Saturday, November 12, 2022

నవల గుండ శ్రీ శ్రీ శ్రీ జగద్గురు అజాత నాగలింగ స్వామి చరిత్ర

        కర్ణాటక రాష్ట్రం రాయచూర్ జిల్లాలోని సింధనూర్ పట్టణంలోని జవలగేరి గ్రామంలో జన్మించాడు శ్రీశ్రీశ్రీ జగద్గురు అజాత నాగలింగ స్వామి వారు. అతి చిన్న వయస్సు నుండి యోగి లక్షణాలతో సంచరించేవారు
               చిన్నతనం నుండే అద్భుతాలు చేస్తూ మహిమలు చూపుతూ ప్రజలకు సహాయం చేసేవారు అలా యోగిలా సంచరిస్తూ ధార్వాడ్ లోని మౌనేశ్వర గుహలో స్థిరపడ్డాడు.
      ఆయన చర్యల వల్ల ఆ కాలంలో అంటే 19వ శతాబ్దంలో ఆయన చుట్టుపక్కల గ్రామాల్లో చాలా ప్రాచుర్యం పొందారు. విశ్వకర్మ కుటుంబంలో మౌనాచర్య నాగమ్మ దంపతులకు 1812 వ సంవత్సరంలో జన్మించారు నాగలింగ స్వామి వారు .
        ఆయన పోలికలు ఏసుక్రీస్తుతో పోలి ఉంటాయి ఆలయ గోడలపై ఉండే ఆ చిత్రపటాన్ని చూసినప్పుడు కాస్త ఏసుక్రీస్తును తలపింప చేస్తుంది అయితే స్వామివారి యొక్క ఆలయంలో ప్రస్తుతం ఒక బైబిల్ గ్రంధం పూజించబడుతూ ఉంది ప్రతిరోజు ఆలయ పూజారి హిందూ సంప్రదాయం ప్రకారం పూజ చేసి ప్రదర్శన కోసం ఆ బైబిల్ ని ఉంచుతారు ఆ ఆలయానికి వచ్చిన ప్రతిభక్తుడు తన ప్రార్థనలను బైబిల్ కు కూడా చెల్లిస్తాడు బైబిల్ చదవబడదు కానీ అది ఇక్కడ చాలా పవిత్రమైనది ఇది చర్చి కాదు ఒక హిందూ దేవాలయం మాత్రమే.
            అయితే ఆ బైబిల్ స్వామి గర్భగుడిలోకి చేరి పూజించబడటానికి ఒక కారణం ఉంది అదేమిటంటే ఒకప్పుడు కర్ణాటకలోని భాగం జిల్లాలోని బాదామి పట్టణంలో ముష్టిగేరి గ్రామంలో కాలప్ప అనే గొప్ప దేవి భక్తుడు నివసించేవాడు ఒకసారి ఆయన బైబిల్లో ఏముందో అని తెలుసుకోవడం కోసం బైబిల్ ను చదువుతూ ఉండగా శ్రీ నాగ లింగస్వామి కాలప్పను కలిశారు కాలప్ప చేతిలో ఉన్న బైబిల్ ను తీసుకొని దానిపై ఒక చిన్న హుక్కు సహాయంతో రంద్రం చేశాడు విక్టోరియన్ వెండి నాణిెం ఆ చిల్లులో పడేశాడు అవతలి వైపు నుండి మరొకవైపుకు సాఫీగా బయటకు వచ్చింది ఆ నాణెం ఆ రంద్రం దానంతట అదే పూర్తిగా మూసుకుపోతుందని అలా జరిగినప్పుడు మళ్ళీ వేరే అవతారంలో పుడతాడని కాలప్పకు మరుజన్మ వృత్తాంతం తెలియజేసి వెళ్ళాడు ఆ తర్వాత బైబిల్ పై తప్పిపోయిన పదాలు అద్భుతంగా మళ్ళీ కనిపించాయి నేటికీ రంధ్రం సూది పరిమాణంలో ఉంది .
           నాగలింగ యోగి గారు 1881 వ సంవత్సరంలో తనువు చాలించిన తర్వాత దివంగత కాలప్ప ఆలయానికి ఆ బైబిల్ ను ఇచ్చేశాడు అలా ఆలయంలో బైబిల్ మరియు వెండినానం భద్రపరచబడ్డాయి ఆలయ అధికారుల అనుమతితో ఎవరైనా ఆ బైబిల్లో సందర్శించవచ్చ ఈ ఆలయంలో ముస్లింల పండుగ మొహరంలో ఉపయోగించే పంజా అనే కత్తి మరియు చనిపోయిన వారిని స్మశాన వాటికకు తీసుకెళ్లడానికి ఉపయోగించే సిదగి అనే బండి వంటి కొన్ని ఆసక్తికరమైన వస్తువులు కూడా ఉన్నాయి ఇలాంటి ఇతర మతాలకు చెందిన వస్తువులు ఏ ఇతర హిందూ దేవాలయాల్లో మనం చూడలేము కానీ శ్రీ నాగలింగ స్వామి వారి మఠంలో మాత్రం మనం క్రైస్తవ మతానికి చెందిన బైబిల్ ను ఇస్లాం మతానికి చెందిన సిధకి పంజాలను గమనించవచ్చు.
        శ్రీ నాగలింగ స్వామి వారు ఆ సిదగి అనే బండిని తాను బ్రతికి ఉన్నప్పుడు ఉపయోగించడం వలన ఆ బండిని ఆలయంలో ఉంచారు ఒకసారి స్వామి వారు తిరిగి పైకి ఎక్కి కూర్చుని విద్యార్థులకు చెప్పి ఊరేగించమన్నారు చాలా మంది వ్యతిరేకించారు కానీ స్వామికి ఎదురు చెప్పలేకపోయారు ఈ దేవాలయం లో మొహరం కూడా ఘనంగా జరుపుతారు.
               శ్రీ నాగలింగ స్వామి వారు బ్రతికి ఉన్నప్పుడు ఎంతోమంది భక్తులను ఆకర్షించారు తన దగ్గరికి వచ్చిన భక్తులను ఎన్నో విధాలుగా తన బోధనల ద్వారా ప్రేరేపించారు మరియు తన బోధనల ద్వారా ఆధ్యాత్మిక మార్గంలోనికి ఎంతో మందిని మళ్లించేవారు యుద్ధం చేయడం కంటే శాంతిని నెలకొల్పటం చాలా ముఖ్యమని బోధించేవారు శ్రీ నాగలింగ స్వామి వారు. సర్వేజనా సుఖినోభవంతు
 ఓం శ్రీ గురుభ్యోనమః

