Sunday, January 31, 2021

మహాత్ముల జీవితాలు ఎందుకు

         మహాత్ముల జీవిత విశేషం ఎందుకు తెలుసుకోవాలంటే

                         ఇప్పటివరకు మనం శ్రీ జ్ఞాన యోగ ఛానల్ లో ఎంతోమంది మహాత్ముల జీవితాలను గురించి తెలుసుకున్నాం.                  అయితే మహాత్ముల జీవితాలను గురించి ఎందుకు తెలుసుకోవాలి అంటే....

 మనిషి యొక్క లక్ష్యం ఏమిటి?

 మనిషి ఎంత ఉన్నతంగా ఎదగగలడు?

 గురువు యొక్క ఆవశ్యకత ఏమిటి?

 మహాత్ముల సాంగత్యము వలన ఏమి లభిస్తుంది?

 భగవంతుని శక్తిని మనిషి ఏ విధంగా ఉపయోగించుకోవాలి ?

మానవ జీవితాన్ని ఎవరికోసంగడపాలి?

త్యాగం అంటే ఏమిటి?

 భక్తి అంటే ఏమిటి?

 మానవ జీవితానికి ఏమి అవసరం?

 మానవ జీవిత పరమార్థం ఏమిటి?

 ఇలాంటి ఎన్నో విషయాలను గురించి సంపూర్ణంగా తెలుసుకునే అవకాశం మనకు మహాత్ముల చరిత్రల వలన తెలుస్తుంది అందుకే రోజుకు ఒక మహాత్ముడి జీవితాన్ని తెలుసుకోవడానికి ప్రతి రోజూ పది నిమిషాలు సమయాన్ని కేటాయిస్తే మనలోని లోపాలు కరిగిపోయి ఉన్నత లక్షణాలు అలవడతాయి.






Friday, January 22, 2021

అవధూతలు అంటే ఎవరు ?

        అవధూతలు అంటే ఎవరు 


        సామాన్యంగా జన్మించి అసామాన్యమైన స్థితిని కలిగి జనులను తరింపజేస్తునే, ఒక్కోసారి బాలుడిలా ఇంకోసారి ఉన్మత్తుడిలా మరోసారి పిచ్చివాడిలా కనబడేట్టు గా జనులను భ్రమింపజేసే మహాత్ములు అవధూతలు .

     ప్రకృతిని పంచభూతాలను నిలువరించే శక్తిని కలిగినవారు అయినప్పటికీ సహజసిద్ధంగా జీవిస్తూ ఉంటారు.అన్ని స్థితుల యందు సమస్థితిని కలిగి సమదృష్టితో జీవన ప్రయాణం చేస్తూ ఉంటారు.

     మాయను అధిగమించిన వారు మాయ మోహితుల పాలిట దైవం లా కనిపించి జనుల కష్టాలకు, సమస్యలకు సమాధానం అవుతారు. ఎటువంటి సమస్యలనైనా సుఖ సంతోషాలను ఎండకు వానకు చలికి దేనికి చలించరు.

     ఒక్కోసారి దివ్య రూపంతో మరోసారిదిగంబర రూపంతో దర్శనమిచ్చే వారి దివ్య దేహం శ్రీ గురు దత్తాత్రేయుని అంశంలో భాగమే.

    స్నానం చేయకపోయినా దివ్యపరిమళాలు వీచటం వారి దేహం సహజ స్వభావం ,వారి చెయ్యి తగిలిన వెంటనే బాధలు సమసిపోతాయి, వారు అడుగిడిన చోట కష్టాల కర్మలు కరిగిపోతాయి.

       అవధూతల సేవ లో జీవించే వారి జన్మలు చరితార్థం అవుతాయి. అవధూతల తో సహచర్యం జ్ఞానానికి దారితీస్తుంది. వారితో పాటుగా నడిచే నడక తో సేవాభావం ఉప్పొంగుతుంది.

     అవధులు లేని భగవంతుడి దూతలు అవధూతలు అలౌకికమైన స్థితిలో నిరంతరం పరమానందాన్ని అనుభవిస్తూ ఉంటారు ఆకలిదప్పులకు నిద్రాహారాలకుఅతీతం వారి జీవితం.మౌనంగా జీవించే అవధూతలు కొందరైతే తమ ఉప దేశాలతో ప్రజల్లో ఆధ్యాత్మిక చైతన్యం కలిగించే వారు ఇంకొందరు.

          తమను నమ్మిన వారిని నమ్మని వారిని సైతం కన్నబిడ్డల్లా గా భావించి దీవించే వారు అవధూతలు. గొప్ప ఆధ్యాత్మిక శక్తిని కలిగి మహోన్నత స్థితి అయిన సమాధి స్థితిని నిరంతరం అనుభవిస్తూ ఉండి ఆ స్థితినుండి సర్వమును అవగతం చేసుకుంటారు ప్రకృతి కదలికలను మనోనేత్రంతో వీక్షించగలరు.

       బ్రహ్మ జ్ఞానం ఉన్నా సరే అజ్ఞానుల మధ్య అతి సామాన్యంగా సంచరించే త్రిమూర్తి స్వరూపులు అవధూతలు.

సర్వేజనా సుఖినోభవంతు‌....

 మీ మధు గురూజీ....

 జై గురుదేవ్.....

ఓం శ్రీ సాయిరాం.

