Monday, September 4, 2023

పురోహితుడు కూతురు కుపరాబాయి జీవిత చరిత్ర

           భారతదేశంలో ఎంతోమంది సనాతన ధర్మంలో అత్యంత కీలకమైన భక్తి యోగంతో ముక్తిని పొందిన మహాత్ములు ఎందరో ఉన్నారు భగవంతుని నిరంతరం స్మరిస్తూ ప్రతి అణువణువులో భగవంతుని దర్శించిన మహాత్ములైన భరతమాత ముద్దు బిడ్డలు ఎంతో మందికి ఆదర్శం. భక్తి యోగం ద్వారా మహాత్ములైన వారిలో ఒక మహాత్మురాలి గురించి మనం తెలుసుకుందాం.
        పురోహిత పుణ్య దంపతులైన వారి ఇంటిలో సంతానం కోసం ఎన్నో రోజుల నుంచి తపన మొదలైంది పురోహిత దంపతులకు చాలా కాలం వరకు సంతానం లేదు వారు సంతానం కోసం ఎంతో ప్రయత్నాలు చేశారు పూజలు వ్రతాలు దీక్షలు ఇలా ఎన్నెన్నో చేశారు కానీ వారి ప్రయత్నం ఫలించలేదు ఆఖరకు ఒకానొక రోజున చుట్టుపక్కల వారి సమాచారంతో ద్వారకా నగరానికి వెళితే కృష్ణ సేవ చేస్తే మంచి జరుగుతుంది అని తెలుసుకొని ద్వారకా నగరానికి పయనమై వెళ్ళిపోయారు అక్కడే ఉంటూ శ్రీకృష్ణ సేవ చేసుకుంటూ తమ యొక్క సంతానానికి అడ్డుపడే కర్మలను కరిగించుకున్నారు భగవంతుడి దయవలన ఆ కృష్ణుడి యొక్క కృపతో ఒక అందమైన చక్కటి అమ్మాయి జన్మించింది ఆమెకు కుపరాబాయి అని పేరు పెట్టారు.
         అయితే ఆ అమ్మాయి జన్మించేటప్పుడు సాయంగా మంత్రసాని రూపంలో శ్రీకృష్ణుడే వచ్చి సాయం చేసి వెళ్లిపోయాడు తర్వాత అక్కడే ద్వారక నగరంలోనే కుపరాబాయి చిన్నతనం అంతా గడిచింది .చిన్నతనం నుంచే కృష్ణ భక్తిని అలవాటు చేసుకుని తల్లిదండ్రుల నుంచి వచ్చిన ఆ భక్తిని కొనసాగిస్తూ నిరంతరం శ్రీకృష్ణుడి మంత్రాన్ని పటిస్తూ ఉండేది ఆ తర్వాత వాళ్లు తమ సొంతూరికి వెళ్లిపోయారు.
        కానీ కుపరాబాయి మాత్రం నిరంతరము భగవత్ ధ్యానంలో మునిగి ఉండేది శ్రీకృష్ణుడి మంత్రాన్ని నిరంతరము ఆపకుండా జపిస్తూ ఉండేది ఒకానొక దశలో తల్లిదండ్రులు ఆమెకు యుక్తవయసు వచ్చిన తర్వాత పెళ్లి చేశారు ఆ తర్వాత ఆమె భర్తను విడిచిపెట్టి తీర్థయాత్రలు చేసి ఎన్నో ప్రదేశాలు తిరుగుతూ చివరకు ద్వారక చేరుకుంది తండ్రి ఆమెను వెతుకుతూ వెళ్లి ద్వారకా నగరంలో ఉన్న తన కూతుర్ని చూసి ఆనందపడి తన ఇంట ఇంటికి తీసుకెళ్లాడు ఇంటికి తీసుకెళ్లిన తర్వాత కూడా ఆమె ప్రవర్తనలో మార్పు రాలేదు ప్రతినిత్యము భగవత్ ధ్యానంలో లీనం అయిపోయి ఉండేది అలా నిరంతరము ఆమె భగవత్ ధ్యానంలో ఉండటం వలన ఆమెకు వాక్సుద్ధి భవిష్యత్తు భవిష్యత్తు జ్ఞానము కలిగాయి  అయితే తన దగ్గరికి వచ్చిన వారి వ్యక్తుల యొక్క సమస్యలను అత్యంత సులువుగా పరిష్కరించేది.
         ఆమె యొక్క ప్రజ్ఞ విశేషంగా వ్యాపించి ఆమె చుట్టూ ప్రజలు వచ్చి చేరేవారు ఆమె ద్వారా అనేక ఆధ్యాత్మిక విషయాలను తెలుసుకునేవారు తన భక్తుల యొక్క కష్టాలను తీర్చడం కోసం ఆమె భగవంతుని ధ్యానిస్తూ ఉండేది ఒకానొక రోజున తను వచ్చిన కార్యం పూర్తి అయింది అని భావించి ఆమె శ్రీకృష్ణుడిలో ఐక్యం చెందింది.... భక్తి యోగం యొక్క విశిష్టత ఏమిటో కుపరాబాయి జీవితాన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు అటువంటి మహాత్మురాలి పాదపద్మములకు నమస్కరిస్తూ..
 సర్వేజనా సుఖినోభవంతు  ....
జై గురుదేవ్....
 ఓం శ్రీ గురుభ్యోనమః

No comments:

Post a Comment

Demo class 7 days yoga class registration

Loading… ఫారం సబ్మిట్ చేసిన తర్వాత WhatsApp లో మమ్మల్ని సంప్రదించండి 🙏 📲 Contact on WhatsApp Your free book View ...