మహాయోగి శ్రీశ్రీశ్రీ కనకదాస చరిత్ర

                   కనకదాసు గారి పుట్టినరోజును కర్ణాటకలో ముఖ్యంగా కురుబ సంఘం లో జరుపుకుంటారు 2008వ సంవత్సరంలో కర్ణాటక ప్రభుత్వం ఆయన జన్మదినాన్ని రాష్ట్ర పండుగగా జరుపుకోవాలని నిర్ణయించుకుంది అందుకే నవంబర్ 11 వ తారీకున రాష్ట్ర సెలవు దినంగా ప్రకటించింది కర్ణాటక ప్రభుత్వం.
            కర్ణాటకలోని షిగ్గావ్ ప్రాంతంలోని బాధావద్ద జరిపిన త్రవ్వకాల్లో పురావస్తు శాఖ వారు కనకదాసు యొక్క యుగంగా గుర్తించబడిన కోట రాజభవన శిథిలాలను కనుగొన్నారు ఆ ప్రదేశంలో నూతనంగా కోట రాజభవనం నిర్మించారు 1990లో భారత ప్రభుత్వం కనకదాసు పేరుమీద పోస్టల్ స్టాంప్ ని విడుదల చేసి గౌరవించింది .
      కనకదాస గారు కర్ణాటకలోని బంకాపుర సమీపంలోని బాధా గ్రామంలో కన్నడ కురుబ అంటే గొర్రెల కాపరి హిందూ కుటుంబంలో జన్మించాడు మరియు ఆయన యుక్త వయసులో బంకాపుర కోటలో యోధుడిగా పనిచేశాడు ఒకసారి యుద్ధంలో తీవ్రంగా గాయపడ్డాడు తర్వాత తన వృత్తిని విడిచిపెట్టి సంగీతాన్ని లయబద్ధంగా నిర్మిస్తూ సాహిత్యం రాయటం ప్రజలకు తత్వశాస్త్రాన్ని వివరించడం కోసం తాను తన జీవితాన్ని అంకితం చేశాడు.
             అతని ప్రారంభ రచనలలో నరసింహ స్తోత్రం రామధ్యాన మంత్రం మరియు మోహన తరంగిణి అనే పద్యాలు ఉన్నాయి వ్యాస తీర్థ స్వామీజీ శిష్యుడు కావడంతో కనకదాసు కు ఉడిపి తో అనుబంధం ఏర్పడింది ఆ వ్యాసరాయ స్వామి కనకదాసును గుడిలోనికి అనుమతించమని కోరినా పూజారులు అతని దుస్తులను బట్టి అతడు మరొక కులానికి చెందిన వ్యక్తిగా నిర్ధారించి మఠంలోనికి అనుమతించలేదు కనక దాసు గారిని కృష్ణుని దర్శనానికి అనుమతించనప్పుడు దేవుడు పడమర ముఖంగా వెనక్కు తిరిగాడు కిటికీ గుండా కనకదాసు కు దర్శనం ఇచ్చాడు ఇది నేటికీ ఉడిపిని సందర్శించే భక్తులు కిటికీ ద్వారా ఆయనను చూడవచ్చు.
 నల చరిత్ర, హరి భక్తి సార, నృసింహస్తవ, రామ ధాన్య చరిత, మోహన తరంగిణి వంటి రచనలు చేశారు. 240 కర్ణాటక సంగీత స్వర కల్పనలు వందకు పైగా పాటలు రచించారు గ్రామాధికారిగా పనిచేస్తూ యుద్ధంలో గాయపడ్డ తర్వాత పూర్తి వైరాగ్యంతో తన జీవితాన్ని సమాజం కోసం సమాజం జాగృతం అవ్వటం కోసం వినియోగించిన మహనీయుడు శ్రీశ్రీశ్రీ కనకదాసు గారు.
          కుటుంబంలో నష్టాలు యుద్ధంలో అవమానాల కారణంగా ప్రాపంచిక సుఖాలను తెగించాడు బీరప్ప బచ్చమ్మ దంపతులకు జన్మించారు శ్రీ కనకదాస గారు చివరి రోజుల్లో శ్రీ కనకదాస గారు తిరుపతిలో నివసించారు భారతదేశ సంగీత విద్వాంసులు స్వరకర్తలు కవులు తత్వవేత్తలు సాధువులలో ఈయన కూడా ఒకరు శ్రీకృష్ణుడి యొక్క గొప్ప భక్తులలో శ్రీ కనకదాసు గారు కూడా ఒకరు .1509 సంవత్సరంలో జన్మించి 1609 వ సంవత్సరంలో మరణించారు 100 సంవత్సరాలు జీవించారు శ్రీ కనకదాసు గారు.
     తన భావాలను సమాజంలో ప్రవేశపెట్టి ఎంతో మందిలో జ్ఞానచైతన్యాన్ని ఆధ్యాత్మిక చైతన్యాన్ని కలిగించారు శ్రీ కనకదాసు గారు అటువంటి మహాత్ముని పాదపద్మములకు నమస్కరిస్తూ 
సర్వేజనా సుఖినోభవంతు
 ఓం శ్రీ గురుభ్యోనమః

