శ్రీ అరుణగిరి నాధర్ గారు 13వ శతాబ్దంలో విజయనగర సామ్రాజ్యంలోని తిరువన్నామలైలో సెంగుంత కైకోలార్ కుటుంబంలో జన్మించాడు అతను పుట్టిన వెంటనే ఆయన తండ్రి మరణించాడు కరుణగిరి తల్లి మరియు సోదరి గార్లు అరుణగిరి గారికి సంస్కృతి సాంప్రదాయాలను గురించి బోధించేవారు కానీ ఆయన వాటిని గురించి పట్టించుకోకుండా తన యొక్క యుక్త వయసు భోగాలకు ఆకర్షితుడయ్యాడు.
అతని సోదరి సోదరిడి సంతోషం కోసం తన సంపాదనంతా కూడా ఖర్చు చేస్తూ ఉండేది తన తమ్ముడు బాగు కోసం ఆవిడ నిరంతరం తపిస్తూ ఉండేది అతడు ఏది అడిగితే అది ఇస్తూ ఉండేది అయితే అరుణగిరి మాత్రం దేవదాసీలను సందర్శించేవాడు విచ్చలవిడిగా తన జీవితాన్ని అనుభవించడం వల్ల ఒకానొక దశలో ఆయనకు కుష్టువ్యాధి సోకి నరక వేదనను ఆయన అనుభవించేవాడు.
ఒకసారి తన సొంత సోదరి దగ్గరకు వెళ్లి డబ్బు కావాలి అని అడిగాడు ఆ సమయంలో ఆమె దగ్గర డబ్బు లేదు అప్పుడు తన దగ్గర ఉన్నదంతా అయిపోయిందని చెప్పింది ఒకవేళ నీకు ఇంకా డబ్బు కావాలంటే తనను అమ్మితే డబ్బు వస్తుందని కూడా ఆమె చెప్పింది ఆ క్షణంలో తాను ఎంత స్వార్ధపరుడో తనకు అర్థమయింది అరుణగిరి గారు తన జీవితాన్ని ముగించాలని నిర్ణయించుకున్నాడు.
ఆలయానికి వెళ్లి స్తంభాలకు మెట్లకు తలను బాదుకున్నాడు క్షమించమని దేవుణ్ణి వేడుకున్నాడు ఆలయ గోపురం పైకి ఎక్కి చనిపోవాలని పైనుంచి దూకాడు కానీ ఆ సమయంలో భగవంతుడే ఆయన దగ్గరికి వచ్చి అతని కాపాడాడు అతనికి కుష్టు వ్యాధి కూడా ఆ క్షణంలోనే నయమైపోయింది.
ఆ తర్వాత తన జీవితాన్ని భక్తి మార్గం వైపు మళ్లించి మొదటి భక్తి గీతాన్ని భగవంతుని చూసిన క్షణంలోనే ఆశువుగా ఆలపించాడు ఆయన (మురుగన్) సుబ్రహ్మణ్య స్వామి యొక్క భక్తుడు ఆయన గీతాలు ఆలపిస్తూ ఉంటే ప్రజలందరూ ఆకర్షితులయ్యేవారు అతని కీర్తి ఆ రాజ్యపు ముఖ్యమంత్రి లో అసూయను రగిలించగా రాజు వేలాది మందితో బహిరంగ సభను ఏర్పాటు చేసి మురుగన్ ఉనికిని ఇతరులకు నిరూపించమని అరుణగిరిని ఆదేశించాడు అరుణగిరి గారు మురుగన్ కోసం భక్తి గీతాలను ఆలపించగా బాలమురుగన్ ప్రత్యక్షమయ్యాడు అరుణ గిరిని మరొకసారి ఆ బాలుడి రూపంలో వచ్చి కాపాడాడు .
అరుణగిరి గారు దక్షిణ భారతదేశంలోని ఎన్నో దేవాలయాలను సందర్శించి 16 వేల పాటలను రచించాడు అంతేకాకుండా ఎన్నో ఇతర రచనలను కూడా చేశాడు.
అరుణగిరి నాధర్ గారు సంగీతం మరియు తాళాలపై లోతైన జ్ఞానం కలిగి ఉండేవాడు ఆయన పద్యాలలో కీర్తనల్లో సాహిత్యపు విలువలతో పాటు భక్తి రసాన్ని కూడా ఆస్వాదించవచ్చు ఎటువంటి స్థితిలో ఉన్నా కూడా వారిపైన భగవంతుడి కృప జాలు వారితే శ్రీ అరుణగిరి నాదర్ లాగా ఒక మహాత్ముడిలా జీవితాన్ని సమర్థవంతంగా సార్ధకం చేసుకోగలుగుతాం కాబట్టి భగవంతుడి కృప కోసం నిరంతరం తపిద్దాం భగవాన్ నామ స్మరణ చేద్దాం శ్రీ అరుణగిరి నాదర్ గారి పాదపద్మములకు నమస్కరిస్తూ....
సర్వేజనా సుఖినోభవంతు...
జై గురుదేవ్ ఓం శ్రీ గురుభ్యోనమః
No comments:
Post a Comment