Saturday, August 26, 2023

మహాయోగి శ్రీశ్రీశ్రీ సద్గురు బాలు మామ దివ్య చరిత్ర

      మహాయోగి శ్రీ సద్గురు బాలు మామ జీవితం గురించి తెలుసుకుందాం రండి ....శ్రీ బాలు మామ అనే ఈ యోగి ఒక గొప్ప సాధువు మరియు ఆధ్యాత్మికవేత్త ఈయన గొర్రెలతో జీవనం గడిపేవాడు తర్వాత ఆధ్యాత్మిక చైతన్యం కలిగి తపస్సుతో జీవితాన్ని మార్చుకున్నాడు ఎన్నో అద్భుతాలతో పాటు ప్రజలకు సహాయం చేసేవారు కర్ణాటక మరియు మహారాష్ట్రలో ఎంతో ప్రాచుర్యం పొందిన ఈయన శ్రీ పాండురంగ స్వామికి భక్తుడిగా కీర్తించబడ్డాడు 1892 వ సంవత్సరం అక్టోబరు మూడవ తేదీన కర్ణాటకలోని బెల్గాం జిల్లా చికోడి తాలూకా అనే గ్రామంలో జన్మించారు సత్యవా మాయప్ప అనే పుణ్య దంపతులకు సంతానంగా ఈయన జన్మించగా బల్లప్ప అని తల్లిదండ్రులు పేరు పెట్టారు చిన్నతనంలో  బల్లప్ప ఎవరి శిక్షణా లేకుండా ధ్యానం చేస్తూ ఉండేవాడు అయితే తల్లిదండ్రులు వద్దని వారించేవారు అతన్ని వాలకం చూసి భయపడి ఒక పని ఉంటే బాగుండు కదా అనే ఉద్దేశంతో అతడికి చందూసేటనే ఒక వ్యక్తి దగ్గర ఇంటిలో పనిచేయడానికి పంపారు ఆ చందు సేట్ గొర్రెలను మేపమని చెప్పేవాడు ఎంతో ఆనందంగా తాను చేస్తున్న పనిమీద ఇష్టంతో గొర్రెలను మేపేవాడు అయితే అతను తినే ప్లేట్లో ఒకసారి చందు సేటు గారు అద్భుతాన్ని చూశారు ఆ తర్వాత బల్లప్ప ప్లేటును లాక్కొని దానికి పూజ చేయడం మొదలు పెట్టాడు ఒకసారి బల్లప్ప తన ప్లేటు తనకు ఇవ్వమని అడిగాడు కానీ చందు సేటు ఇవ్వనన్నాడు అలా ఎప్పుడైతే ప్లేటు ఇవ్వలేదు ఇక అక్కడి నుంచి పనిచేయకుండా వెళ్లిపోయాడు మల్లప్ప ఆ తర్వాత అతను తన మేనమామతో కలిసి జీవించేవాడు మేనమామ కొడుకులు అతన్ని బాలు మామ అంటూ పిలిచేవారు అదే కార్యక్రమం లో శ్రీ బాలు మామగా ఆయనకు ఆపాదించబడింది.
      ఒకరోజు అనుకోకుండా ఆ ఊరికి ఇద్దరు సాధువులు వచ్చారు వారు ఎంతో దాహంతో ఉన్నారు ఎంతమందిని అడిగినా ఎవరూ కూడా వారి దాహం తీర్చలేదు శ్రీ బల్లప్ప గారు అత్యంత లోతైన బావిలోనికి చాలా ఇబ్బంది పడుతూ కష్టం మీద దిగి ఆ ఇద్దరు సాధువుల యొక్క దాహాన్ని తీర్చాడు ఆ సమయంలో ఆ బిడ్డ యొక్క గొప్పదనానికి సాధువులు సంతోషించి అనంతమైన దివ్య శక్తిని అతని లోనికి ప్రవేశింప చేశారు తర్వాత ఆయన భావ సమాధికి చేరుకొని మహాత్ముడిగా ఎదిగాడు ఆయన చందుసేట్ ఇంటిలో పనికి చేరేటప్పుడు చందు సేటు గారి ఆవు పాలు ఇచ్చేది కాదు శ్రీ స్వామివారి చెయ్యి తగిలిన మరుక్షణమే ఆ ఆవు పాలిచ్చింది అంతేకాదు వైద్యం కోసం డబ్బులు లేక తమ చిన్నారి యొక్క బాధను చూసి తట్టుకోలేక ఏడుస్తూ ఉన్న తల్లిదండ్రులను చూసి బాధపడి నేలపై కర్రతో కొట్టాడు డబ్బు ప్రత్యక్షమైంది వాళ్లు స్వామికి నమస్కరించి ఆ డబ్బుతో తమ బిడ్డ ఆరోగ్యాన్ని బాగు చేయించుకున్నారు. 