బ్రహ్మర్షి పితామహా సుభాష్ పత్రీజీ

        ఎన్నో లక్షల మందిని కుదురుగా ధ్యానంలో కూర్చోబెట్టి సమాధానం లేని ప్రశ్నలకు ధ్యానంతో జవాబు చెప్పి మౌనం యొక్క రుచిని జనులకు తెలియజేసి ధ్యానానందాన్ని పంచి పెట్టిన పరమాద్భుతమైన ఆత్మ స్వరూపుడు శ్రీశ్రీ బ్రహ్మర్షి పితామహా పత్రీజీ గారు .
                 ధ్యానం కోసం జన్మించి జనులకు ధ్యానాన్ని దగ్గర చేయాలని ధ్యానించి నిద్రపోతున్న జ్ఞాన చైతన్యాన్ని మేల్కొలిపి ధ్యాన జీవులను ధన్యజీవులుగా దర్శించి అనంత లోకానికి చేరి ధ్యానులను ఆశీర్వదిస్తున్న కారణజన్ముడు శ్రీశ్రీ సుభాష్ పత్రీజీ గారు బ్రహ్మర్షి, పితామహ అనేవి ఆయన కృషికి ఫలితంగా లభించిన బిరుదులు .
          పత్రి వెంకట రమణారావు సావిత్రి దేవి లకు 1947లో నవంబర్ 11వ తేదీన నిజామాబాద్ జిల్లా బోధన్ లోని శంకర్ నగర్ లో జన్మించారు రమణారావు గారు గుడివాడలో జన్మించారు తర్వాత ఉద్యోగరీత్యా నిజమాబాద్ కు వెళ్లారు అలా నిజామాబాద్ శక్కర్ నగర్ లో సుభాష్ గారు జన్మించారు తర్వాత ఆ కుటుంబం వరంగల్ కు మారింది.
       పత్రీజీ గారి తల్లి దయగల వ్యక్తి సంగీతాన్ని ప్రేమించేవారు హిందీలో అనర్గళంగా మాట్లాడేవారు ధ్యానం కూడా చేసేవారు ఎందుకంటే ఆమె గుంటూరులో జన్మించి అలహాబాద్ లో పెరిగింది పదహారేళ్ల వయసులో రమణారావు గారితో పెళ్లయిన తర్వాత భర్త అనారోగ్యంతో ఎన్నో కష్టాలను ఎదుర్కొంది అయినా ఆమె పత్రీజీ గారి ఆధ్యాత్మిక ప్రయత్నాలకు ఎంతో సహకరించింది.
          పత్రీజీ గారు శక్కర్ నగర్ లో ఐదవ తరగతి వరకు చదువుకున్నారు తర్వాత తొమ్మిదవ తరగతి వరకు బోధన్ ప్రభుత్వ పాఠశాలలో చదివారు తర్వాత సికింద్రాబాద్లో చదువుకున్నారు 1966 లో బీఎస్సీ పూర్తి చేశారు 1970లో ఆదాయపు పన్ను శాఖలో ఇన్స్‌పెక్టర్ గా చేరి 10 నెలలు పనిచేసే రాజీనామా చేసి హైదరాబాదుకు తిరిగివచ్చారు తర్వాత సాయిల్ సైన్స్ లో ఎంఎస్సీ చేశారు 1974లో మే 26న స్వర్ణమాల గారితో వివాహం జరిగింది 1978లో ఒక అమ్మాయి జన్మించగా పరిణిత అని 1982లో మరొక అమ్మాయి జన్మించగా పరిమళ అని పేరు పెట్టారు.
        ఆ బిడ్డలు ఇద్దరూ ఇప్పుడు గొప్ప ధ్యానవేత్తలయ్యారు.
             1975లో కోరమాండల్ ఫెర్టిలైజర్స్ కర్నూలులో పనిచేశారు పత్రీజీ గారు 1977 వ సంవత్సరంలో ధ్యానం నేర్చుకున్న తన స్నేహితుడు మరియు సహోద్యోగి శ్రీ ఎస్ రామచంద్రారెడ్డి సహాయంతో అనాపాన సతి ధ్యానంతో కొన్ని తీవ్రమైన ప్రయోగాలు చేశారు పత్రీజీ .
          1979లో జ్ఞానోదయం పొంది ఆ క్షణం నుండి ప్రతి వ్యక్తిని మేల్కొల్పడానికి మరియు జ్ఞానోదయం పొందేలా చేయడానికి తీవ్రంగా కృషి చేయడం ప్రారంభించి అందులో సఫలీకృతులయ్యారు దాని ఫలితంగా వేల మంది ధ్యానులు తమ జీవితాల్లో జ్ఞాన జ్యోతుల్ని వెలిగించుకున్నారు.
         శ్రీ పత్రీజీ గారు 50వేలకు పైగా పుస్తకాలు చదివారు ఆ పుస్తకాల సారమంతా ధ్యానమేనని అర్థం చేసుకున్న ఆయన తన జీవితాన్ని ధ్యానంతో ధన్యం చేసుకున్నారు.
        1981లో సదానంద యోగి అనే మహాత్ముడిని కలిశారు ఆయన ద్వారా ధ్యానం నేర్చుకున్నారు ఎన్నో అనుభవాలను ఆయన దగ్గర నుంచి తెలుసుకున్నారు పత్రీజీ గారు.
           సదానంద యోగి గారు అరేబియాలో పుట్టి భారతదేశమంతా తిరిగి చివరికి కర్నూలుకు చేరుకున్నారు చివరకు ఆయన కర్నూలులోనే 1983 మే 22న పత్రీజీ గారి సమక్షంలో దేహాన్ని విడిచిపెట్టారు.
       తర్వాత 1990లో ది కర్నూల్ స్పిరిచువల్ సొసైటీని స్థాపించారు 1991లో బుద్ధ పిరమిద్యాన కేంద్రం స్థాపించబడింది 1992లో ఉద్యోగానికి రాజీనామా చేసి పి ఎస్ ఎం ని స్థాపించారు శ్రీ పత్రీజీ గారు .
           60 కి పైగా పుస్తకాలు రాశారు ఆయన ఎన్నో వేల వర్క్ షాప్ లు నిర్వహించారు అనాపాన సతి ధ్యానం శాకాహార జగత్తు గురించి ఆయన చేసిన కృషి మరువలేనిది ఇతర దేశాల్లో కూడా పత్రీజీ గారి ధ్యానమార్గాన్ని ఎంతోమంది ఆచరిస్తున్నారు.
          ఆయన కృషికి ఫలితంగా ఎన్నో అవార్డులు వచ్చాయి పిఎస్ ఎస్ఎం అంతర్జాతీయ ప్రధాన కార్యాలయం కర్ణాటక రాష్ట్రంలోని హరోహల్లిలోని కెబ్బెదొడ్డి గ్రామంలో ఉంది ఇక్కడ మెగా మైత్రేయ బుద్ధ పిరమిడ్ ఉంది .
                    ఆయన జులై 24 2022వ సంవత్సరంలో తన ఆత్మని శాశ్వతంగా ధ్యాన లోకంలోనికి ప్రవేశపెట్టారు లక్షల హృదయాల్లో ధ్యాన నివాసం ఏర్పరచుకున్న పరమాద్భుత ధ్యానయోగి బ్రహ్మర్షి పితామః పత్రీజీ గారి పాదపద్మములకు నమస్కరిస్తూ.......
 సర్వేజనా సుఖినోభవంతు
 ఓం శ్రీ గురుభ్యోనమః

