కామేశ్వరన్ తమిళనాడులోని బాణతీతం వరుణ గుహలలో నెలల తరబడి నిరాహారంగా తపోదీక్ష చేసేవాడు అది గమనించిన శ్రీ శ్రీ రాకాడి బాబా వారి భక్తుడు ఆ బాలుడి విషయాన్ని శ్రీ రాకాడీ బాబా గారికి తెలియజేశారు అప్పుడు స్వయంగా శ్రీ బాబా వారే ఆ బాలుడి దగ్గరకు వెళ్లి ఆ గుహలోనుండే వేడి అన్నం రసం కూరలు పెరుగు బయటకు తీసి ఆ బాలుడిచేత తినిపించాడు గురువు కోసం తపించే వారికి సాక్షాత్తు గురువే స్వయంగా ప్రత్యక్షమవుతాడు అనడానికి ఈ సంఘటనే నిదర్శనం.
1967 వ సంవత్సరంలో బాన తీర్థ ప్రదేశం తామ్రపర్ని నదిలో రాకాడి బాబా కామేశ్వరన్ ను అభిషేకించి పూర్ణానంద అనే నామకరణం చేసి కాషాయం అనుగ్రహించారు గురువుల ఆదేశంతో క్షేత్ర పర్యటనలు చేస్తూ శిరిడీ చేరుకున్నారు పూర్ణానందులు భక్తులు ఎవరో సాయినాధుని విగ్రహానికి పూలదండ సమర్పించగా 15 అడుగుల దూరంలో ఉన్న పూర్ణానందుల మెడలో ఆ దండ వచ్చి పడింది ఆ అద్భుతాన్ని చూచి జనం స్వామిని చుట్టుముట్టినారు తర్వాత భక్తులకు ఇబ్బంది కలగరాదని సాయి సంస్థాన్ సత్రం మేడపైకి వెళ్లారు స్వామీజీ అక్కడ ఒక గదిలో సాయినాధుని ప్రత్యక్ష దర్శనం కోరిన ఒక భక్తుడు ఆహారం మాని అంత్యదశకు చేరుకున్నాడు ఆ గదిలోనికి ప్రవేశించారు శ్రీ పూర్ణానంద వారు ఆ సమయంలో ఆ భక్తుడికి పూర్ణా నందుల వారు సాయినాధుడిలా దర్శనం ఇవ్వగా అప్పటివరకు శక్తి హీనుడై మంచం పట్టిన అతడు ఒక్కసారిగా బాబా అని పిలుస్తూ సమీపించాడు పాద నమస్కారం చేయగా ఎవరో భక్తులు ఇచ్చిన కోవా బిళ్ళలను ప్రసాదించి వెళ్ళిపోయారు పూర్ణానందులు. చాలాసార్లు స్వామీజీని పరీక్షించి స్వయంగా సాయినాధుడే అని సంతృప్తి పొంది అప్పటినుంచి స్వామితోనే ఉండిపోయిన ఆ భక్తుడే రమణ బాబా గారు.
పూర్ణానందులు తన ప్రధమ శిష్యుడైన రమణ బాబాతో కలిసి 1969లో శ్రీశైలం చేరుకున్నారు సత్రంలో బస చేసిన స్వామివారికి రెండవ శిష్యుడిగా అన్నం రాజు రామకృష్ణతో పరిచయం ఏర్పడింది అయితే రామకృష్ణకు స్వామీజీ భువనేశ్వరి మంత్రాన్ని ప్రసాదించిన తర్వాత జిల్లెల్ల మోడీ అమ్మ దర్శనం లభించింది.
హటకేశ్వర ఆశ్రమంలో ఆరేండ్లు గడిపిన స్వామీజీ సుమారు 1972లో సున్నిపెంట ఆశ్రమం తమ నివాసంగా చేసుకున్నప్పటికీ హఠకేశ్వరానికి అప్పుడప్పుడు వస్తూ ఉండేవారు స్వామి సహచర్యం వలన ఎంతోమంది భక్తులు స్వామికి శిష్యులైనారు దురై స్వామి రెండు లీటర్ల డీజిల్ తో అడవికి వెళ్లి ఆశ్రమం కోసం కట్టెలు తేవడం కోసం అక్కడ ఎంతో శ్రమించారు తిరిగి 25 కిలోమీటర్లు ఆశ్రమానికి రావాల్సి ఉంది కానీ తన దగ్గర లారీలో రెండు లీటర్ల డీజిల్ మాత్రమే ఉంది కానీ స్వామిని తలచుకొని లారీని స్టార్ట్ చేసి ఆశ్రమానికి చేరుకున్నారు తిరిగి వచ్చిన తర్వాత చూస్తే ఆ రెండు లీటర్ల డీజిల్ అలాగే ఉంది ఇది స్వామి మహిమగా అందరూ తలిచారు.
