా, భక్తుడిగా మారిపోయి నిరంతరం దైవ ధ్యానంలో కలిపి తన జీవితాన్ని సార్ధకం చేసుకున్నాడు

No comments:

Post a Comment

Demo class 7 days yoga class registration

Loading… ఫారం సబ్మిట్ చేసిన తర్వాత WhatsApp లో మమ్మల్ని సంప్రదించండి 🙏 📲 Contact on WhatsApp Your free book View ...