Wednesday, November 2, 2022

శ్రీశ్రీశ్రీ దేవానంద ఈర్ల నారాయణ స్వామి దివ్య జీవిత చరిత్ర

అప్పటి మహబూబ్నగర్ జిల్లా నాగర్ కర్నూలు తాలూకా మంతటి గ్రామంలో నివసించే పాపమ్మ నారాయణ దంపతులకు ఆగస్టు 17వ తేదీన జన్మించాడు ఒక మగ పిల్లవాడు ఆ మగ పిల్లవాడికి నారాయణస్వామి అని పేరు పెట్టారు మూడవ తరగతి వరకు చదువుకొని తండ్రికి వ్యవసాయంలో సహాయం చేసేవాడు మంతటి ఇటికల గ్రామాల మధ్య పది ఎకరాల మెట్ట భూమి వారికి ఉండేది అయితే వర్షం పడితేనే పంటలు పండి వారి జీవనాధారం గడిచేది. 1961 1965 మధ్యకాలంలో రామచంద్రారెడ్డి దగ్గర లేబర్ కాంట్రాక్టర్ గా పని చేసేవాడు నారాయణస్వామి ఆ కాలంలోనే వ్యక్తిని చూడగానే ఎన్నో విశేషాలు ఆ వ్యక్తుల గురించి చెప్పేవాడు అంటే వారి గతం వారి భవిష్యత్తు ఏమిటో స్వామి వారి ముఖం చూడగానే చెప్పేవాడు అయితే ఒకసారి ఒక వ్యక్తి నారాయణ గారి దగ్గరకు వచ్చి మీ గురువు ఎవరు అని ప్రశ్న వేశాడు అయితే జీవితం పవనం కావాలంటే గురువు యొక్క అవసరం తప్పనిసరి అని భావించి శ్రీశైలం అడవులకి వెళ్ళాడు తన గురువు కోసం వెతుకుతూ అక్కడ శ్రీశైలం అడవుల్లో శిథిలమైపోయిన ఎన్నో గుళ్లను దర్శించుకున్నాడు శివలింగాలు ఎక్కడైనా కనపడితే ఆ శివలింగానికి టెంకాయ కొట్టి అగరత్తులు వెలిగించి అక్కడి నుంచి వెళ్లిపోయేవాడు ఆశన్న అనే హరిజనుడు పని మధ్యలో ఆపడం వలన రామచంద్రారెడ్డికి 1000 రూపాయలు నష్టం వచ్చింది దాన్ని తీర్చడం కోసం ఒక ఎకరం పొలం అమ్మి ఆ పనిని పూర్తిగా మానివేశాడు నారాయణస్వామి మహాదేవుని పేటలో మల్కిదాసు అనే గురువు ఉన్నాడని తెలుసుకొని వెళ్ళాడు ఆయన మహమ్మదీయుడు కానీ అచల సాంప్రదాయాన్ని పాటించే వ్యక్తి పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి వారి కథ చెప్పడంలో ప్రసిద్ధుడు ఆ మల్కిదాసు గారు 1965లో నారాయణను పరిశీలించి పరీక్షించి కారణమిచ్చి దేవానందా అనే దీక్ష నామం ప్రసాదించాడు తర్వాత స్వగ్రామానికి తిరిగి వచ్చి తన పొలంలో ఆశ్రమం ఏర్పరచుకొని సాధన చేసుకునేవాడు గురువు ఆదేశం మేరకు బ్రహ్మంగారికి ఒక మందిరం కట్టించి ఆ గుడి ముందు తన సమాధి కోసం గుంత తవ్వించుకున్నాడు చుట్టుపక్కల గ్రామాల్లో కొందరు స్వామి దగ్గరకు వచ్చి బ్రహ్మంగారిని ఎవరు పూజిస్తారు దర్గా కట్టిస్తే హిందువులు ముస్లింలు అందరూ వస్తారు మీ గురువు కూడా ముస్లింలే కదా అన్నారు 1965 కాజా బందిన వాజ్ అనే దర్గాను కట్టించాడు నారాయణ గారు మొగలాయి సాహెబ్ ఒక పేరుని నిలిపి మరగ దర్గా కట్టించాడు చుట్టుపక్కల గ్రామాల నుంచి పెద్ద ఎత్తున ముస్లింలు రావడం చేత అక్కడ కందూర్లు అంటే జంతుబలులు ప్రారంభమయ్యాయి నారాయణస్వామికి జంతుబలులు ఇష్టం లేదు అయినా ముస్లింలను నిరోధించలేకపోయాడు ఈ సంగతి గురువు మల్కిదాసు కు తెలిసి నారాయణ స్వామిని పిలిపించుకొని మందలించాడు బాధతో తన జన్మ వ్యర్థమైపోయిందని బాధపడుతూ మూడు