ఒకప్పటి బ్రిటిష్ ఇండియాలోని పబ్నా జిల్లాలోని హిమాయత్ పూర్ అనే గ్రామంలో బ్రాహ్మణ దంపతులైన శివచంద్ర చక్రవర్తి మరియు మోహిని దేవి అనే పుణ్య దంపతులకు సెప్టెంబర్ 14న 1888 వ సంవత్సరంలో జన్మించాడు అనుకూల చంద్ర చక్రవర్తి గారు ఆయన 1911లో కలకత్తాలో వైద్య విద్యను అభ్యసిస్తూనే చుట్టుపక్కల మురికివాడల్లో నివసించే వారికి చికిత్స చేయడం ప్రారంభించాడు.
ఆరు సంవత్సరాల వైద్య విద్య పూర్తయిన తర్వాత హిమాయత్పూర్ కి తిరిగి వచ్చి వైద్యం చేయటం ప్రారంభించాడు 1913 వ సంవత్సరంలో తల్లి ద్వారా ఆధ్యాత్మిక దీక్షను పొందాడు ఆ తర్వాత ఆ దీక్షను సాధన చేస్తూ గడిపాడు .
అలా సాధన చేసే సమయంలో సమాధి స్థితికి చేరుకొని ఆ స్థితిలో నుండి పవిత్రమైన సందేశాలను అందించేవాడు అది ఎంతో మంది దృష్టిని ఆకర్షించింది ఎంతోమంది ఆయనను చూడటానికి వచ్చి అతని దగ్గరే శాశ్వతంగా స్థిరపడటం ప్రారంభించారు క్రమంగా అతని గ్రామం ఆశ్రమంగా మార్చబడింది .
ఆయన ఎంతోమందికి మార్గదర్శకుడయ్యాడు ఎంతగా అంటే ఆయన భక్తులు ఆయనను ఒక యుగ పురుషోత్తముడిగా తలిచేవారు ఆయన జనవరి 27 1969 వ సంవత్సరంలో మరణించారు.
ఆయన సేవకు గుర్తుగా భారత ప్రభుత్వం 1987లో స్మారక తపాలా స్టాంపును కూడా విడుదల చేసింది అనుకూల చంద్ర ఠాకూర్ గారు సత్సంగ్ అనే ఆశ్రమాన్ని డియోగర్లో ఏర్పాటు చేశారు ఈ ఆశ్రమం ద్వారా సామాజిక ఆధ్యాత్మిక కార్యక్రమాలు నేటికీ జరుగుతూ ఉన్నాయి.
ఉచిత ఆసుపత్రి ఉచిత బహుజన సౌకర్యం ఉచిత పాఠశాలలను ఈ ఆశ్రమం నిర్వహిస్తోంది అంతేకాకుండా సత్సంగ్ ఆశ్రమంలో వేద అధ్యయనాలు జరుగుతాయి గోశాలను కూడా నిర్వహిస్తున్నారు.
ఈ ఆశ్రమానికి ప్రతినిత్యము వేల సంఖ్యలో జనులు హాజరవుతారు ఎంతగా అంటే 2012 సెప్టెంబరు లో శ్రీ అనుకూల చంద్ర ఠాకూర్ గారి 125 వ జయంతి రోజున దాదాపు రెండు లక్షల మందికి పైగా హాజరైనప్పుడు తొక్కిసలాట జరిగి సత్సంగ ఆశ్రమంలో 12 మంది మరణించారు 30 మంది వ్యక్తులు గాయపడ్డారు.
శ్రీ ఠాకూర్ గారు స్థాపించిన సత్సంగ్ ఆశ్రమానికి బంగ్లాదేశ్ ,బర్మ, యూరప్, మిడిల్ ఈస్ట్ ,ఆఫ్రికా మరియు అమెరికాలో రెండు వేలకు పైగా శాఖలు ఉన్నాయి అంతేకాదు దాదాపుగా 80 మిలియన్ల మంది సభ్యులతో అత్యంత వేగంగా అభివృద్ధి చెందిన ఆధ్యాత్మిక కేంద్రంగా పిలువబడుతోంది.
ఈ సత్సంగ్లో ఉండే సభ్యులందరినీ సత్సంగులు అంటారు ఈ సత్సంగ్ సభ్యులతో అన్ని మతాల కు చెందిన వ్యక్తులు ఉన్నారు శ్రీ ఠాకూర్ గారు ఏ మతాన్ని తిరస్కరించలేదు మతాలన్నీ ధర్మాలు అని బోధించడం వల్ల హిందువులు, ముస్లింలు, క్రైస్తవులు ఇతర ఇతర మతాలవారు వేగంగా సత్సంగ్ పట్ల ఆకర్షితులయ్యా.
రు ఈ ఆశ్రమంలో శ్రీ అనుకూల చంద్ర ఠాకూర్ జయంతి ఆయన భార్య శ్రీ బోరోమా జయంతి ఆయన పెద్ద కుమారుడు శ్రీ బోర్డ జయంతి ప్రస్తుత ఆచార్యదేవ్ అశోకే చక్రవర్తి జన్మదినోత్సవాలను ప్రతి సంవత్సరం ఘనంగా జరుపుతారు.......
ఒక డాక్టర్ యోగిలా మారితే శ్రీ అనుకూల చంద్ర చక్రవర్తిల మారగలడు అని నిరూపించిన మహాత్ముడైన శ్రీ అనుకూల చంద్ర గారి పాదపద్మములకు నమస్కరిస్తూ...... సర్వేజనా సుఖినోభవంతు
జై గురుదేవ్....
ఓం శ్రీ గురుభ్యోనమః.......
No comments:
Post a Comment