త్రిపురాంతకం దగ్గర గొల్లేపల్లి అనే ఊరిలో జన్మించారు. శ్రీ రామ యోగి తాత వారు పుట్టిన తర్వాత తండ్రి మరణించారు అయితే తల్లి ఆ చంటి పిల్లాడిని తీసుకొని త్రిపురాంతకం లోని అమ్మవారి దేవస్థానానికి చేరుకొని అక్కడే సేవ చేస్తూ తొమ్మిది సంవత్సరాల వరకు ఆయనను పెంచుతూ ఉండేది అయితే ఆ పిల్లవాడికి రామయ్య అని పేరు పెట్టి అల్లారుముద్దుగా పెంచుకుంటూ ఉండేది.
ఒక సందర్భంలో కరువుతో జనాలు ఇబ్బంది పడుతూ ఉన్న సందర్భంలో బాలుడిగా ఉన్న ఆ రామయ్యను పోషించడానికి ఆమె ఎంతో ఇబ్బంది పడింది పొట్లపాడు అనే గ్రామానికి ఆ తొమ్మిదేళ్ల బాలుడిని తీసుకొని వెళ్ళింది .
ఒక మహానుభావుడు రామయ్యలోని దివ్య శక్తిని గమనించి తన ఇంట్లో పనికి కుదుర్చుకున్నాడు తల్లి తిరిగి త్రిపురాంతకం అమ్మ వారి దగ్గరికి వెళ్లిపోయింది .
కరువుతో ఇబ్బంది పడుతున్న ఆ ఊరి ప్రజలు పశువులకు మేత మరియు నీరు ఎక్కడ దొరుకుతాయి అని ఆలోచించగా గుత్తికొండ బిలంలో మేత మరియు నీరు దొరుకుతాయని అందరూ అనుకున్నారు అందరూ కూడా ఆ బిలం చేరుకున్నారు అయితే ఆ బిలంలోనికి వెళ్లి నీరు తీసుకురాలేకపోయారు ఎవరూ కూడా.
కానీ రామయ్య మాత్రం ఆ నీటిని బిలం లోపలికి వెళ్లి తీసుకొని వచ్చారు ఇక అప్పటినుండి రామయ్యను నీరు తెచ్చే పనికి నియమించారు అక్కడివారు. అలా కొన్ని రోజులు గడిచాయి ప్రతిరోజు ఆ బిలంలోనికి వెళ్లడం అందరికీ వంటకు తాగడానికి నీరు తెచ్చేవారు రామయ్య గారు .కానీ ఒకరోజు లోపలికి వెళ్లిన ఆ రామయ్య తిరిగి రాలేదు ఆ బిలంలో ఎంతోమంది మహాత్ములు తపస్సు చేశారని ప్రతీతి అలా లోపలికి వెళ్లిన స్వామివారికి నలుగురు మునీశ్వరులు ప్రత్యక్షమయ్యారు మొదటి మునీశ్వరుడు రామయ్యకు ఒక వరం ఇచ్చాడు అదేమిటంటే నీటిలో మునిగి ఎక్కడ కావాలంటే అక్కడ నీవు తేలగలవు అని చెప్పి ఆ మునీశ్వరుడు అదృశ్యమయ్యాడు ఇక రెండవ మునీశ్వరుడు రెండవ వరాన్ని ఇచ్చాడు అదేమిటంటే మీ దరికి చేరిన వారి కష్టాలు తొలగిపోతాయి అంటూ చెప్పి ఆ రెండవ మునీశ్వరుడు కూడా అదృశ్యమయ్యాడు ఇక మూడవ మునిశ్వరుడు మూడవ వరాన్ని ఇచ్చాడు నిన్ను తాకిన వారి జబ్బు నశించి ఆరోగ్యం పొందుతారు. ఇక నాలుగవ మునీశ్వరుడు ప్రజలకు శాంతి చేకూర్చి జీవ సమాధి పొందగలిగే యోగశక్తిని పొందగలవు అంటూ ఆశీర్వదించి వారు కూడా అదృశ్యమయ్యారు.
తొమ్మిదేళ్ల వయసులోనే ఆ వరాలు పొందిన తర్వాత ఆ బిలంలో మునిగి త్రిపురాంతకం అమ్మవారి చెరువులో తేలారు రామయ్య అక్కడ 12 సంవత్సరాలు ధ్యానం చేశారు అమ్మవారి దర్శనం లభించింది సిద్ధిని పొందాడు రామయ్య గారు.
తర్వాత త్రిపురాంతకంలో చెరువులో మునిగి పొట్లపాడు చెరువులో తేలారు. దిగంబరంగా సంచరిస్తూ అమ్మవారిని నామాన్ని పలుకుతూ వీధుల వెంట తిరిగేవారు అందరూ పిచ్చివాడు అని అనుకున్నారు అయితే వీధుల వెంట తిరుగుతూ జై త్రిపుర సుందరి దేవి అంటూ ఉండేవాడు .