రోజులు ఆహారం నీరు తీసుకోకుండా మహదేవుని పేట గురువు ఆశ్రమం ఎదుటే పడుకున్నాడు తాళ్లపల్లి రామచంద్రయ్య యోగి అనే ఒక యోగి గారికి ఈ విషయం తెలిసింది అయితే ఆయన నారాయణ స్వామి వారి వద్దకు వచ్చి పాలను తాపించి ఆ దీక్షను విరమింపజేశాడు తర్వాత తన ఆశ్రమంలో 1970లో శివాలయం కట్టించి నీటి వసతి కోసం భావితవ్వించి కొబ్బరి చెట్లు జామ చెట్లు పెంచాడు తర్వాత గురు సన్నిధికి వెళ్లి గురువు చెంత భక్తి ప్రభత్తులతో మెలిగాడు మల్కి దాసు మనసు కరిగి జనవరి 24 1971లో నారాయణస్వామికి బోధాధికారం ఇచ్చి ధ్రువపత్రం అనుగ్రహించాడు తర్వాత ఆశ్రమానికి వెళ్లి సాధన ప్రారంభించాడు హైదరాబాదు వాసి లక్ష్మీనారాయణ స్వామిని చేరుకోగానే అతని మనసు పొరల్లోని విషయాలన్నీ దేవానంద నారాయణ స్వామి వారు చెప్పగానే ప్రధమ శిష్యుడిలా మారిపోయారు లక్ష్మీనారాయణ గారు దినదినానికి శిష్యులు పెరిగిపోతూ ఉన్నారు. సర్వేశ్వరంలో ఉన్న స్వామిని దర్శించడం కోసం అడవి గుండా వెళ్లి తిరిగి అడవిలో నుంచి వచ్చేటప్పుడు వర్షానికి వాగు పొంగింది ఒక పెద్ద బండరాయి మీద స్వామి ఆ వాగులోని కూర్చుని తలపై నీళ్లు పోయించుకొని మూడు గంటలు సమాధి స్థితిలోనికి వెళ్లిపోయారు ఆ సమయంలో ఆ వాగు స్వామి పక్కనుంచి ప్రవహించింది తప్ప స్వామి ఉన్న ప్రదేశంలో వాగు మామూలుగా మాత్రమే ప్రవహించింది ఇది స్వామివారి లీలగా చుట్టుపక్కల గ్రామాల్లో తెలిసింది స్వామివారి మహిమలు తెలిసి ఎంతోమంది పీడితులు బాధితులు స్వామిని చేరి స్వాస్త్యం పొందారు జ్ఞానేశ్వర్ భార్య నీరజ మానసిక వ్యాధి పీడితురాలు ఆవిడ అందరినీ విపరీతంగా తిడుతూ ఉండేది అయితే ఆమె కూడా స్వామి చెంతకు చేరి స్వాస్త్యం పొందింది అలా ఎప్పుడైతే అలాంటి ఆవిడ మారిపోయిందో వారి 30 కుటుంబాల వారు స్వామికి శిష్యులైనారు 1990 నుండి ఆలయాల అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి తన ఆశ్రమంలో శివాలయంతో పాటు వెంకటేశ్వర స్వామి పార్వతీదేవి ఆంజనేయ స్వామి విగ్రహ ప్రతిష్టలు నవగ్రహ ప్రతిష్టలు చేయించి ఒక తేరు కూడా చేయించారు కార్తీక మాసంలో ఒకేరోజు పగలు వెంకటేశ్వర స్వామి కళ్యాణం రాత్రి పార్వతీ పరమేశ్వరుల కళ్యాణం రథోత్సవం చేయించారు స్వామి వారు స్వామి వారు భక్తుల చేత ఎన్నో పుణ్యకార్యాలు చేయించారు శ్రీ స్వామి వారు జనవరి 10 1995 భావ సంవత్సర పుష్య శుద్ధ నవమి మంగళవారం నాడు తనువు చాలించారు ఆయన ఎన్నడో తవ్వించుకున్న  గుంతలో శాస్త్రక్తంగా ఆయన సమాధి జరిగింది వేలమంది కన్నీటి ధారలతో ఆశ్రమ ప్రాంగణం బాధాతప్త హృదయాలతో నిండిపోయింది సామాన్యమైన స్థితి నుండి ఆ సామాన్యమైన స్థితికి చేర్చి మనిషిని మహాత్ముడిని చేసి అచల సాంప్రదాయం ఒక గొప్ప గురు మార్గంగా నిలిచింది ఆ గురు మార్గంలో నడిచి జీవితం పావనం చేసుకున్న ఆ అమృతమూర్తి పాదపద్మములకు నమస్కరిస్తూ సర్వేజనా సుఖినోభవంతు జై గురుదేవ్