       శ్రీ బాలు మామ గారికి తల్లిదండ్రులు బలవంతంగా పెళ్లి చేశారు అయితే బాలు మామ తన భార్య గర్భవతిగా ఉన్నప్పుడు ఒకరోజు ఆవిడ చుట్టూ ఒక వలయాన్ని గీశారు ఆ వలయాన్ని దాటవద్దని చెప్పారు కానీ ఆమె ఆయన మాట వినలేదు భాష్యం జరిగి బిడ్డ చనిపోయారు ఆ కోపంతో ఆయన ఆమెను విడిచిపెట్టి వెళ్లిపోయారు అయితే ఆయన అలా వెళ్ళిపోయి ఒక సద్గురువు కోసం వెతకడం ప్రారంభించారు పండరీపూర్ కు వెళుతూ ఉండగా వేణునాదం ఊదుతూ ఒక వ్యక్తి ఆయనకు ఎదురుపడ్డాడు తనకు 120 రూపాయలు ఇవ్వమని అడిగాడు ఆ సమయంలో బాలు మామ దగ్గర 120 రూపాయలు మాత్రమే ఉంది శ్రీ స్వామివారికి చెల్లించారు అప్పుడు ఆ క్షణంలో అతనికి అవసరమైన ఆధ్యాత్మిక దీక్షను ప్రసాదించారు ఆయనే శ్రీ బాలకృష్ణ మూలే అని మహాత్ముడు 1966లో కొల్లాపూర్ జిల్లాలోని ఆదమాపూరులో శ్రీ బాలు మామ మరణించారు తన భక్తులు హృదయంతో పిలిస్తే సహాయం కోసం వస్తానని వాగ్దానం చేసి ఆయన దేహత్యాగం చేశారు 74 సంవత్సరాల పాటు జీవించి ఎంతోమందిలో ఆధ్యాత్మిక చైతన్యం కల్పించారు శ్రీ బాలు మామ వారు.
     ఆయన ఆలయం మహారాష్ట్రలో కూడా నిర్మించారు ఎంతోమంది కర్ణాటక మహారాష్ట్రల్లో ఆయనకు భక్తులు ఉన్నారు ప్రతి సంవత్సరము కూడా ఆయన ఆరాధన ఉత్సవాలు ఏడు రోజులపాటు జరుగుతాయి ఆయన ముఖ్యంగా బోధించినవి 
  జంతువులను చంపవద్దు. 
   మీ కర్మకు మీరే బాధ్యులు .
   చెడుకు దూరంగా ఉండండి ....అంటూ బోధించాడు పరమ పవిత్రమైన జీవితాన్ని గడిపిన పుణ్యమూర్తి పాదపద్మములకు నమస్కరిస్తూ...
 సర్వేజనా సుఖినోభవంతు
 జై గురుదత్త
 ఓం శ్రీ గురుభ్యోనమః

శ్రీశ్రీశ్రీ అవధూత మిట్టపాలెం నారాయణ స్వామి చరిత్ర

       శ్రీ అవధూత మిట్టపాలెం నారాయణస్వామి గురించి తెలుసుకుందాం రండి ఒంగోలు జిల్లా మిట్టపాలెం గ్రామానికి చెందిన శ్రీ మిట్టపాలెం నారాయణస్వామి భారతీయ నోస్ట్రడామస్గా తన భక్తుల చేత పిలువబడ్డారు ఆసామాన్యమైన తెలివితేటలు ఆధ్యాత్మిక చింతన కలిగిన వ్యక్తి శ్రీ అవధూత మిట్టపాలెం నారాయణ స్వామి వారు హిందువులే కాకుండా అన్ని మతాలకు కులాలకు చెందిన భక్తులు ఆయనకున్నారు దళిత వర్గానికి చెందిన మహాత్ముడిగా ఆయన ప్రసిద్ధి చెందాడు వెంకటరామయ్య లక్ష్మమ్మ దంపతుల మూడవ సంతానంగా ఈయన జన్మించారు అయితే పుట్టినప్పుడు కొండయ్య అని పేరు పెట్టారు చిన్నతనం నుండే సాధువులతో కలిసి తిరుగుతూ యోగ సాధన ధ్యాన సాధన నేర్చుకున్నారు 1700 సంవత్సర ప్రారంభంలో తన తల్లిదండ్రులు మరణించగా ఇక ఆ తర్వాత ఆయన నారాయణపురంలో ఉండే నారకొండ పైకి వెళ్లి అక్కడ తపస్సు చేయడం ప్రారంభించారు.
