అవధూతలు అంటే ఎవరు
సామాన్యంగా జన్మించి అసామాన్యమైన స్థితిని కలిగి జనులను తరింపజేస్తునే, ఒక్కోసారి బాలుడిలా ఇంకోసారి ఉన్మత్తుడిలా మరోసారి పిచ్చివాడిలా కనబడేట్టు గా జనులను భ్రమింపజేసే మహాత్ములు అవధూతలు .
ప్రకృతిని పంచభూతాలను నిలువరించే శక్తిని కలిగినవారు అయినప్పటికీ సహజసిద్ధంగా జీవిస్తూ ఉంటారు.అన్ని స్థితుల యందు సమస్థితిని కలిగి సమదృష్టితో జీవన ప్రయాణం చేస్తూ ఉంటారు.
మాయను అధిగమించిన వారు మాయ మోహితుల పాలిట దైవం లా కనిపించి జనుల కష్టాలకు, సమస్యలకు సమాధానం అవుతారు. ఎటువంటి సమస్యలనైనా సుఖ సంతోషాలను ఎండకు వానకు చలికి దేనికి చలించరు.
ఒక్కోసారి దివ్య రూపంతో మరోసారిదిగంబర రూపంతో దర్శనమిచ్చే వారి దివ్య దేహం శ్రీ గురు దత్తాత్రేయుని అంశంలో భాగమే.
స్నానం చేయకపోయినా దివ్యపరిమళాలు వీచటం వారి దేహం సహజ స్వభావం ,వారి చెయ్యి తగిలిన వెంటనే బాధలు సమసిపోతాయి, వారు అడుగిడిన చోట కష్టాల కర్మలు కరిగిపోతాయి.
అవధూతల సేవ లో జీవించే వారి జన్మలు చరితార్థం అవుతాయి. అవధూతల తో సహచర్యం జ్ఞానానికి దారితీస్తుంది. వారితో పాటుగా నడిచే నడక తో సేవాభావం ఉప్పొంగుతుంది.
అవధులు లేని భగవంతుడి దూతలు అవధూతలు అలౌకికమైన స్థితిలో నిరంతరం పరమానందాన్ని అనుభవిస్తూ ఉంటారు ఆకలిదప్పులకు నిద్రాహారాలకుఅతీతం వారి జీవితం.మౌనంగా జీవించే అవధూతలు కొందరైతే తమ ఉప దేశాలతో ప్రజల్లో ఆధ్యాత్మిక చైతన్యం కలిగించే వారు ఇంకొందరు.
తమను నమ్మిన వారిని నమ్మని వారిని సైతం కన్నబిడ్డల్లా గా భావించి దీవించే వారు అవధూతలు. గొప్ప ఆధ్యాత్మిక శక్తిని కలిగి మహోన్నత స్థితి అయిన సమాధి స్థితిని నిరంతరం అనుభవిస్తూ ఉండి ఆ స్థితినుండి సర్వమును అవగతం చేసుకుంటారు ప్రకృతి కదలికలను మనోనేత్రంతో వీక్షించగలరు.
బ్రహ్మ జ్ఞానం ఉన్నా సరే అజ్ఞానుల మధ్య అతి సామాన్యంగా సంచరించే త్రిమూర్తి స్వరూపులు అవధూతలు.
సర్వేజనా సుఖినోభవంతు....
మీ మధు గురూజీ....
జై గురుదేవ్.....
ఓం శ్రీ సాయిరాం.
No comments:
Post a Comment