గడగ్ శ్రీశ్రీశ్రీ శివానంద స్వామి జీవిత చరిత్ర కర్ణాటక

1858లో ధార్వాడ్ జిల్లా రాం అనే ప్రాంతంలో నివసించే లింగన్న గౌడ మరియు బసవమ్మ అనే పుణ్య దంపతులు దైవభక్తి దయ సద్గుణాలతో జీవించేవారు వారి దాంపత్య ఫలితంగా ఒక సకల సద్గుణాలు కలిగిన బాలుడు జన్మించాడు ఆ బాలుడికి శివానంద అని పేరు పెట్టారు మౌన స్థితిని అనుభవిస్తూ తనలో తాను ఆత్మానందంలో మునిగి ఉండేవాడు ఒక వ్యక్తి ఒకసారి శివానంద దగ్గరకు వచ్చి ముక్కలు ముక్కలుగా శివానందను నరికేస్తానని చెప్పాడు అప్పుడు శివానంద తన మెడను వంచి తనకు శరీరమే లేదని చెప్పి ఆ మెడను పూర్తిగా కత్తిరించమని చెప్పాడు అది ఆయన చిన్నప్పటి స్థితి .
          శివానందకు తల్లిదండ్రులు ఒక చిన్న అమ్మాయితో వివాహం జరపడానికి నిశ్చయించారు అయితే శివానంద మాత్రం తనను పెళ్లి చేసుకున్న అమ్మాయి కొద్దిసేపటికే మరణిస్తుంది అని చెప్పాడు తనకు వివాహం చేయవద్దని వారించాడు కానీ పెద్దలు వివాహం జరిపించగా కొద్దిసేపటికే అమ్మాయి మరణించింది అప్పుడు శివానంద సామాన్యుడు కాదని జరగబోయే విషయం ముందే గ్రహించిన మహాత్ముడు అని కొందరు భావించారు.
           ప్రాథమిక విద్యాభ్యాసం పూర్తిచేసి కొంతవరకు ఇంగ్లీషు కూడా నేర్చుకున్నాడు ధార్వాడ జిల్లా నవల గుండ తాలూకాలోని ధోని ముందరంగి తాలూకాలోని డుంబల్ గ్రామాల సమీపంలో కనారస్ ప్రాథమిక పాఠశాలలో ఉపాధ్యాయునిగా పనిచేశాడు అప్పుడు కూడా అతను ఎల్లప్పుడూ ఆధ్యాత్మిక బ్రహ్మానందంలో లీనమై జీవించేవాడు శివానంద గారు బనహట్టి గ్రామానికి చెందిన శ్రీ రుద్ర స్వామి మహరాజ్ అనే గొప్ప సాక్షాత్కార సాధువుతో పరిచయం కలిగి ఉండటం వల్ల వారు ఇద్దరూ అప్పుడప్పుడు ఆధ్యాత్మిక విషయాలు చర్చించుకునేవారు.
         తర్వాత శివానంద గారు రామదుర్గ జిల్లా బెల్గాంలోని మనీ హాల్లో 12 సంవత్సరాలు పోలీసు పాటిల్ గా పనిచేశాడు అయితే ప్రజలకు మేలు చేయాలని లక్ష్యంతో ఆయన పోలీసు బాధ్యతలను నిర్వర్తించేవాడు అతడు డ్యూటీ అయిన తర్వాత మనిగేరమ్మ కొండపైకి వెళ్లి ఆత్మ తత్వాన్ని పరిశోధించేవాడు తల్లిదండ్రులు శివానంద గారికి రెండవ వివాహం చేయగా 194వ సంవత్సరంలో శివానంద దంపతులకు మగ పిల్లవాడు జన్మించగా నింగన గౌడ అని పేరు పెట్టారు భారీ వర్షాలు కురుస్తున్నప్పుడు వర్షాన్ని చూస్తూ ఆత్మానుభూతిని తనలో తానే అనుభవించేవాడు ఒకసారి అలా కళ్ళు మూసుకుని ఇంటిలో ధ్యానస్థితిలో కూర్చున్నాడు ఐదు గంటలపాటు ఎర్రటి చీమలు శివానంద ఒళ్లంతా పాకి ఆయనను కరుస్తున్నాయి కానీ ఆ స్థితిలో వాటి స్పర్శ ఆయనకు తెలియనే లేదు తాను ఎప్పుడైనా దేవాలయానికి వెళితే ధ్యానస్థితిలో లీనమయ్యేవారు.
    ఒకసారి మణిగేరమ్మ కొండపై ధ్యానస్థితిలో లీనమయ్యారు శివానంద గారు ఆ సమయంలో అప్పటి రామదుర్గ సంస్థానానికి చెందిన రాజా సాహెబ్ గారు తన పరివారంతో కలిసి అటుగా వెళుతూ ధ్యాన స్థితిలో ఉన్న శివానందను చూసి ఎవరితను అని తన పరివారాన్ని అడిగాడు అతని విషయాలను రాజా సాహెబ్ కు కొందరు వివరించారు ధ్యానస్థితిలో ఉన్న అతని చుట్టుపక్కల ముళ్ళపదలు క్రూర మృగాలు ఉన్నాయి శివానంద గారిని కదల్చడానికి గంతో పక్కకు కాల్చాడు కానీ శివానందలో కదలికే లేదు కొన్ని రోజుల తర్వాత శివానందను ఆ రాజు కలసి ఈరోజు ఏమి జరిగిందో ఆరోజు ఏమి జరిగిందోనని చెప్పమన్నాడు అయితే ఆత్మానందంలో మునిగి ఉన్నప్పుడు బయట విషయాలేవీ వినపడవు ఆరోజు ఏమి జరిగిందో నాకు తెలియదు అని సమాధానం ఇచ్చారు.
        శివానంద గారు ఒకసారి ఆయన ధ్యానస్థితిలో ఆత్మానందంలో మునిగి ఉన్నప్పుడు ఒక నాగుపాము ఆయన తొడ పైకి ఎక్కి కూర్చున్నది కానీ శివానంద గారు ఆ సమయంలో ఒక రాయితో సమానంగా కూర్చున్నారు శివానంద గారు మైసూరు సమీపంలోని శంభు లింగ కొండకు వెళ్తూ ఉండగా అతని శిష్యులు మరియు భక్తులు శివానంద స్వామి గారిని ఒప్పించి 195వ సంవత్సరంలో నాగనూరుకు వచ్చేలా చేసి అక్కడ ఆశ్రమాన్ని నిర్మించి ఇచ్చారు. ఆ ఆశ్రమంలోనే నిరంతర అభ్యాసాన్ని కొనసాగిస్తూ ఒక్కోసారి రెండు మూడు రోజులు ఆహారం లేకుండా సమాధి స్థితిలో నిలిచేవారు శ్రీ సిద్ధారుడులే స్వయంగా శివానంద వారిని గురించి ఇలా అన్నారు ఈ శివానంద ఆధ్యాత్మిక పరిపూర్ణతను కాపాడుకుంటూ లౌకిక లావాదేవీలను న్యాయంగా ధర్మ బద్ధంగా కొనసాగించగలిగే శక్తిని కలిగిన వాడు అని చెప్పాడు ఒకసారి శ్రీ శివానంద స్వామిని శ్రీ సిద్ధారు డి స్వామితో పాటుగా పల్లకి బండ్లలో ప్రజలు ఊరేగింపుగా తీసుకెళ్లారు మరియు ఇతర ప్రాంతాల నుంచి తన వద్దకు వచ్చే ప్రజల కోరిక మేరకు శివానంద గారు అక్కడ ఉండడానికి గడక్కు వెళ్లారు ఆయన ప్రతిరోజు దినచర్య ఏమిటంటే ధ్యానం కోసం కూర్చోవటం స్వీయ చింతనలో ఆనందించటం రోజుకు మూడుసార్లు బోధించడం.
           ఒకసారి శివానంద గారు విష ప్రభావానికి గురైనారు విశ్రాంతి కోసం వైద్యం కోసం నాగనూరుకు తీసుకెళ్లారు అంత తీవ్రమైన అనారోగ్య స్థితిలో కూడా అతన్ని చూడడానికి వచ్చినవారికి ఆధ్యాత్మిక విషయాలను వివరించేవారు శివానంద గారి జీవితం ఏ సాంప్రదాయాలు కులాలు, మతాలు మొదలైన వాటికి పరిమితం కాకుండా ఆధ్యాత్మిక సత్యాలను బోధిస్తూ గడిచింది స్వామిని తిరిగి గడక్ తీసుకువచ్చారు ఆయన అనారోగ్యం తీవ్రతరమైనది కానీ ఆయన ఎంతో ప్రశాంతంగా ఉన్నాడు అలాంటి ప్రశాంతమైన స్థితిలో 80 సంవత్సరాల వయసులో 1939 అధిక శ్రావణమాసంలో జులై ఒకటవ తేదీన బ్రహ్మ ముహూర్తంలో తనువు చాలించారు అటువంటి పరమ పవిత్రమైన జీవితాన్ని సాగించి ఎంతోమంది భక్తుల హృదయాలలో నిలిచిపోయిన శ్రీశ్రీశ్రీ శివానంద స్వామి వారి పాద పద్మములకు నమస్కరిస్తూ సర్వేజనా సుఖినోభవంతు జై గురుదేవ్

