అప్పటి మహబూబ్నగర్ జిల్లా నాగర్ కర్నూలు తాలూకా మంతటి గ్రామంలో నివసించే పాపమ్మ నారాయణ దంపతులకు ఆగస్టు 17వ తేదీన జన్మించాడు ఒక మగ పిల్లవాడు ఆ మగ పిల్లవాడికి నారాయణస్వామి అని పేరు పెట్టారు మూడవ తరగతి వరకు చదువుకొని తండ్రికి వ్యవసాయంలో సహాయం చేసేవాడు మంతటి ఇటికల గ్రామాల మధ్య పది ఎకరాల మెట్ట భూమి వారికి ఉండేది అయితే వర్షం పడితేనే పంటలు పండి వారి జీవనాధారం గడిచేది. 1961 1965 మధ్యకాలంలో రామచంద్రారెడ్డి దగ్గర లేబర్ కాంట్రాక్టర్ గా పని చేసేవాడు నారాయణస్వామి ఆ కాలంలోనే వ్యక్తిని చూడగానే ఎన్నో విశేషాలు ఆ వ్యక్తుల గురించి చెప్పేవాడు అంటే వారి గతం వారి భవిష్యత్తు ఏమిటో స్వామి వారి ముఖం చూడగానే చెప్పేవాడు అయితే ఒకసారి ఒక వ్యక్తి నారాయణ గారి దగ్గరకు వచ్చి మీ గురువు ఎవరు అని ప్రశ్న వేశాడు అయితే జీవితం పవనం కావాలంటే గురువు యొక్క అవసరం తప్పనిసరి అని భావించి శ్రీశైలం అడవులకి వెళ్ళాడు తన గురువు కోసం వెతుకుతూ అక్కడ శ్రీశైలం అడవుల్లో శిథిలమైపోయిన ఎన్నో గుళ్లను దర్శించుకున్నాడు శివలింగాలు ఎక్కడైనా కనపడితే ఆ శివలింగానికి టెంకాయ కొట్టి అగరత్తులు వెలిగించి అక్కడి నుంచి వెళ్లిపోయేవాడు ఆశన్న అనే హరిజనుడు పని మధ్యలో ఆపడం వలన రామచంద్రారెడ్డికి 1000 రూపాయలు నష్టం వచ్చింది దాన్ని తీర్చడం కోసం ఒక ఎకరం పొలం అమ్మి ఆ పనిని పూర్తిగా మానివేశాడు నారాయణస్వామి మహాదేవుని పేటలో మల్కిదాసు అనే గురువు ఉన్నాడని తెలుసుకొని వెళ్ళాడు ఆయన మహమ్మదీయుడు కానీ అచల సాంప్రదాయాన్ని పాటించే వ్యక్తి పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి వారి కథ చెప్పడంలో ప్రసిద్ధుడు ఆ మల్కిదాసు గారు 1965లో నారాయణను పరిశీలించి పరీక్షించి కారణమిచ్చి దేవానందా అనే దీక్ష నామం ప్రసాదించాడు తర్వాత స్వగ్రామానికి తిరిగి వచ్చి తన పొలంలో ఆశ్రమం ఏర్పరచుకొని సాధన చేసుకునేవాడు గురువు ఆదేశం మేరకు బ్రహ్మంగారికి ఒక మందిరం కట్టించి ఆ గుడి ముందు తన సమాధి కోసం గుంత తవ్వించుకున్నాడు చుట్టుపక్కల గ్రామాల్లో కొందరు స్వామి దగ్గరకు వచ్చి బ్రహ్మంగారిని ఎవరు పూజిస్తారు దర్గా కట్టిస్తే హిందువులు ముస్లింలు అందరూ వస్తారు మీ గురువు కూడా ముస్లింలే కదా అన్నారు 1965 కాజా బందిన వాజ్ అనే దర్గాను కట్టించాడు నారాయణ గారు మొగలాయి సాహెబ్ ఒక పేరుని నిలిపి మరగ దర్గా కట్టించాడు చుట్టుపక్కల గ్రామాల నుంచి పెద్ద ఎత్తున ముస్లింలు రావడం చేత అక్కడ కందూర్లు అంటే జంతుబలులు ప్రారంభమయ్యాయి నారాయణస్వామికి జంతుబలులు ఇష్టం లేదు అయినా ముస్లింలను నిరోధించలేకపోయాడు ఈ సంగతి గురువు మల్కిదాసు కు తెలిసి నారాయణ స్వామిని పిలిపించుకొని మందలించాడు బాధతో తన జన్మ వ్యర్థమైపోయిందని బాధపడుతూ మూడు రోజులు ఆహారం నీరు తీసుకోకుండా మహదేవుని పేట గురువు ఆశ్రమం ఎదుటే పడుకున్నాడు తాళ్లపల్లి రామచంద్రయ్య యోగి అనే ఒక యోగి గారికి ఈ విషయం తెలిసింది అయితే ఆయన నారాయణ స్వామి వారి వద్దకు వచ్చి పాలను తాపించి ఆ దీక్షను విరమింపజేశాడు తర్వాత తన ఆశ్రమంలో 1970లో శివాలయం కట్టించి నీటి వసతి కోసం భావితవ్వించి కొబ్బరి చెట్లు జామ చెట్లు పెంచాడు తర్వాత గురు సన్నిధికి