Friday, March 11, 2022

శ్రీ శ్రీ శ్రీ మద్దిలేటి స్వామి వారి స్థల పురాణం

          ఒకసారి శ్రీ కదిరి లక్ష్మీనరసింహ స్వామి వారు మహాలక్ష్మి అమ్మవారి తో పాచికల ఆట ఆడుతూ ఉండగా స్వామి వారు ఓడిపోయారు అప్పుడు అమ్మవారు స్వామి వారిని ఆట పట్టించారు .అప్పుడు శ్రీ నరసింహ స్వామి వారు అమ్మపై అలిగి అక్కడి నుంచి వెళ్లిపోయారు. 
            అడవిలో సంచరిస్తూ యాగంటి ఉమామహేశ్వర కలిసి తన నివాస స్థలం కోసం సలహా అడిగారు అప్పుడు ఆయన చెప్పారు ఎర్రమల కొండల్లో మద్ది లేరు అనే ఏర వద్ద ఉండమని సలహా ఇచ్చారు. ఆ మద్దిలేరు అనే ప్రాంతానికి స్వామివారి చేరుకుని అక్కడ సంచరిస్తూ ఉండేవారు .
      అయితే ఒకరోజు రంగాపురానికి
మూడు కిలోమీటర్ల దూరంలో మోక్ష పట్టణం అనే పట్టణాన్ని పరిపాలించే రాజు గారు ప్రతి శనివారం వేటకు వెళుతూ ఉండేవారు . అయితే ఒకసారి అలా వేటకు వెళ్ళినప్పుడు దివ్యతేజస్సుతో ఒక ఉడుం కనబడింది.ఆ రాజు సైనికులను ఆ ఉడుం ను పట్టుకొమ్మనిఆజ్ఞాపించారు అయితే ఆ పక్కనే ఉన్న కోమలి అనే పుట్ట లోపలికి వెళ్ళిపోయింది .అయితే ఆ సైనికులు కూడా ఆ పుట్ట దగ్గరకు వెళ్లి చూశారు అయితే అక్కడ కనబడలేదు ఇక అక్కడి నుంచి అందరూ వెళ్ళిపోయారు.
       అయితే అదే రోజు రాత్రి రాజు పడుకొని నిద్ర పోతూ ఉన్నప్పుడు శ్రీ నరసింహ స్వామి వారు కలలో కనబడి రేపు నీకు నేను కనిపిస్తాను నువ్వు ఆ పుట్ట దగ్గరికి రా అప్పుడు నేను నీకు కనబడతాను అని కలలో చెప్పి అదృశ్యమయ్యాడు శ్రీ నరసింహ స్వామి వారు .
             అదే విధంగా మరుసటి రోజు ఆ రాజు తన సైనికులతో పాటు అక్కడికి వెళ్లగా ఒక బాలుడు అక్కడ ప్రత్యక్షమయ్యాడు ఆ బాలుడికి అక్కడే పూజలు చేయగా అతడు అక్కడే మద్దిలేటి నరసింహస్వామి విగ్రహం లాగా మారిపోయాడు.
            తర్వాత ఆ రాజు ప్రతి శనివారము ఆ విగ్రహానికి పూజ చేసి వచ్చేవాడు...

Thursday, March 10, 2022

శ్రీ శ్రీ శ్రీ తిక్క లక్ష్మయ్య స్వామి జీవిత చరిత్ర

        శ్రీ లక్ష్మయ్య స్వామి వారు అనంతపురం జిల్లా ధర్మవరం తాలూకా బత్తలపల్లి మండలం అప్పరా చెరువు అనే గ్రామంలో జన్మించారు .చిన్నప్పటి నుంచి ఆధ్యాత్మిక భావాలతో పెరిగారు.               అయితే శ్రీ స్వామివారు యుక్తవయస్సు రాగానే వివాహం చేసుకున్నారు .అయినా తన ధర్మాన్ని పాటిస్తూ మరొకవైపు ఆధ్యాత్మిక భావాల కారణంగా గత జన్మల ఆయన ఒక మహాత్ముడైన వ్యక్తిని గురువుగా స్వీకరించారు .ఆయనే శ్రీ శ్రీ శ్రీ గురజాడ అప్ప స్వామి వారు .శ్రీ అప్ప స్వామి వారు మహాత్ములు యోగ సిద్దులు .ఆయన కొల్హాపూర్ మహాలక్ష్మి అమ్మవారిని అమ్మవారి అపారమైన అనుగ్రహాన్ని సంపాదించారు,అటువంటి మహాత్ముడి వద్ద శిష్యునిగా చేరి గురుసేవ చేసుకున్నారు లక్ష్మయ్య గారు.

