ఏడవ శతాబ్దానికి చెందిన మహాత్మారాలు శ్రీ ఆండాలు గారు ఈమెను గోదాదేవి ,కోటై ,నాచియార్ అని కూడా పిలుస్తారు ఈవిడ గొప్ప కవి మరియు సన్యాసిని తమిళనాడు రాష్ట్రంలో ఎన్నో ఆలయాలు శ్రీ గోదాదేవి గారికి ఉన్నాయి.
శ్రీ గోదాదేవి గారు రెండు గొప్ప తమిళ రచనలు చేశారు అందులో ఒకటి తిరుప్పావై మరొక నాచియార్ తిరుమొడి.
తమిళనాడులోని శ్రీ విళ్లి పుత్తూరులో ఆమె జన్మించారు ఈవిడను భూదేవి అంశగా భక్తులు భావిస్తారు పెరియాళ్వారనే విష్ణు భక్తుడు సంతానం కోసం భగవంతుని ప్రార్థించగా ఒకరోజు గుడి లోపల తోటలో తులసి మొక్క కింద ఒక అమ్మాయి కనిపించింది ఆ అమ్మాయికి కోటై అని పేరు పెట్టి పెంచుకున్నాడు అయితే ఒకసారి ఆలయంలో ప్రధాన దేవత విగ్రహానికి మాల వేయకముందే ఆ మాలను ఆ అమ్మాయి ధరించగా పెరియాల్వార్ వారు చాలా బాధపడి కూతుర్ని తిట్టాడు.
అయితే పెరియాల్వరుకు రాత్రి కలలో శ్రీ మహావిష్ణువు కనబడి తనకు కోటై ధరించిన మాలను మాత్రమే అంకితం చేయమని కోరాడు అయితే ఆ మాలను విగ్రహానికి వేయగా విష్ణువు బంగారంగా మారిపోయాడు అప్పుడు కోటై అనే ఆ అమ్మాయికి ఆండాలని పేరు మార్చారు.
శ్రీ ఆండాళ్ భక్తి పూర్వక వాతావరణం లో పెరగటం వల్ల దేవున్ని మాత్రమే వివాహం చేసుకోవాలని ఉచ్చుకత పెరిగింది తిరువరంలోని రంగనాథర్ ని వివాహం చేసుకోవడం గురించి ఆమె నిరంతరం ఆలోచించేది రంగనాథర్ గారు అంటే విష్ణు యొక్క నిద్రించే రూపం ఆమె తన రచనల ద్వారా ఎంతో మందిలో భక్తి జ్ఞానాన్ని ప్రేరేపించింది.
భగవంతుని పాదాల వద్ద శరణాగతి పొందడమే జీవిత పరమావధి అని నొక్కి చెబుతూ ఉండేది తమిళల ప్రసిద్ధ కవి సన్యాసులలో ఆండాలు ఒకరు.
తమిళనాడులో ఆండాళ్ ఒక సాధువు కంటే ఎక్కువగా కొలవబడుతుంది అనేక విష్ణు ఆలయాలలో శ్రీ ఆండాలు గారి కోసం ఒక మందిరం అంకితం చేయబడింది శ్రీ వెళ్లి పుత్తూరు ఆలయంలోని ఆండాలకు ధరించిన దండలు ఆంధ్రప్రదేశ్ లోని తిరుపతిలోని వెంకటేశ్వర ఆలయానికి పంపబడతాయ శ్రీ శ్రీ రంగనాథ స్వామి దేవాలయంలోని రంగనాథుడు ఆండాలను వివాహం చేసుకున్నాడని ఆ తర్వాత ఆమె ఆ విగ్రహం లోనే కలిసిపోయిందని భక్తులు నమ్ముతారు.
శ్రీ ఆండాళ్ రంగనాథుడిని వివాహం చేసుకున్నందుకు ఆ అధిష్టాన దేవతను రంగమన్నారు అని పిలుస్తారు.
శ్రీ ఆండాలు గారు రచించిన తిరుప్పావై వేదాల మకరందమని తాత్విక విలువలు నైతిక విలువలు స్వచ్ఛమైన భక్తి ప్రేమ అంకితభావం ధర్మాలు, లక్ష్యాలు మరియు జీవిత పరమార్ధాన్ని బోధించేదని చెబుతారు శ్రీ ఆండాల్ గారి విగ్రహ కేశాలంకరణ మరియు అలంకారాలు ప్రాచీన తమిళ సంస్కృతిని ప్రతిబింబించే విధంగా ఉంటాయి వెంట్రుకలు కుచ్చును పక్కకు కట్టి మల్లెపూలు మరియు విస్తారమైన ఆభరణాలతో అలంకరిస్తారు అమ్మవారి విగ్రహాన్ని శ్రీ వెళ్లి పుత్తూరు ఆండాలు చేతిలో రూపొందించిన చిలుకను ప్రతిరోజు ఎంతో కష్టంతో తయారుచేస్తారు ప్రతిరోజు కూడా తాజాపచ్చి ఆకులతో తయారుచేస్తారు ఈ చిలుక ఆండాల్ గారి యొక్క ఎడమ చేతిలో ఉంచబడుతుంది ఈ చిలుకను తయారు చేయడానికి దాదాపు నాలుగున్నర గంటలకంటే ఎక్కువ సమయం పడుతుంది. ఈ చిలుకను తయారు చేయటానికి ముక్కు మరియు నూటికి దానిమ్మ పువ్వు కాళ్లకు వెదురు కర్రలు, అరటి మొక్క, నందివర్ధనాలు ,గులాబీలను ఇతర పుష్పాలను కూడా ఉపయోగిస్తూ ఉంటారు.
శ్రీ అండాల్ గారు తన రచనల్లో తిరుప్పావై ఎక్కువ ప్రచారంలో ఉండేట్టుగా ఆవిడ రచించారు ఇది 30 శ్లోకాలతో కూడి ఉంటుంది భక్తి మార్గంలో జన్మ ధన్యం గావించుకున్న మహాత్మురాలు శ్రీ గోదా దేవి గారి పాదపద్మములకు నమస్కరిస్తూ ....
సర్వేజనా సుఖినోభవంతు జై గురుదేవ్ ఓం శ్రీ గురుభ్యోనమః
No comments:
Post a Comment