వెళ్లి గురువు చెంత భక్తి ప్రభత్తులతో మెలిగాడు మల్కి దాసు మనసు కరిగి జనవరి 24 1971లో నారాయణస్వామికి బోధాధికారం ఇచ్చి ధ్రువపత్రం అనుగ్రహించాడు తర్వాత ఆశ్రమానికి వెళ్లి సాధన ప్రారంభించాడు హైదరాబాదు వాసి లక్ష్మీనారాయణ స్వామిని చేరుకోగానే అతని మనసు పొరల్లోని విషయాలన్నీ దేవానంద నారాయణ స్వామి వారు చెప్పగానే ప్రధమ శిష్యుడిలా మారిపోయారు లక్ష్మీనారాయణ గారు దినదినానికి శిష్యులు పెరిగిపోతూ ఉన్నారు. సర్వేశ్వరంలో ఉన్న స్వామిని దర్శించడం కోసం అడవి గుండా వెళ్లి తిరిగి అడవిలో నుంచి వచ్చేటప్పుడు వర్షానికి వాగు పొంగింది ఒక పెద్ద బండరాయి మీద స్వామి ఆ వాగులోని కూర్చుని తలపై నీళ్లు పోయించుకొని మూడు గంటలు సమాధి స్థితిలోనికి వెళ్లిపోయారు ఆ సమయంలో ఆ వాగు స్వామి పక్కనుంచి ప్రవహించింది తప్ప స్వామి ఉన్న ప్రదేశంలో వాగు మామూలుగా మాత్రమే ప్రవహించింది ఇది స్వామివారి లీలగా చుట్టుపక్కల గ్రామాల్లో తెలిసింది స్వామివారి మహిమలు తెలిసి ఎంతోమంది పీడితులు బాధితులు స్వామిని చేరి స్వాస్త్యం పొందారు జ్ఞానేశ్వర్ భార్య నీరజ మానసిక వ్యాధి పీడితురాలు ఆవిడ అందరినీ విపరీతంగా తిడుతూ ఉండేది అయితే ఆమె కూడా స్వామి చెంతకు చేరి స్వాస్త్యం పొందింది అలా ఎప్పుడైతే అలాంటి ఆవిడ మారిపోయిందో వారి 30 కుటుంబాల వారు స్వామికి శిష్యులైనారు 1990 నుండి ఆలయాల అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి తన ఆశ్రమంలో శివాలయంతో పాటు వెంకటేశ్వర స్వామి పార్వతీదేవి ఆంజనేయ స్వామి విగ్రహ ప్రతిష్టలు నవగ్రహ ప్రతిష్టలు చేయించి ఒక తేరు కూడా చేయించారు కార్తీక మాసంలో ఒకేరోజు పగలు వెంకటేశ్వర స్వామి కళ్యాణం రాత్రి పార్వతీ పరమేశ్వరుల కళ్యాణం రథోత్సవం చేయించారు స్వామి వారు స్వామి వారు భక్తుల చేత ఎన్నో పుణ్యకార్యాలు చేయించారు శ్రీ స్వామి వారు జనవరి 10 1995 భావ సంవత్సర పుష్య శుద్ధ నవమి మంగళవారం నాడు తనువు చాలించారు ఆయన ఎన్నడో తవ్వించుకున్న గుంతలో శాస్త్రక్తంగా ఆయన సమాధి జరిగింది వేలమంది కన్నీటి ధారలతో ఆశ్రమ ప్రాంగణం బాధాతప్త హృదయాలతో నిండిపోయింది సామాన్యమైన స్థితి నుండి ఆ సామాన్యమైన స్థితికి చేర్చి మనిషిని మహాత్ముడిని చేసి అచల సాంప్రదాయం ఒక గొప్ప గురు మార్గంగా నిలిచింది ఆ గురు మార్గంలో నడిచి జీవితం పావనం చేసుకున్న ఆ అమృతమూర్తి పాదపద్మములకు నమస్కరిస్తూ సర్వేజనా సుఖినోభవంతు జై గురుదేవ్
Subscribe to:
Post Comments (Atom)
Demo class 7 days yoga class registration
Loading… ఫారం సబ్మిట్ చేసిన తర్వాత WhatsApp లో మమ్మల్ని సంప్రదించండి 🙏 📲 Contact on WhatsApp Your free book View ...
-
Loading… ఫారం సబ్మిట్ చేసిన తర్వాత WhatsApp లో మమ్మల్ని సంప్రదించండి 🙏 📲 Contact on WhatsApp Your free book View ...
-
శ్రీ లక్ష్మయ్య స్వామి వారు అనంతపురం జిల్లా ధర్మవరం తాలూకా బత్తలపల్లి మండలం అప్పరా చెరువు అనే గ్రామంలో జన్మించారు .చిన్నప్పటి నుంచి ఆ...
-
Pranayama: The Art of Breath Control Pranayama is a Sanskrit term that translates to "control of breath." It's a vital compone...
No comments:
Post a Comment