           ఆ తర్వాత సిద్ధి పొంది ప్రజల్లోకి వచ్చిన తర్వాత ఆయనను నారాయణస్వామిగా అందరూ కూడా పిలిచేవారు ఆయన మహాత్ముడిగా ఎదిగిన తర్వాత ఆయనను చూసిన కొంత మంది అగ్రవర్ణాల వారు అసూయపడేవారు ఎన్నో రకాల అవమానాలను చేయాలని ప్రయత్నించేవారు భగవంతుడి కృప కారణంగా అతడు రక్షించబడ్డాడు కర్రలతో ఆయనను కొట్టబోతే ఆ కర్రలు పాములుగా మారేవి ఆయనను చంపడం కోసం బావిలో పడేశారు. అయినా కూడా ఆయనకు ఏమీ జరగలేదు ఎంతోమంది భక్తులు నారాయణస్వామి పై నమ్మకంతో తమ కర్మల బాధ నుండి విముక్తి కోరుతూ ఆయన పాదాల చెంత వద్దకు చేరుకునేవారు వారిని ఆశీర్వదించి ఎన్నో మంత్రాలను బోధించేవాడు ఆధ్యాత్మిక విషయాలను వారికి చెప్పేవారు కాలం మత్తులో ఇరుక్కున్న అహంకారులకు ఆయన కాళహస్తి రాజు ఆస్థానంలో దోషిగా నిలబెట్టారు బ్రాహ్మణులకు ధర్మాన్ని బోధిస్తున్నాడని కోపంతో ఆ రాజు నారాయణస్వామిని జైల్లో పెట్టించాడు అయినా భగవంతుడే స్వామి వారిని క్షేమంగా బయటపడేలా చేశాడు తర్వాత ఆ లీల తెలుసుకున్న రాజు క్షమాపణ కోరుకున్నాడు అవధూత అని పిలిచి అసమం కోసం చంద్రశేఖరపురంలో కొంత భూమిని మంజూరు చేశాడు స్వామి 1750 లో సమాధి పొందారు ప్రకాశం జిల్లా చంద్రశేఖర మండలం కనిగిరి తాలూకా మిట్టపాలెం లో సమాధి పొందారు .
          ఆలయ ప్రాంగణంలో మూడు వారాలు నిద్రిస్తే కోరికలు తీరుతాయని ప్రజలు విశ్వసిస్తారు శారీరక మానసిక ఆధ్యాత్మిక బాధలతో బాధపడే వారిని రక్షించే రక్షకుడు శ్రీ మిట్టపాలెం నారాయణ స్వామి వారు తపస్సు చేసి హృదయ స్వచ్ఛత పొందడం ద్వారా దైవానుగ్రహం లభించి కర్మను అధిగ మించవచ్చు అని సందేశాన్ని ఇచ్చారు ఆయన ప్రజలు ఎక్కువగా ఆదివారం సందర్శిస్తారు మరియు నేలపై పడుకుని నిద్రపోతారు చర్మ సమస్యలు ఉన్నవారు ముఖ్యంగా సోరియాసిస్ లాంటి సమస్యలు ఉన్నవాళ్లు ఈ ప్రదేశానికి వెళ్తారు చనిపోయిన వ్యక్తుల్ని ఎంతో మందిని శ్రీ స్వామి వారు బ్రతికించారు తన జీవితాన్ని ప్రజాసేవకు ఆధ్యాత్మిక సేవకు అంకితం చేసిన పవిత్రమైన ఆ పుణ్యమూర్తి పాదపద్మములకు నమస్కరిస్తూ ..... 