హైదరాబాద్ యూసఫ్ గూడా రామమూర్తి ఇంటి నుండి స్వామివారికి ఒక క్యారేజీ అందింది అయితే ఆ క్యారేజీని తీసుకొని శ్రీశైలం వెళుతూ ఉన్నప్పుడు రామమూర్తి ఇచ్చిన క్యారియర్ను అడవిలో దాహంతో అలమటిస్తున్న వారికి ఇవ్వడం కోసం శ్రీ స్వామి వారు కారును ఆపి అడవిలో ఒకచోట నుండి పరిగెత్తుకుంటూ అడవి లోపలికి వెళ్లారు అయితే ఆ స్వామిని వెంబడించిన డ్రైవర్ గారు స్వామికి తన చేతిలో ఉన్న క్యారియర్ను అందించారు అప్పుడు స్వామి అడవిలో దాహంతో అలమటిస్తూ ఉన్న ఆకలితో అలమటిస్తున్న భార్యాభర్తల దగ్గరికి వెళ్లి ఆ క్యారియర్ను అందించారు. శ్రీ స్వామి వారు అయితే రామమూర్తి ఆ క్యారియర్ అడక్కపోతే వాళ్ళ పెద్దమ్మాయి వివాహం జరుగుతుంది ఈ విషయం ఆ రామమూర్తి గారికి చెప్పొద్దు అని స్వామి వారు కారు డ్రైవరు నంబికి చెప్పారు అయితే ఆ తర్వాత ఎప్పుడు రామమూర్తి గారు ఆ క్యారియర్ గురించి అడగనేలేదు అందువలన రామమూర్తి గారి అమ్మాయి పెళ్లి జరిగి ఆమె అమెరికాలో స్థిరపడింది.
స్వామీజీ జన్మదిన నాడు కారేయార్ సురుమూత్తు అయ్యనార్ అని క్షేత్రంలో జరపాలని భక్తులు తలచారు అందరూ అక్కడికి వెళ్లారు అక్కడ కొంబేరి ముఖన్ అనే ఒక పాము వచ్చింది అందరూ భయపడి పారిపోయారు కానీ శ్రీ స్వామి వారు అందరితో ఆ పాము తన గురువే తనను ఆశీర్వదించడానికి ఇక్కడికి ఆ రూపంలో వచ్చారు అని అందరితో చెప్పారు .
శ్రీశైలం ఇష్ట కామేశ్వరి దేవాలయంలో స్వామితోపాటు గడిపిన సూర్యనారాయణ మూర్తి గారు స్వామివారి గురు తత్వాన్ని అంతా తేలికగా అంగీకరించక స్వామివారికి ఎన్నో పరీక్షలు పెట్టి తర్వాత స్వామి అనుగ్రహాన్ని పొందారు 19804లో ఆ తర్వాత ఆ భక్తుడికి సదానంద సరస్వతి అని నామకరణం చేసి సన్యాసి ఆశ్రమం ప్రసాదించారు.
మృత్యుముఖంలో ఉన్న మృత్యుంజయ శాస్త్రి గారిని రక్షించి 1985లో కాషాయం ఇచ్చి ప్రకాశానంద స్వామి అనే నామకరణం ప్రసాదించారు.
శ్రీశైలం ప్రాజెక్టు ఎల్డీసీగా పనిచేసే సీతాదేవికి 25 సంవత్సరాల వయసు రాకముందే రైలు ప్రమాదంలో భర్త వినియోగం సంభవించింది నిరాశతో బతికే ఆమెను ఆశ్రమానికి తీసుకెళ్లింది రాజ్యలక్ష్మి గారు అక్కడ సీతాదేవితో స్వయంగా వంట వంట చేపించుకొని తిన్నారు స్వామి సీతాదేవి దుఃఖం మరిచిపోయింది ఆశ్రమ వాసులు వితంతువుల వంట తినరాదని స్వాముల పాదాలు తాకరాదని ఏవో మాట్లాడుకుంటూ ఉంటే స్వామీజీ వారందరికీ తగు రీతిలో సమాధానం చెప్పారు.
1991లో వృద్ధ దంపతులు స్వామిని దర్శించారు 60 సంవత్సరాలు దాటిన వారి మనసులో అడుగు ఆరుగురు ఆడపిల్లల తర్వాత మగ పిల్లవాడు లేడనే బాధ ఉంది స్వామి కరుణ వలన మరుసటి సంవత్సరం వారికి కొడుకు పుట్టాడు అంతేకాదు ఎంతోమంది అనారోగ్యవంతులు స్వామిని నమ్మి ఆరోగ్యవంతులైనారు ఒకసారి భక్తుడి అనుమానం నివృత్తి చేయడం కొరకు గాలిని పక్షులను సైతం కొంత సమయం పాటు స్తంభింప చేసి ఆ భక్తుడిని ఆధ్యాత్మిక మార్గంలోనికి మళ్ళించారు.
స్వామి వారు 1999లో అనారోగ్యంతో హైదరాబాదు భక్తుని ఇంటిలో కొన్నాళ్లు ఉన్నారు. తర్వాత 2000 సంవత్సరం ఫిబ్రవరిలో అపోలో ఆసుపత్రిలో కొన్ని రోజులు ఉన్నారు. ఆ తర్వాత స్వామివారు ఏప్రిల్ 6 2000 సంవత్సరంలో స్వామి కైలాస వాసులైనారు స్వామి జీవితం ఎంతోమందికి ఆదర్శనీయం అందుకే మనమందరం మహనీయులు నడిచిన మార్గాన్ని పవిత్రమైనదిగా భావించి ఆ మార్గంలో నడిచే వారిని గౌరవించుకుందాం పూజించుకుందాం. సర్వేజనా సుఖినోభవంతు జై గురుదేవ్
No comments:
Post a Comment