Saturday, November 12, 2022

మహాయోగి శ్రీశ్రీశ్రీ కనకదాస చరిత్ర

                   కనకదాసు గారి పుట్టినరోజును కర్ణాటకలో ముఖ్యంగా కురుబ సంఘం లో జరుపుకుంటారు 2008వ సంవత్సరంలో కర్ణాటక ప్రభుత్వం ఆయన జన్మదినాన్ని రాష్ట్ర పండుగగా జరుపుకోవాలని నిర్ణయించుకుంది అందుకే నవంబర్ 11 వ తారీకున రాష్ట్ర సెలవు దినంగా ప్రకటించింది కర్ణాటక ప్రభుత్వం.
            కర్ణాటకలోని షిగ్గావ్ ప్రాంతంలోని బాధావద్ద జరిపిన త్రవ్వకాల్లో పురావస్తు శాఖ వారు కనకదాసు యొక్క యుగంగా గుర్తించబడిన కోట రాజభవన శిథిలాలను కనుగొన్నారు ఆ ప్రదేశంలో నూతనంగా కోట రాజభవనం నిర్మించారు 1990లో భారత ప్రభుత్వం కనకదాసు పేరుమీద పోస్టల్ స్టాంప్ ని విడుదల చేసి గౌరవించింది .
      కనకదాస గారు కర్ణాటకలోని బంకాపుర సమీపంలోని బాధా గ్రామంలో కన్నడ కురుబ అంటే గొర్రెల కాపరి హిందూ కుటుంబంలో జన్మించాడు మరియు ఆయన యుక్త వయసులో బంకాపుర కోటలో యోధుడిగా పనిచేశాడు ఒకసారి యుద్ధంలో తీవ్రంగా గాయపడ్డాడు తర్వాత తన వృత్తిని విడిచిపెట్టి సంగీతాన్ని లయబద్ధంగా నిర్మిస్తూ సాహిత్యం రాయటం ప్రజలకు తత్వశాస్త్రాన్ని వివరించడం కోసం తాను తన జీవితాన్ని అంకితం చేశాడు.
             అతని ప్రారంభ రచనలలో నరసింహ స్తోత్రం రామధ్యాన మంత్రం మరియు మోహన తరంగిణి అనే పద్యాలు ఉన్నాయి వ్యాస తీర్థ స్వామీజీ శిష్యుడు కావడంతో కనకదాసు కు ఉడిపి తో అనుబంధం ఏర్పడింది ఆ వ్యాసరాయ స్వామి కనకదాసును గుడిలోనికి అనుమతించమని కోరినా పూజారులు అతని దుస్తులను బట్టి అతడు మరొక కులానికి చెందిన వ్యక్తిగా నిర్ధారించి మఠంలోనికి అనుమతించలేదు కనక దాసు గారిని కృష్ణుని దర్శనానికి అనుమతించనప్పుడు దేవుడు పడమర ముఖంగా వెనక్కు తిరిగాడు కిటికీ గుండా కనకదాసు కు దర్శనం ఇచ్చాడు ఇది నేటికీ ఉడిపిని సందర్శించే భక్తులు కిటికీ ద్వారా ఆయనను చూడవచ్చు.
 నల చరిత్ర, హరి భక్తి సార, నృసింహస్తవ, రామ ధాన్య చరిత, మోహన తరంగిణి వంటి రచనలు చేశారు. 240 కర్ణాటక సంగీత స్వర కల్పనలు వందకు పైగా పాటలు రచించారు గ్రామాధికారిగా పనిచేస్తూ యుద్ధంలో గాయపడ్డ తర్వాత పూర్తి వైరాగ్యంతో తన జీవితాన్ని సమాజం కోసం సమాజం జాగృతం అవ్వటం కోసం వినియోగించిన మహనీయుడు శ్రీశ్రీశ్రీ కనకదాసు గారు.
          కుటుంబంలో నష్టాలు యుద్ధంలో అవమానాల కారణంగా ప్రాపంచిక సుఖాలను తెగించాడు బీరప్ప బచ్చమ్మ దంపతులకు జన్మించారు శ్రీ కనకదాస గారు చివరి రోజుల్లో శ్రీ కనకదాస గారు తిరుపతిలో నివసించారు భారతదేశ సంగీత విద్వాంసులు స్వరకర్తలు కవులు తత్వవేత్తలు సాధువులలో ఈయన కూడా ఒకరు శ్రీకృష్ణుడి యొక్క గొప్ప భక్తులలో శ్రీ కనకదాసు గారు కూడా ఒకరు .1509 సంవత్సరంలో జన్మించి 1609 వ సంవత్సరంలో మరణించారు 100 సంవత్సరాలు జీవించారు శ్రీ కనకదాసు గారు.
     తన భావాలను సమాజంలో ప్రవేశపెట్టి ఎంతో మందిలో జ్ఞానచైతన్యాన్ని ఆధ్యాత్మిక చైతన్యాన్ని కలిగించారు శ్రీ కనకదాసు గారు అటువంటి మహాత్ముని పాదపద్మములకు నమస్కరిస్తూ 
సర్వేజనా సుఖినోభవంతు
 ఓం శ్రీ గురుభ్యోనమః

No comments:

Post a Comment

Demo class 7 days yoga class registration

Loading… ఫారం సబ్మిట్ చేసిన తర్వాత WhatsApp లో మమ్మల్ని సంప్రదించండి 🙏 📲 Contact on WhatsApp Your free book View ...