                      అయితే ఒకసారి శిష్యుడి గురు సేవకు మెచ్చిన అప్ప స్వామి వారు శిష్యుడైన లక్ష్మయ్యను జగన్మాతను ఆరాధించి ఆమె అనుగ్రహం పొందవలసిందిగా ఆజ్ఞాపించారు.గురువు యొక్క ఆజ్ఞ ప్రకారం జగన్మాతను అర్చించి, పూజించి ,ఆరాధించి ఆమె అనుగ్రహానికి పాత్రులై అనంతమైన ఆత్మ జ్ఞాన సంపన్నుడు గా మారిపోయాడు లక్ష్మయ్య స్వామి.

                 సంసారాన్ని విడిచి చుట్టుపక్కల ప్రాంతాల్లో తిరుగుతూ ఆకలి తప్పులను ఎండ వానలను మరచి దేహ భ్రాంతి విడిచి దిగంబరంగా తిరిగేవారు ఆయన. అలా చూసిన వారు ఆయనకు పిచ్చి పట్టిందని ఆయన పిచ్చివాడేమో అని భావించేవారు.

                 లక్ష్మయ్య గారు ఒకసారి అన్ని ప్రాంతాల్లో తిరుగుతూ ధర్మవరం చేరుకున్నారు .ధర్మవరంలో శివాలయం దగ్గర ఉన్న బావి వద్ద నీళ్లపై తేలియాడుతూ ధ్యానం చేసే వారు. అది గమనించిన ప్రజలు ఆయన తిక్క స్వామి కాదని మహాత్ముడు అని తలచి స్వామి వారు ధ్యానం చేసుకోవడం కోసం రైల్వే గేటు పక్కన గుడిసె వేయించారు.

                 కొందరు మాత్రం దిగంబరంగా ఉండే ఆయనను చూసి తిక్క స్వామి అని భావించేవారు .అయితే స్వామిలోని మహత్యం కొద్దికొద్దిగా బయట పడసాగింది .స్వామి చుట్టూ చేరి సేవ చేసే వారి బాధలు కష్టాలు దూరమయి మరికొందరు తమ సమస్యలను నేరుగా విన్నవించుకునే వారు. అప్పుడు స్వామి విభూతి ప్రసాదించి వారు వారి సమస్యలు ఎటువంటివైనా సరే ఖచ్చితంగా పరిష్కారమయ్యేవి.

          ఇలా స్వామివారి గురించి తెలుసుకొని ఎంతో మంది స్వామికి భక్తులు గా మారిపోయారు. స్వామి వారు భక్తులు ఏది ప్రేమతో ఇచ్చిన సంతోషంగా స్వీకరించి భుజించేవారు.

        ఒకసారి కొందరు భక్తులకు అనుమానం వచ్చి స్వామి తో వారు ఇలా మాట్లాడారు స్వామి మీరు ఎప్పుడు స్నానం చేయరు ఎందుకు ? ఇప్పుడు మా కోసం స్నానం చేస్తారా ?అని అడిగారు. స్వామి వెంటనే ధ్యానంలో కూర్చుని తన మరొక రూపంలో పక్కనే ఉన్న బావి లోపల స్నానం చేసి పద్మాసనం వేసుకుని కూర్చున్నాడు .అందరూ ఆశ్చర్యపోయి స్వామివారిని సంపూర్ణంగా అర్థం చేసుకున్నారు.

                స్వామి వారు తమ మిగిలిన జీవితాన్నంతా భక్తజనం ఆదరణకు వినియోగించి ఒక శుభముహూర్తాన జీవసమాధి చెందాలని నిర్ణయించుకుని భక్తులను తన జీవసమాధి కి తగిన ఏర్పాట్లు చేయమని ఆజ్ఞాపించి భక్తుల ఎదుట దీపాల వెలుగుల మధ్య సమాధి చెందారు శ్రీ స్వామివారు. తర్వాత భక్తులు ఆలయం నిర్మించగా శ్రీ లక్ష్మయ్య స్వామి వారి దేవాలయం ధర్మవరం లో చాలా ప్రసిద్ధమైన దేవాలయంగా వెలుగొందుతోంది స్వామి వారి ఆరాధన ఉత్సవం కార్తీక పౌర్ణమి రోజున అంగరంగ వైభవంగా జరుగుతుంది . 


ఇది స్వామి చరిత్ర 

సర్వేజనా సుఖినోభవంతు

Demo class 7 days yoga class registration

Loading… ఫారం సబ్మిట్ చేసిన తర్వాత WhatsApp లో మమ్మల్ని సంప్రదించండి 🙏 📲 Contact on WhatsApp Your free book View ...