Monday, September 4, 2023

శ్రీ శ్రీ భక్తి హృదయ భాను చరిత్ర

      గౌడీయ వైష్ణవ బ్రాహ్మణ కుటుంబంలో వేద పండితులైన బ్రహ్మ ఋషి రజినీకాంత పుణ్య దంపతులకు 1901 వ సంవత్సరంలో బెంగాల్లో నరేంద్రనాథ్ ముఖర్జీ జన్మించారు.
        ఆయన వయసు పెరిగే కొద్దీ భక్తి సిద్ధాంతం వైపు ఆకర్షించబడ్డారు బ్రహ్మచారిగా భక్తి సిద్ధాంత సరస్వతి ఠాగూర్ వద్దకు చేరుకొని భక్తి సిద్ధాంతాన్ని పాటిస్తూ దీక్ష తీసుకున్నారు ఆ క్షణం నుండి ఆయన పేరు భక్తి హృదయ భానుగా మారిపోయింది.
       భక్తి మార్గంలో తన జీవితాన్ని ఆయన మహాత్ముడిగా మలుచుకునేందుకు భగవంతుని నిరంతరం స్మరిస్తూ ఉండేవాడు భగవాన్ నామాన్ని నిరంతరం పటిస్తూ ఉండేవాడు 1924వ సంవత్సరంలో 23 ఏళ్ల వయసున్నప్పుడు భక్తి సిద్ధాంత సరస్వతీ ఠాకూర్ ప్రభుపాదుల వారి నుంచి జీవితకాల త్రిదండ సన్యాసాన్ని ఆయన స్వీకరించారు.
      ఆయన భారతదేశం అంతట అనేక ఉపన్యాసాలు ఇస్తూ చైతన్య మహాప్రభు సందేశాన్ని బోధించాడు అత్యంత వేగంగా ఆయన ఉపన్యాసాల పట్ల ప్రజలు ఆకర్షితులయ్యారు అతను మద్రాసులో గౌడీయ మఠాన్ని స్థాపించాడు బోధకుడిగా ఎంతో విజయవంతమై ఆ కాలంలో భారతదేశమంతటా ప్రసిద్ధి చెందాడు.
        అతని కులం మరియు ఉన్నత విద్యాభ్యాసం కారణంగా భక్తి సిద్ధాంత సరస్వతి స్వామి వారు భక్తి హృదయ భాను గారిని జర్మనీకి పంపించారు అక్కడ ఆయన తన సందేశాలను వినిపించారు 1942లో గురువుగారు మరణించిన తర్వాత మఠానికి తదుపరి ఆచార్యుడిగా భక్తి విలాస్ తీర్థ గారిని అంగీకరించాడు.
        శ్రీ భక్తి హృదయ భాను గారు తీవ్రమైన తపస్సు చేయడం కోసం ఏకాంతంగా కాలినడకన హిమాలయాలకు వెళ్ళాడు అయితే ఈ దీక్ష కాలంలో ఆయన కొన్ని ప్రమాణాలు చేసుకున్నారు.
 అందులో మొదటిది ఎవ్వరితోనూ మాట్లాడకూడదు, రెండవది చెట్లనుండి పండ్లు మరియు కాయలను మాత్రమే తినాలి, మూడవది నేలపై ఒట్టి శరీరంతో నిద్రించాలి, నాలుగవది మహా మంత్రాన్ని జపించకుండా ఒక్క అడుగు కూడా వేయకూడదు ఇలా నాలుగు ప్రమాణాలు చేసుకున్నారు.
         ఆ తర్వాత 650 మైళ్ళు కాలినడకన నడిచి ఎన్నో రోజులపాటు ఆయన తపస్సు చేస్తూ ఎన్నో సంవత్సరాల పాటు భగవద్ ధ్యానంలో గడిపి భజన చేస్తూ గడుపుతూ ఉండేవాడు తర్వాత బృందావన్ కి తిరిగి వచ్చి పదవి విరమణ చేసి అక్కడ ఒక చిన్న భజన కుటీర్ని నిర్మించాడు ఆయన బోధనల వల్ల బెంగాల్లో వేల మంది ఆయనకు శిష్యులుగా మారిపోయారు.
         భక్తి హృదయ భాను గారు పాఠశాలలను విద్యాలయాలను మరియు కొన్ని  ఆశ్రమాలను స్థాపించారు ఎన్నో రచనలు చేశారు ఉత్తర ప్రదేశ్ లోని బృందావన్ లోని తన భజన కుటీర్లో జూలై ఏడవ తేదీ 1982న రాత్రి 9 గంటల నాలుగు నిమిషాలకు తన శిష్యుల సహవాసంలో మరణించారు భక్తి సిద్ధాంతాన్ని పాటిస్తూ భక్తి శక్తితో ముక్తి పొందిన మహా వ్యక్తి శ్రీ భక్తి హృదయ భాను గారి పాదపద్మములకు నమస్కరిస్తూ ......సర్వేజనా సుఖినోభవంతు ....
జై గురుదేవ్ ఓం శ్రీ గురుభ్యోనమః

No comments:

Post a Comment

Demo class 7 days yoga class registration

Loading… ఫారం సబ్మిట్ చేసిన తర్వాత WhatsApp లో మమ్మల్ని సంప్రదించండి 🙏 📲 Contact on WhatsApp Your free book View ...