ఒక వ్యక్తి రామయ్య బిలంలో తప్పిపోయినప్పుడు అతనితో పాటుగా ఉన్న ఆ వ్యక్తి ఈ రామయ్యను గుర్తుపట్టి అందరికీ చెప్పాడు అప్పుడు అందరూ అతడు రామయ్య నే అని నిర్ధారించుకున్నారు .
ఆహారం తినకుండా నీరు తాగకుండా తిరిగేవాడు ప్రజలు ఆశ్చర్యపోయేవారు తర్వాత అక్కడివారికి నిజం తెలిసింది ఒకసారి చెరువు కోసం రెండు వర్గాల మధ్య ఘర్షణ వచ్చింది. ఆ కర్రలతో అందరూ కొట్టుకుంటూ ఉండగా రామయ్య తాతగారు అక్కడకు వచ్చారు పొరపాటున ఒక కర్ర ఆయనకు తగలగా అందరూ బాధపడ్డారు కానీ స్వామి ఒళ్లంతా బురద పూసుకొని చెరువులోకి దూకి మాయమైపోయారు అందరూ ఎంత వెతికినా ఆయన కనపడలేదు ఇక తాత చనిపోయి ఉంటారేమో అని అనుకొని కనపడకపోయేసరికి బాధతో ఏడుస్తూ ఇళ్లకు తిరిగి వెళ్లారు మరుసటి రోజు ఉదయం మళ్లీ అదే చెరువు దగ్గరికి వచ్చారు ప్రజలంతా అప్పుడు స్వామి ఆ చెరువు నుండి బయటకు వచ్చారు తర్వాత ప్రజలంతా స్వామిని క్షమాపణ కోరారు.
పొట్లపాడు గ్రామం మరియు మరొక గ్రామానికి ఒకసారి కోడిపందెం జరుగుతూ ఉండగా గ్రామస్తులు తమ పుంజులు ఒక్కసారైనా గెలిచేలా చేయమని కోరగా స్వామి ఒక తెల్ల కోడి పుంజును చూపాడు ఆశ్చర్యంగా అన్ని కోళ్లపై ఆ తెల్ల కోడి విజయం సాధించింది ఆ క్షణంలో అందరికీ స్వామి మహాత్ముడని మరింత విశ్వాసం పెరిగింది.
కలరా వ్యాపించినప్పుడు స్వామి ప్రజలను రక్షించారు తూర్పు బజారు బావిలో మునిగి పడమట బజారు బావిలో తేలేవారు స్వామి ప్రజలందరూ స్వయంగా ఈ మహత్యాన్ని వీక్షించారు.
ఖండ యోగాన్ని చూపారు స్వామి ఎంతోమందికి ఆరోగ్యాన్ని సంతోషాన్ని అందించారు స్వామి ప్రతి అమావాస్యకు పౌర్ణమికి హోమం జరుగుతుంది ఈ ఆలయంలో శనివారం కూడా భక్తులు వస్తారు. శివరాత్రికి ఘనంగా అన్నదాన కార్యక్రమాలు స్వామివారి దేవాలయంలో జరుగుతూ ఉంటాయి.
స్వామివారు ఒకసారి అందరిపై విరుచుకుపడుతున్న ఆంబోతును అణచి సాత్వికంగా మార్చారు తర్వాత ఆంబోతుపై పిల్లలు ఎక్కి కూర్చుని ఆడుకునేవారు అంతేకాదు రాయిని బెల్లం గా మార్చి పిల్లలకు పంచిపెట్టేవారు స్వామివారు .
ప్రజలు బాలా త్రిపుర సుందరీ దేవిని చూపమని అడగగా ఒక మెరుపుని స్వామి వారు చూపించారు ఆ క్షణంలో అందరూ స్పృహ కోల్పోయారు శ్రీ స్వామి వారు పల్నాడు జిల్లా కారంపూడి మాచర్లకు వెళ్లే దారిలో దుర్గి అనే గ్రామంలో స్వామివారి ఆశ్రమం ఒకటి ఉంది అంతేకాదు కురిచేడు దగ్గర పొట్లపాడు గ్రామంలో శ్రీ స్వామి వారు సమాధి చెందారు ఈ గ్రామం ప్రకాశం జిల్లాలో ఉంది .
శ్రీ స్వామి వారు అందరికీ తెలియజేసి సజీవ సమాధి చెందారు ఎంతోమందికి ఆరోగ్యాన్ని ప్రసాదించి ఆధ్యాత్మిక మార్గంలో జనులను మళ్లించిన శ్రీ గుత్తికొండ బిలం రామయోగ తాత పాదపద్మములకు నమస్కరిస్తూ సర్వేజనా సుఖినోభవంతు
ఓం శ్రీ గురుభ్యోనమః
No comments:
Post a Comment