శ్రీ శ్రీ సున్నిపెంట పూర్ణానంద స్వామి జీవిత చరిత్ర

                  తమిళనాడులో నవంబర్ 1 1939 వ తేదీన సుబ్రహ్మణ్య శాస్త్రి పర్వత వర్ధిని దంపతులకు ఐదవ సంతానంగా జన్మించారు శ్రీ పూర్ణానంద స్వామి వారు తల్లిదండ్రులు పెట్టిన పేరు కామేశ్వరన్ ఈ కామేశ్వరన్ పదవ తరగతి వరకు చదువుకున్నాడు అనివార్య కారణాలతో తండ్రి మరణించగా కుటుంబ బాధ్యతల వలన కొంతకాలం ఉద్యోగం చేశాడుకానీ అటుపై తపస్సు చేసుకోవడానికి అరణ్యానికి వెళ్ళాడు.
                 కామేశ్వరన్ తమిళనాడులోని బాణతీతం వరుణ గుహలలో నెలల తరబడి నిరాహారంగా తపోదీక్ష చేసేవాడు అది గమనించిన శ్రీ శ్రీ రాకాడి బాబా వారి భక్తుడు ఆ బాలుడి విషయాన్ని శ్రీ రాకాడీ బాబా గారికి తెలియజేశారు అప్పుడు స్వయంగా శ్రీ బాబా వారే ఆ బాలుడి దగ్గరకు వెళ్లి ఆ గుహలోనుండే వేడి అన్నం రసం కూరలు పెరుగు బయటకు తీసి ఆ బాలుడిచేత తినిపించాడు గురువు కోసం తపించే వారికి సాక్షాత్తు గురువే స్వయంగా ప్రత్యక్షమవుతాడు అనడానికి ఈ సంఘటనే నిదర్శనం.
           1967 వ సంవత్సరంలో బాన తీర్థ ప్రదేశం తామ్రపర్ని నదిలో రాకాడి బాబా కామేశ్వరన్ ను అభిషేకించి పూర్ణానంద అనే నామకరణం చేసి కాషాయం అనుగ్రహించారు గురువుల ఆదేశంతో క్షేత్ర పర్యటనలు చేస్తూ శిరిడీ చేరుకున్నారు పూర్ణానందులు భక్తులు ఎవరో సాయినాధుని విగ్రహానికి పూలదండ సమర్పించగా 15 అడుగుల దూరంలో ఉన్న పూర్ణానందుల మెడలో ఆ దండ వచ్చి పడింది ఆ అద్భుతాన్ని చూచి జనం స్వామిని చుట్టుముట్టినారు తర్వాత భక్తులకు ఇబ్బంది కలగరాదని సాయి సంస్థాన్ సత్రం మేడపైకి వెళ్లారు స్వామీజీ అక్కడ ఒక గదిలో సాయినాధుని ప్రత్యక్ష దర్శనం కోరిన ఒక భక్తుడు ఆహారం మాని అంత్యదశకు చేరుకున్నాడు ఆ గదిలోనికి ప్రవేశించారు శ్రీ పూర్ణానంద వారు ఆ సమయంలో ఆ భక్తుడికి పూర్ణా నందుల వారు సాయినాధుడిలా దర్శనం ఇవ్వగా అప్పటివరకు శక్తి హీనుడై మంచం పట్టిన అతడు ఒక్కసారిగా బాబా అని పిలుస్తూ సమీపించాడు పాద నమస్కారం చేయగా ఎవరో భక్తులు ఇచ్చిన కోవా బిళ్ళలను ప్రసాదించి వెళ్ళిపోయారు పూర్ణానందులు. చాలాసార్లు స్వామీజీని పరీక్షించి స్వయంగా సాయినాధుడే అని సంతృప్తి పొంది అప్పటినుంచి స్వామితోనే ఉండిపోయిన ఆ భక్తుడే రమణ బాబా గారు.
                పూర్ణానందులు తన ప్రధమ శిష్యుడైన రమణ బాబాతో కలిసి 1969లో శ్రీశైలం చేరుకున్నారు సత్రంలో బస చేసిన స్వామివారికి రెండవ శిష్యుడిగా అన్నం రాజు రామకృష్ణతో పరిచయం ఏర్పడింది అయితే రామకృష్ణకు స్వామీజీ భువనేశ్వరి మంత్రాన్ని ప్రసాదించిన తర్వాత జిల్లెల్ల మోడీ అమ్మ దర్శనం లభించింది.
             హటకేశ్వర ఆశ్రమంలో ఆరేండ్లు గడిపిన స్వామీజీ సుమారు 1972లో సున్నిపెంట ఆశ్రమం తమ నివాసంగా చేసుకున్నప్పటికీ హఠకేశ్వరానికి అప్పుడప్పుడు వస్తూ ఉండేవారు స్వామి సహచర్యం వలన ఎంతోమంది భక్తులు స్వామికి శిష్యులైనారు దురై స్వామి రెండు లీటర్ల డీజిల్ తో అడవికి వెళ్లి ఆశ్రమం కోసం కట్టెలు తేవడం కోసం అక్కడ ఎంతో శ్రమించారు తిరిగి 25 కిలోమీటర్లు ఆశ్రమానికి రావాల్సి ఉంది కానీ తన దగ్గర లారీలో రెండు లీటర్ల డీజిల్ మాత్రమే ఉంది కానీ స్వామిని తలచుకొని లారీని స్టార్ట్ చేసి ఆశ్రమానికి చేరుకున్నారు తిరిగి వచ్చిన తర్వాత చూస్తే ఆ రెండు లీటర్ల డీజిల్ అలాగే ఉంది ఇది స్వామి మహిమగా అందరూ తలిచారు.