     

 




Thursday, January 21, 2021

కొమరం భీమ్ జీవితం

కొమరం భీమ్ జీవితం

కొమరం భీం గారి జీవిత విషయానికి వస్తే సంఘాన్ని ఉద్ధరించడానికి మహాత్ములు ఆధ్యాత్మిక మార్గాన్ని ఎన్నుకొంటారు. అది వారిలోని దైవిక స్థితికి నిదర్శనం.అయితే మనుషుల్లో ఉన్నతమైన భావాలు కలిగి ఏం చేసినా సరే తమ సంఘాన్ని ఉద్ధరించాలని ఆలోచనలు కలిగిన వ్యక్తులు సంఘసంస్కర్తలు. అటువంటి సంఘ సంస్కర్తలలో కొందరు శాంతియుత మార్గాన్ని అవలంభిస్తారు. కానీ మరికొంతమంది ది విప్లవ భావాలతో తమ సంకల్పాలను నెరవేర్చుకోవాలని ఆశించి ఆ దారిలో పయనిస్తారు ఏది ఏమైనా  ప్రజల హక్కులను కాపాడివారి జీవితాలను ఉన్నతంగా మార్చడమే ఉన్నతమైన భావాలు కలిగి ఆదివాసీల హక్కులకై పోరాడి వారి హృదయాల్లో శాశ్వతంగా నిలిచిపోయిన మనిషి శ్రీ కొమరం భీమ్ గారు.                                పంతొమ్మిది వందల సంవత్సరంలో లో ఆదిలాబాద్ జిల్లా ఆసిఫాబాద్ తాలూకా లోని సంకేపల్లి గ్రామంలో జన్మించాడు కొమురం భీం అయితే అతనికి 15 సంవత్సరాల వయసు ఉన్నప్పుడు అతని తండ్రి అటవీశాఖ సిబ్బంది జరిపిన దాడిలో మరణించాడు.
              తర్వాత కుటుంబం కరిమెర ప్రాంతంలోని ని సర్దాపూర్ కు వలస వెళ్ళింది అక్కడ  ప్రశాంతంగా జీవించాలని అనుకున్నారు కాని అక్కడ కూడా ప్రశాంతంగా జీవించడం సాధ్యం కాలేదు సిద్ధికి అనే జాగీర్దార్ కొమరం సాగుచేస్తున్న భూమిని ఆక్రమించాడు దాంతో విపరీతమైన కోపంతో ఊగిపోయి ఒకానొక రోజున ఆ సిద్ధికి ని చంపేసి బలార్షా  మీదుగా అస్సాం చేరుకున్నాడు కొమరం భీమ్ అక్కడ ఐదు సంవత్సరాల పాటు గడిపాడు అక్కడి కాఫీ తేయాకు తోటల్లో పనిచేస్తూ గడించిన రాజకీయ పోరాట అనుభవంతో మళ్లీ కరిమెర ప్రాంతానికి వచ్చాడు .
                అయితే ఆ రోజుల్లో నిజాం నవాబు ఆదివాసీల పై విపరీతంగా పన్నులు విధించి వసూలు చేసేవాడు అడవిలో పశువులు ఎందుకు తెచ్చుకున్నందుకు పన్నులు వసూలు చేస్తూ ఆదివాసీలను ఎంతో ఇబ్బంది పెట్టే వాడు .తమ జాతి యొక్క స్వేచ్ఛ స్వాతంత్ర్యం పై నిజాం యొక్క ఆగడాలను ప్రశ్నిస్తూ కొమరంభీమ్ గంభీరంగా ప్రసంగించే వాడు ఆ గంభీరమైన ప్రసంగాలకు ప్రజల్లో పోరాట జ్వాలలురగిలేవి. ఆసిఫాబాద్ పరిసర ప్రాంతాలు పోరాట కేంద్రాలుగా మారిపోయాయి జోడేఘాట్ గుట్టల్లో పోరాట జ్వాలలు ఎగిసిపడేవి.
            నిజాం సైన్యం పైన అటవీ సిబ్బంది పైన కొమరం భీమ్ దాడి చేసే వాడు 1928 నుండి ఇ 1940వ సంవత్సరం వరకు రణభేరి మ్రోగించిన కొమరం భీమ్ నైజాం సర్కారు గుండెల్లో సింహ స్వప్నంగా మారిన పోరాటయోధుడు అయితే ఆయన జీవితమంతా తిరుగుబాటుకు గడిచిపోయింది 40 ఏళ్ల ప్రాయంలో పటేల్ అనే నమ్మకద్రోహి సమాచారంతో అర్ధరాత్రిపూట కొమరం స్థావరాలను సైన్యం చుట్టుముట్టగా అడవుల్లో 1940 సెప్టెంబర్ 1వ తేదీన కొమరం భీమ్ వీరమరణం పొందాడు అప్పటి నుండి ఆ తిధి రోజునే కొమరం భీమ్ వర్ధంతిని జరుపుకోవడం ఆదివాసీల ఆనవాయితీగా మారిపోయింది తన ప్రజల కోసం ముళ్ల దారిలో నడిచి ముళ్ళ బాధలను అనుభవిస్తూ హింస అనే ముళ్ళు గుచ్చుకొని వీరమరణం పొంది ఆదివాసీల గుండెల్లో నిలిచిపోయిన పోరాట యోధుడు కొమరం భీమ్.
             సర్వేజనా సుఖినోభవంతు....
               జైగురుదేవ.... మీ మధు గురూజీ...

Demo class 7 days yoga class registration

Loading… ఫారం సబ్మిట్ చేసిన తర్వాత WhatsApp లో మమ్మల్ని సంప్రదించండి 🙏 📲 Contact on WhatsApp Your free book View ...