అడవిలో సంచరిస్తూ యాగంటి ఉమామహేశ్వర కలిసి తన నివాస స్థలం కోసం సలహా అడిగారు అప్పుడు ఆయన చెప్పారు ఎర్రమల కొండల్లో మద్ది లేరు అనే ఏర వద్ద ఉండమని సలహా ఇచ్చారు. ఆ మద్దిలేరు అనే ప్రాంతానికి స్వామివారి చేరుకుని అక్కడ సంచరిస్తూ ఉండేవారు .
అయితే ఒకరోజు రంగాపురానికి
మూడు కిలోమీటర్ల దూరంలో మోక్ష పట్టణం అనే పట్టణాన్ని పరిపాలించే రాజు గారు ప్రతి శనివారం వేటకు వెళుతూ ఉండేవారు . అయితే ఒకసారి అలా వేటకు వెళ్ళినప్పుడు దివ్యతేజస్సుతో ఒక ఉడుం కనబడింది.ఆ రాజు సైనికులను ఆ ఉడుం ను పట్టుకొమ్మనిఆజ్ఞాపించారు అయితే ఆ పక్కనే ఉన్న కోమలి అనే పుట్ట లోపలికి వెళ్ళిపోయింది .అయితే ఆ సైనికులు కూడా ఆ పుట్ట దగ్గరకు వెళ్లి చూశారు అయితే అక్కడ కనబడలేదు ఇక అక్కడి నుంచి అందరూ వెళ్ళిపోయారు.
అయితే అదే రోజు రాత్రి రాజు పడుకొని నిద్ర పోతూ ఉన్నప్పుడు శ్రీ నరసింహ స్వామి వారు కలలో కనబడి రేపు నీకు నేను కనిపిస్తాను నువ్వు ఆ పుట్ట దగ్గరికి రా అప్పుడు నేను నీకు కనబడతాను అని కలలో చెప్పి అదృశ్యమయ్యాడు శ్రీ నరసింహ స్వామి వారు .
No comments:
Post a Comment