          హైదరాబాద్ యూసఫ్ గూడా రామమూర్తి ఇంటి నుండి స్వామివారికి ఒక క్యారేజీ అందింది అయితే ఆ క్యారేజీని తీసుకొని శ్రీశైలం వెళుతూ ఉన్నప్పుడు రామమూర్తి ఇచ్చిన క్యారియర్ను అడవిలో దాహంతో అలమటిస్తున్న వారికి ఇవ్వడం కోసం శ్రీ స్వామి వారు కారును ఆపి అడవిలో ఒకచోట నుండి పరిగెత్తుకుంటూ అడవి లోపలికి వెళ్లారు అయితే ఆ స్వామిని వెంబడించిన డ్రైవర్ గారు స్వామికి తన చేతిలో ఉన్న క్యారియర్ను అందించారు అప్పుడు స్వామి అడవిలో దాహంతో అలమటిస్తూ ఉన్న ఆకలితో అలమటిస్తున్న భార్యాభర్తల దగ్గరికి వెళ్లి ఆ క్యారియర్ను అందించారు. శ్రీ స్వామి వారు అయితే రామమూర్తి ఆ క్యారియర్ అడక్కపోతే వాళ్ళ పెద్దమ్మాయి వివాహం జరుగుతుంది ఈ విషయం ఆ రామమూర్తి గారికి చెప్పొద్దు అని స్వామి వారు కారు డ్రైవరు నంబికి చెప్పారు అయితే ఆ తర్వాత ఎప్పుడు రామమూర్తి గారు ఆ క్యారియర్ గురించి అడగనేలేదు అందువలన రామమూర్తి గారి అమ్మాయి పెళ్లి జరిగి ఆమె అమెరికాలో స్థిరపడింది.
           స్వామీజీ జన్మదిన నాడు కారేయార్ సురుమూత్తు అయ్యనార్ అని క్షేత్రంలో జరపాలని భక్తులు తలచారు అందరూ అక్కడికి వెళ్లారు అక్కడ కొంబేరి ముఖన్ అనే ఒక పాము వచ్చింది అందరూ భయపడి పారిపోయారు కానీ శ్రీ స్వామి వారు అందరితో ఆ పాము తన గురువే తనను ఆశీర్వదించడానికి ఇక్కడికి ఆ రూపంలో వచ్చారు అని అందరితో చెప్పారు .
       శ్రీశైలం ఇష్ట కామేశ్వరి దేవాలయంలో స్వామితోపాటు గడిపిన సూర్యనారాయణ మూర్తి గారు స్వామివారి గురు తత్వాన్ని అంతా తేలికగా అంగీకరించక స్వామివారికి ఎన్నో పరీక్షలు పెట్టి తర్వాత స్వామి అనుగ్రహాన్ని పొందారు 19804లో ఆ తర్వాత ఆ భక్తుడికి సదానంద సరస్వతి అని నామకరణం చేసి సన్యాసి ఆశ్రమం ప్రసాదించారు.   
         మృత్యుముఖంలో ఉన్న మృత్యుంజయ శాస్త్రి గారిని రక్షించి 1985లో కాషాయం ఇచ్చి ప్రకాశానంద స్వామి అనే నామకరణం ప్రసాదించారు.
       శ్రీశైలం ప్రాజెక్టు ఎల్డీసీగా పనిచేసే సీతాదేవికి 25 సంవత్సరాల వయసు రాకముందే రైలు ప్రమాదంలో భర్త వినియోగం సంభవించింది నిరాశతో బతికే ఆమెను ఆశ్రమానికి తీసుకెళ్లింది రాజ్యలక్ష్మి గారు అక్కడ సీతాదేవితో స్వయంగా వంట వంట చేపించుకొని తిన్నారు స్వామి సీతాదేవి దుఃఖం మరిచిపోయింది ఆశ్రమ వాసులు వితంతువుల వంట తినరాదని స్వాముల పాదాలు తాకరాదని ఏవో మాట్లాడుకుంటూ ఉంటే స్వామీజీ వారందరికీ తగు రీతిలో సమాధానం చెప్పారు.
      1991లో వృద్ధ దంపతులు స్వామిని దర్శించారు 60 సంవత్సరాలు దాటిన వారి మనసులో అడుగు ఆరుగురు ఆడపిల్లల తర్వాత మగ పిల్లవాడు లేడనే బాధ ఉంది స్వామి కరుణ వలన మరుసటి సంవత్సరం వారికి కొడుకు పుట్టాడు అంతేకాదు ఎంతోమంది అనారోగ్యవంతులు స్వామిని నమ్మి ఆరోగ్యవంతులైనారు ఒకసారి భక్తుడి అనుమానం నివృత్తి చేయడం కొరకు గాలిని పక్షులను సైతం కొంత సమయం పాటు స్తంభింప చేసి ఆ భక్తుడిని ఆధ్యాత్మిక మార్గంలోనికి మళ్ళించారు.
            స్వామి వారు 1999లో అనారోగ్యంతో హైదరాబాదు భక్తుని ఇంటిలో కొన్నాళ్లు ఉన్నారు. తర్వాత 2000 సంవత్సరం ఫిబ్రవరిలో అపోలో ఆసుపత్రిలో కొన్ని రోజులు ఉన్నారు. ఆ తర్వాత స్వామివారు ఏప్రిల్ 6 2000 సంవత్సరంలో స్వామి కైలాస వాసులైనారు స్వామి జీవితం ఎంతోమందికి ఆదర్శనీయం అందుకే మనమందరం మహనీయులు నడిచిన మార్గాన్ని పవిత్రమైనదిగా భావించి ఆ మార్గంలో నడిచే వారిని గౌరవించుకుందాం పూజించుకుందాం. సర్వేజనా సుఖినోభవంతు జై గురుదేవ్

Friday, April 1, 2022

#1000yogulu

 శ్రీ శ్రీ భగవాన్ సత్యసాయి బాబా వారి దివ్య ఆశీస్సులతో శ్రీ జ్ఞాన యోగా చానల్లో 1000 మంది మహాత్ముల జీవితాలను అందరికీ తెలియజేయాలని సంకల్పించుకున్నాం కాబట్టి తప్పనిసరిగా శ్రీ జ్ఞాన యోగా ఛానల్ కు అందరూ సహకరిస్తారని ఆశిస్తూ ఉన్నాం సర్వేజనా సుఖినోభవంతు ఓం శ్రీ గురుభ్యోనమః

Demo class 7 days yoga class registration

Loading… ఫారం సబ్మిట్ చేసిన తర్వాత WhatsApp లో మమ్మల్ని సంప్రదించండి 🙏 📲 Contact on WhatsApp Your free book View ...