Wednesday, November 2, 2022
శ్రీశ్రీశ్రీ దేవానంద ఈర్ల నారాయణ స్వామి దివ్య జీవిత చరిత్ర
గడగ్ శ్రీశ్రీశ్రీ శివానంద స్వామి జీవిత చరిత్ర కర్ణాటక
శ్రీ శ్రీ సున్నిపెంట పూర్ణానంద స్వామి జీవిత చరిత్ర
Friday, April 1, 2022
#1000yogulu
Saturday, March 12, 2022
Friday, March 11, 2022
శ్రీ శ్రీ శ్రీ మద్దిలేటి స్వామి వారి స్థల పురాణం
Thursday, March 10, 2022
శ్రీ శ్రీ శ్రీ తిక్క లక్ష్మయ్య స్వామి జీవిత చరిత్ర
శ్రీ లక్ష్మయ్య స్వామి వారు అనంతపురం జిల్లా ధర్మవరం తాలూకా బత్తలపల్లి మండలం అప్పరా చెరువు అనే గ్రామంలో జన్మించారు .చిన్నప్పటి నుంచి ఆధ్యాత్మిక భావాలతో పెరిగారు. అయితే శ్రీ స్వామివారు యుక్తవయస్సు రాగానే వివాహం చేసుకున్నారు .అయినా తన ధర్మాన్ని పాటిస్తూ మరొకవైపు ఆధ్యాత్మిక భావాల కారణంగా గత జన్మల ఆయన ఒక మహాత్ముడైన వ్యక్తిని గురువుగా స్వీకరించారు .ఆయనే శ్రీ శ్రీ శ్రీ గురజాడ అప్ప స్వామి వారు .శ్రీ అప్ప స్వామి వారు మహాత్ములు యోగ సిద్దులు .ఆయన కొల్హాపూర్ మహాలక్ష్మి అమ్మవారిని అమ్మవారి అపారమైన అనుగ్రహాన్ని సంపాదించారు,అటువంటి మహాత్ముడి వద్ద శిష్యునిగా చేరి గురుసేవ చేసుకున్నారు లక్ష్మయ్య గారు.
అయితే ఒకసారి శిష్యుడి గురు సేవకు మెచ్చిన అప్ప స్వామి వారు శిష్యుడైన లక్ష్మయ్యను జగన్మాతను ఆరాధించి ఆమె అనుగ్రహం పొందవలసిందిగా ఆజ్ఞాపించారు.గురువు యొక్క ఆజ్ఞ ప్రకారం జగన్మాతను అర్చించి, పూజించి ,ఆరాధించి ఆమె అనుగ్రహానికి పాత్రులై అనంతమైన ఆత్మ జ్ఞాన సంపన్నుడు గా మారిపోయాడు లక్ష్మయ్య స్వామి.
సంసారాన్ని విడిచి చుట్టుపక్కల ప్రాంతాల్లో తిరుగుతూ ఆకలి తప్పులను ఎండ వానలను మరచి దేహ భ్రాంతి విడిచి దిగంబరంగా తిరిగేవారు ఆయన. అలా చూసిన వారు ఆయనకు పిచ్చి పట్టిందని ఆయన పిచ్చివాడేమో అని భావించేవారు.
లక్ష్మయ్య గారు ఒకసారి అన్ని ప్రాంతాల్లో తిరుగుతూ ధర్మవరం చేరుకున్నారు .ధర్మవరంలో శివాలయం దగ్గర ఉన్న బావి వద్ద నీళ్లపై తేలియాడుతూ ధ్యానం చేసే వారు. అది గమనించిన ప్రజలు ఆయన తిక్క స్వామి కాదని మహాత్ముడు అని తలచి స్వామి వారు ధ్యానం చేసుకోవడం కోసం రైల్వే గేటు పక్కన గుడిసె వేయించారు.
కొందరు మాత్రం దిగంబరంగా ఉండే ఆయనను చూసి తిక్క స్వామి అని భావించేవారు .అయితే స్వామిలోని మహత్యం కొద్దికొద్దిగా బయట పడసాగింది .స్వామి చుట్టూ చేరి సేవ చేసే వారి బాధలు కష్టాలు దూరమయి మరికొందరు తమ సమస్యలను నేరుగా విన్నవించుకునే వారు. అప్పుడు స్వామి విభూతి ప్రసాదించి వారు వారి సమస్యలు ఎటువంటివైనా సరే ఖచ్చితంగా పరిష్కారమయ్యేవి.
ఇలా స్వామివారి గురించి తెలుసుకొని ఎంతో మంది స్వామికి భక్తులు గా మారిపోయారు. స్వామి వారు భక్తులు ఏది ప్రేమతో ఇచ్చిన సంతోషంగా స్వీకరించి భుజించేవారు.
ఒకసారి కొందరు భక్తులకు అనుమానం వచ్చి స్వామి తో వారు ఇలా మాట్లాడారు స్వామి మీరు ఎప్పుడు స్నానం చేయరు ఎందుకు ? ఇప్పుడు మా కోసం స్నానం చేస్తారా ?అని అడిగారు. స్వామి వెంటనే ధ్యానంలో కూర్చుని తన మరొక రూపంలో పక్కనే ఉన్న బావి లోపల స్నానం చేసి పద్మాసనం వేసుకుని కూర్చున్నాడు .అందరూ ఆశ్చర్యపోయి స్వామివారిని సంపూర్ణంగా అర్థం చేసుకున్నారు.
స్వామి వారు తమ మిగిలిన జీవితాన్నంతా భక్తజనం ఆదరణకు వినియోగించి ఒక శుభముహూర్తాన జీవసమాధి చెందాలని నిర్ణయించుకుని భక్తులను తన జీవసమాధి కి తగిన ఏర్పాట్లు చేయమని ఆజ్ఞాపించి భక్తుల ఎదుట దీపాల వెలుగుల మధ్య సమాధి చెందారు శ్రీ స్వామివారు. తర్వాత భక్తులు ఆలయం నిర్మించగా శ్రీ లక్ష్మయ్య స్వామి వారి దేవాలయం ధర్మవరం లో చాలా ప్రసిద్ధమైన దేవాలయంగా వెలుగొందుతోంది స్వామి వారి ఆరాధన ఉత్సవం కార్తీక పౌర్ణమి రోజున అంగరంగ వైభవంగా జరుగుతుంది .
ఇది స్వామి చరిత్ర
సర్వేజనా సుఖినోభవంతు
Demo class 7 days yoga class registration
Loading… ఫారం సబ్మిట్ చేసిన తర్వాత WhatsApp లో మమ్మల్ని సంప్రదించండి 🙏 📲 Contact on WhatsApp Your free book View ...
-
Loading… ఫారం సబ్మిట్ చేసిన తర్వాత WhatsApp లో మమ్మల్ని సంప్రదించండి 🙏 📲 Contact on WhatsApp Your free book View ...
-
Benefits of Fruits: Insights from a Yoga Master Dear Students, As we continue our journey towards holistic health and well-being, understand...
-
Cartilage is a flexible, rubbery connective tissue found in various parts of the body. It provides support and cushioning, allowing structur...
