Monday, September 4, 2023

శ్రీరామ విశ్వంభర దాస్ జటల సాధువు చరిత్ర

       440 సంవత్సరాలు జీవించిన ఒక మహాయోగి గురించి తెలుసుకుందాం రండి....( birth1550- death1993 June 5)
     శ్రీశ్రీ శ్రీ రామ విశ్వంభర దాస్ గారు హిమాలయాలనుంచి కన్యాకుమారి వరకు ప్రయాణించిన ఒక గొప్ప సాధువు ఆయన మొదట్లో నగ్నంగా సంచరించేవారు ఆయనను అందరూ కూడా జటల సాధువుగా పిలుస్తూ ఉండేవారు శ్రీ స్వామివారికి న్యూఢిల్లీలోని ఆల్ ఇండియా మెడికల్ సైన్స్ వారు ఒక వైద్య పరీక్షను నిర్వహించారు ఆ పరీక్షలో 400 సంవత్సరాలు పైగా ఆయన జీవించారని నిర్ధారించబడింది. 
      ఆయన తల్లిదండ్రులకు ఎనిమిదవ సంతానంగా రోహిణి నక్షత్రంలో జన్మించాడు పుట్టినప్పుడు ఆయన నిర్జీవంగా జన్మించి మరణంతో చిన్నప్పటినుంచి ఆడుకోవడం మొదలుపెట్టాడు తాను ఎప్పుడు పిలిస్తే అప్పుడు మరణం వస్తుందని ఆయనకు ముందే తెలుసు కాబోలు.
           ఆ తర్వాత కొంతసేపటికి శ్వాస తీసుకోవడం ప్రారంభించాడు ఆ బాలుడు ముఖంలో ఏదో తెలియని తేజస్సును తల్లిదండ్రులు గమనించారు యుక్త వయసు వచ్చిన తర్వాత తల్లిదండ్రుల అనుమతితో గురుసేవ కోసం మరియు తపస్సు చేయడం కోసం ఇంటిని విడిచి పెట్టాడు ఎన్నో ప్రదేశాలు తిరుగుతూ తపస్సు చేస్తూ ఎంతో మంది మహాత్ములను సేవించి 1850లో సింహాచలానికి వచ్చి స్థిరపడ్డారు .
       ఆయన ఆ సమయంలో నగ్నంగానే సంచరించేవారు తర్వాత భక్తుల కోరిక మేరకు కుంకుమ రంగు దోతిని ధరించడం ప్రారంభించారు ఝాన్సీ లక్ష్మీబాయి ఒకసారి ఆయన ఆశీర్వాదం పొందింది అని ఆయనే స్వయంగా భక్తులకు చెప్పారు శ్రీ స్వామి వారు రోజు గాయత్రీ మాతను పూజించి నవగ్రహ హోమం చేసేవారు అందులో నుండి వచ్చిన హోమ భస్మం భక్తులకు ప్రసాదంగా ఇచ్చేవారు అంతేకాకుండా సమస్యల్లో ఉన్న వ్యక్తులకు తన నమ్మిన వ్యక్తులకు కష్టాల్లో ఉన్న వ్యక్తులకు రోగంతో బాధపడే వ్యక్తులకు కాగితపు ముక్కలను చంపి రక్షగా భక్తులకు ఇచ్చేవారు .
      ప్రస్తుతం ఆయన సమాధి ఆంధ్రాలోని విశాఖ జిల్లా సింహాచలంలోని పర్వతాలలో ఉంది.
       తాను శిరిడి సాయిబాబా గారితో కలిసినప్పుడు హుక్కా సేవించినట్లు స్వయంగా ఆయనే తన భక్తులకు తెలియజేశారు బొబ్బిలి యుద్ధం కాలంనాటి సన్నివేశాలను ఆయన స్వయంగా చూశారని భక్తులతో చెప్పారు మాజీ ప్రధానమంత్రి మాజీ రాష్ట్రపతులు అంతేకాకుండా జ్ఞానీ జైల్ సింగ్ మరియు వివి గిరి ఆనాటి ముఖ్యమంత్రిలు మర్రి చెన్నారెడ్డి వంటి ఎంతో మంది ప్రముఖులు ఆయన యొక్క ఆశీర్వాదం పొందడం కోసం వచ్చి ఆయన ఆశీస్సులు తీసుకున్నారు .
        ఈ మధ్యనే హైదరాబాద్లో ఈ మధ్యనే హైదరాబాదులో మియాపూర్ లో కూడా స్వామివారికి సంబంధించిన ఒక ప్రతిమతో ఒక కేంద్రాన్ని కూడా ఏర్పాటు చేశారు భక్తులు శ్రీ రామ విశ్వంభరదాసు జటల సాధువు గారు 440 సంవత్సరాలు పైగా జీవించి ఎంతోమందిని తన యొక్క యోగశక్తితో ఆధ్యాత్మిక శక్తితో తన వైపు ఆకర్షించుకొని ఆధ్యాత్మిక విలువలని యోగ విలువల్ని సమాజానికి తెలిసేలా చేశారు....
సర్వేజనా సుఖినోభవంతు..... ఓం శ్రీ గురుభ్యోనమః

No comments:

Post a Comment

Demo class 7 days yoga class registration

Loading… ఫారం సబ్మిట్ చేసిన తర్వాత WhatsApp లో మమ్మల్ని సంప్రదించండి 🙏 📲 Contact on WhatsApp Your free book View ...