కొమరం భీం గారి జీవిత విషయానికి వస్తే సంఘాన్ని ఉద్ధరించడానికి మహాత్ములు ఆధ్యాత్మిక మార్గాన్ని ఎన్నుకొంటారు. అది వారిలోని దైవిక స్థితికి నిదర్శనం.అయితే మనుషుల్లో ఉన్నతమైన భావాలు కలిగి ఏం చేసినా సరే తమ సంఘాన్ని ఉద్ధరించాలని ఆలోచనలు కలిగిన వ్యక్తులు సంఘసంస్కర్తలు. అటువంటి సంఘ సంస్కర్తలలో కొందరు శాంతియుత మార్గాన్ని అవలంభిస్తారు. కానీ మరికొంతమంది ది విప్లవ భావాలతో తమ సంకల్పాలను నెరవేర్చుకోవాలని ఆశించి ఆ దారిలో పయనిస్తారు ఏది ఏమైనా ప్రజల హక్కులను కాపాడివారి జీవితాలను ఉన్నతంగా మార్చడమే ఉన్నతమైన భావాలు కలిగి ఆదివాసీల హక్కులకై పోరాడి వారి హృదయాల్లో శాశ్వతంగా నిలిచిపోయిన మనిషి శ్రీ కొమరం భీమ్ గారు. పంతొమ్మిది వందల సంవత్సరంలో లో ఆదిలాబాద్ జిల్లా ఆసిఫాబాద్ తాలూకా లోని సంకేపల్లి గ్రామంలో జన్మించాడు కొమురం భీం అయితే అతనికి 15 సంవత్సరాల వయసు ఉన్నప్పుడు అతని తండ్రి అటవీశాఖ సిబ్బంది జరిపిన దాడిలో మరణించాడు.
తర్వాత కుటుంబం కరిమెర ప్రాంతంలోని ని సర్దాపూర్ కు వలస వెళ్ళింది అక్కడ ప్రశాంతంగా జీవించాలని అనుకున్నారు కాని అక్కడ కూడా ప్రశాంతంగా జీవించడం సాధ్యం కాలేదు సిద్ధికి అనే జాగీర్దార్ కొమరం సాగుచేస్తున్న భూమిని ఆక్రమించాడు దాంతో విపరీతమైన కోపంతో ఊగిపోయి ఒకానొక రోజున ఆ సిద్ధికి ని చంపేసి బలార్షా మీదుగా అస్సాం చేరుకున్నాడు కొమరం భీమ్ అక్కడ ఐదు సంవత్సరాల పాటు గడిపాడు అక్కడి కాఫీ తేయాకు తోటల్లో పనిచేస్తూ గడించిన రాజకీయ పోరాట అనుభవంతో మళ్లీ కరిమెర ప్రాంతానికి వచ్చాడు .
అయితే ఆ రోజుల్లో నిజాం నవాబు ఆదివాసీల పై విపరీతంగా పన్నులు విధించి వసూలు చేసేవాడు అడవిలో పశువులు ఎందుకు తెచ్చుకున్నందుకు పన్నులు వసూలు చేస్తూ ఆదివాసీలను ఎంతో ఇబ్బంది పెట్టే వాడు .తమ జాతి యొక్క స్వేచ్ఛ స్వాతంత్ర్యం పై నిజాం యొక్క ఆగడాలను ప్రశ్నిస్తూ కొమరంభీమ్ గంభీరంగా ప్రసంగించే వాడు ఆ గంభీరమైన ప్రసంగాలకు ప్రజల్లో పోరాట జ్వాలలురగిలేవి. ఆసిఫాబాద్ పరిసర ప్రాంతాలు పోరాట కేంద్రాలుగా మారిపోయాయి జోడేఘాట్ గుట్టల్లో పోరాట జ్వాలలు ఎగిసిపడేవి.
నిజాం సైన్యం పైన అటవీ సిబ్బంది పైన కొమరం భీమ్ దాడి చేసే వాడు 1928 నుండి ఇ 1940వ సంవత్సరం వరకు రణభేరి మ్రోగించిన కొమరం భీమ్ నైజాం సర్కారు గుండెల్లో సింహ స్వప్నంగా మారిన పోరాటయోధుడు అయితే ఆయన జీవితమంతా తిరుగుబాటుకు గడిచిపోయింది 40 ఏళ్ల ప్రాయంలో పటేల్ అనే నమ్మకద్రోహి సమాచారంతో అర్ధరాత్రిపూట కొమరం స్థావరాలను సైన్యం చుట్టుముట్టగా అడవుల్లో 1940 సెప్టెంబర్ 1వ తేదీన కొమరం భీమ్ వీరమరణం పొందాడు అప్పటి నుండి ఆ తిధి రోజునే కొమరం భీమ్ వర్ధంతిని జరుపుకోవడం ఆదివాసీల ఆనవాయితీగా మారిపోయింది తన ప్రజల కోసం ముళ్ల దారిలో నడిచి ముళ్ళ బాధలను అనుభవిస్తూ హింస అనే ముళ్ళు గుచ్చుకొని వీరమరణం పొంది ఆదివాసీల గుండెల్లో నిలిచిపోయిన పోరాట యోధుడు కొమరం భీమ్.
సర్వేజనా సుఖినోభవంతు....
జైగురుదేవ.... మీ మధు గురూజీ...
No comments:
Post a Comment