చిన్నప్పటినుంచి పేదరికంలో ఉన్న ప్రజల పట్ల జాలి దయా ప్రేమను కలిగి ఉండేది ఇబ్బందుల్లో ఉండే వారి కోసం తన ఇంట్లో నుండి బట్టలు ఆహారం తెచ్చి పంచుతూ ఉండేది కానీ ఆమె కుటుంబం కూడా పేదవారు కావడం వల్ల ఇంట్లో వారందరూ ఆమెను తిట్టేవారు కానీ ఆమె తన సేవను ఆపలేదు తన లోపలి నుండి అందరి పట్ల ఉప్పొంగే ప్రేమను అందరికీ పంచాలని భావనతో దుఃఖంలో ఉండే వారిని ఓదార్చడానికి ఆకస్మికంగా కౌగిలించుకోవడం ప్రారంభించింది.
ఆవిడ కౌగిలించుకోవడం వల్ల వెంటనే వాళ్ళ సమస్యలు తీరిపోతూ ఉండేవి ఇతరులను ఆలింగణం చేసుకోవాలనే తన కోరికను గురించి అమృతానందమయి అమ్మగారు ఇలా వ్యాఖ్యానించారు" నేను కౌగిలించుకునేటప్పుడు అది పురుషుడా స్త్రీ అని నేను చూడను నా స్వభావానికి భిన్నంగా నేను ఎవరిని చూడను" నా నుండి నిరంతరం ప్రేమ ప్రవాహం అందరికీ ప్రవహిస్తుంది. అందరూ నా బిడ్డలే ఇది నా సహజ స్వభావం రోగులకు చికిత్స చేయడమే వైద్యుని యొక్క కర్తవ్యం "నేను మీ అందరి యొక్క వైద్యురాలిని" అని అమృతానందమయం అమ్మవారు చెప్పేవారు అమృతానందమయి గారు తన పెళ్లికి ఏర్పాట్లు చేసిన ఆమె తిరస్కరించింది .
1981లో మాత అమృతానందమయి మఠం స్థాపించబడింది అమ్మ మఠానికి అధిపతిగా కొనసాగుతున్నారు నేను ఈ మఠం అనే ఆధ్యాత్మిక ధార్మిక కార్యక్రమాలలో నిమగ్నమై ఉంది 1987లో భక్తుల కోరిక మేరకు ప్రపంచవ్యాప్తంగా ఉన్న దేశాలలో కార్యక్రమాలను నిర్వహించడం ప్రారంభించింది శ్రీ అమృతానందమయి 30 సంవత్సరాలలో ప్రపంచవ్యాప్తంగా 33 మిలియన్ల కంటే ఎక్కువ మంది ప్రజలను ఆలింగణం చేసుకొని తన ప్రేమకు హద్దులు లేవని చాటుకున్నారు ఆమెను చూడటానికి వచ్చే ప్రజల కోసం ఒక్కొక్క రోజు 20 గంటలకు పైగా దర్శనమిచ్చిన సందర్భాలు ఉన్నాయి.
ధ్యానం కర్మయోగం నిస్వార్థ సేవ, కరుణ ,ఓర్పు క్షమాగుణం ,స్వీయ నియంత్రణ వంటి ఎన్నో దైవిక లక్షణాలను గురించి అమ్మ బోధిస్తూ ఉండేది.
ఆమె ఐక్యరాజ్యసమితిలో అనేకసార్లు ప్రసంగించారు మరియు ప్రపంచ మతాల పార్లమెంటులో రెండుసార్లు ప్రసంగించారు శ్రీ అమృతానందమయి అమ్మ 35 భాషల్లో 1000 కంటే ఎక్కువ భజనలను భక్తి గీతాలను పాడారు అమ్మ స్థాపించిన ఎంబ్రాసింగ్ ది వరల్డ్ సంస్థ పేదలకు ఆహారం నివాసం ఆరోగ్య సంరక్షణ విద్య మరియు జీవనోపాధి వంటి ఐదు ప్రాథమిక అవసరాలను అందించాలని లక్ష్యంతో పని చేస్తూ ఉంది అమ్మ మఠం.
వివిధ కేంద్రాల ద్వారా సంవత్సరానికి 10 మిలియన్ల మందికి ఉచిత భోజనాన్ని అందిస్తోంది 5000 గ్రామ కేంద్రాలలో స్వచ్ఛమైన తాగు నీటిని అందించటంతో తోడ్పడునందిస్తోంది ఇది 10 మిలియన్ల గ్రామస్తులకు నీటి శుద్ధికరణను అందిస్తోంది నిరాశ్రయుల కోసం 47 వేల గృహాలను నిర్మించింది నాలుగు మిలియన్ల మందికిపైగా ప్రజలకు పూర్తిగా ఉచిత వైద్యాన్ని అందించింది కొచ్చిలో 11 పడకల ఆసుపత్రి, హర్యానాలో 2600 పడకల ఆసుపత్రి నిర్మించి ఉచిత వైద్యాన్ని అందిస్తోంది అమ్మ లక్షల మందికి జీవితకాల పెన్షన్లను అందిస్తోంది 2 లక్షల మందికి స్వయం సహాయక సంఘాలకు ఉపాధి కార్యక్రమాలను ఏర్పాటు చేసింది అమ్మ. 50 వేల మంది పేద విద్యార్థులకు స్కాలర్షిప్ ప్రోగ్రామ్లను కూడా నిర్వహిస్తోంది .
అమ్మ 2001 గుజరాత్ భూకంప సమయంలో 2004లో సునామీ వచ్చినప్పుడు బీహార్ లో మహారాష్ట్రలో వరదలు వచ్చినప్పుడు ఎన్నో భూకంపాలు వచ్చినప్పుడు అమ్మ మఠం లక్షలాది మందిని ఆదుకుంది పుల్వామా దాడిలో మరణించిన 40 మంది సిఆర్పిఎఫ్ జవాన్ల కుటుంబాలకు ఒక్కొక్కరికి ఐదు లక్షల సహాయం చేసింది అమ్మ మఠం 2012లో ప్రపంచంలో అత్యంత ఆధ్యాత్మికంగా ప్రభావంతమైన వ్యక్తుల్లో 100 మంది వ్యక్తుల్లో ఒకరుగా నిలిచారు.
లక్షల మందికి ఆదర్శవంతమైన జీవితాన్ని కొనసాగిస్తున్న అమ్మ దర్శనం కోసం వెళ్లేవారు నిజంగా అదృష్టవంతులే అటువంటి గొప్ప కార్యాలను నిర్వహించిన మాత అమృతానందమయి గారి పాదపద్మములకు నమస్కరిస్తూ ......సర్వేజనా సుఖినోభవంతు....... ఓం శ్రీ గురుభ్యోనమః
No comments:
Post a Comment