      సర్వేజనా సుఖినోభవంతు జై గురుదత్త ఓం శ్రీ గురుభ్యోనమః

శ్రీ మహాయోగిని అవధూతమాల పిచ్చమ్మ

        శ్రీశ్రీశ్రీ అవధూత మాల పిచ్చమ్మ అవ్వగారు ఆంధ్రప్రదేశ్ గుడివాడకు దగ్గరలో ఉండే కురుమద్దాలి అనే గ్రామంలో 1870 వ సంవత్సరంలో వడ్డ ముత్తయ్య వీరమ్మ అనే పుణ్య దంపతులకు జన్మించడం జరిగింది. అయితే ఈమె చిన్నప్పటినుంచి తన లోపల తాను లీనమై ఏదో మాట్లాడుకుంటూ ఉండేది అంతేకాదు ఏవేవో ఆవిడకి శబ్ద నాదాలు వినపడుతూ ఉండేది ఒకసారి ఆమె ఒక కట్టెలాగా నిచ్చేస్తూ రాలైపోయింది అలా కట్టేలాగా బిగుసుకుపోయినప్పుడు చాలా రోజులపాటు అలాగే సమాధి స్థితిలో నిలిచిపోయింది కానీ అందరూ కూడా ఆమెకు ఏదో జరిగింది అంటూ వైద్యం చేయించారు అయినా కూడా ఆమె స్థితిలో మార్పు రాలేదు. అయితే ఒకసారి తల్లి అడిగింది అమ్మ నువ్వు ఎందుకలా ఉన్నావు అంటూ అడగ నాకు ఏవేవో వేణు నాదాలు అన్నీ కూడా వినిపిస్తున్నాయి నాకు తెలియకుండానే ఇలా జరుగుతుంది అనుకోకుండా నేను నా మనసులో ఉన్న ఆలోచనలు అన్నీ కూడా ఆగిపోతున్నాయి అందుకే నేను ఇలా మారిపోతున్నాను అంటూ చెప్పింది ఇక తన బిడ్డ యొక్క స్థితిని గమనించిన తల్లి తన బిడ్డకు ఏమవుతుందో అనే భావనతో పెళ్లి చేశారు అయితే పిచ్చమ్మ గారికి పెళ్లి అయిన తర్వాత  కొన్ని నెల తర్వాత భాగ్యమ్మ అనే ఒక అమ్మాయి పుట్టింది ఆ అమ్మాయిని అల్లారు ముద్దుగా పెంచుకుంటూ ఉండగా పిచ్చమ్మ గారి భర్త మరణించాడు అంత కష్టంలో కూడా తన బిడ్డ పై ప్రేమతో చక్కగా పెంచి పెద్ద చేసింది ఒకానొక దశలో ఆ అమ్మాయికి పెళ్లి చేసింది కానీ అనుకోకుండా అల్లుడు కొన్ని రోజులకే చనిపోయాడు తన బిడ్డను అలా చూసి తట్టుకోలేక బలవంతంగా రెండవ పెళ్లి చేసింది కానీ రెండవ అల్లుడు కూడా ఆమెను విపరీతంగా చిత్రహింసలకు గురి చేస్తూ ఉంటే పిచ్చమ్మ గారి కూతురు ఆత్మహత్య చేసుకుని చనిపోయింది ఇలా ఎన్నో కష్టాల మధ్య ఆమెకు జీవితం అంటే వైరాగ్యం కలిగింది పిచ్చమ్మకు అనుకోకుండా కురుమద్దాలి గ్రామంలో ఒక గురువు ద్వారా మంత్రోపదేశం జరిగింది ఇక ఆ తర్వాత సాధన చేస్తూ భావ సమాధి స్థితిలోనికి చేరుకొని తాను ఇంటి నుంచి స్మశానాన్ని లోకి వెళ్లి అక్కడే నివసించ సాగింది దిగంబర జీవితాన్ని ఎన్నుకొని తాను సాధన చేస్తూ ఉండేది ఆకలి వేసినప్పుడు బస్మాన్ని బూడిదను తింటూ ఉండేది ఆవిడ స్మశానంలో ఉన్నప్పుడు ఎన్నో పాములు ఆమె మీద నుంచి పాకేవి అయినా కూడా దేహ బ్రాంతి విడిచి చెల్లించేది కాదు తర్వాత ఆమె పరిస్థితిని గమనించిన కొంతమంది వ్యక్తులు ఆమె మహాత్మురాలని భావించి ఆమెకు 1925లో ఆశ్రమాన్ని నిర్మించారు ఆ తర్వాత తనను నమ్మిన వచ్చి ఎవరైతే ఉన్నారో వారందరికీ ఆమె అనేక తత్వ బోధలు చేస్తూ ఉండేది అయితే అనుకోకుండా ఆమెను కొంతమంది తీర్థయాత్రలకు తీసుకెళ్లారు వచ్చిన తర్వాత తన లోపల ఉన్న దేవుడే కమ్మగా ఉన్నాడు వేరెక్కడి దేవుడు కమ్మగా లేడు అంటూ భక్తులతో పలికింది శ్రీ అమ్మవారు 19501లో జనవరి 15న తన దేహ త్యాగం చేశారు ఎంతో మందికి తత్వ జ్ఞానాన్ని ప్రసాదించి ఆధ్యాత్మిక మార్గంలోనికి రావడానికి ఆవిడ జీవితాన్ని ధారపోశారు అటువంటి పరమ పవిత్రమైన పుణ్యమూర్తి పాదపద్మములకు నమస్కరిస్తూ.... 
సర్వేజనా సుఖినోభవంతు
 జై గురుదత్త
 ఓం శ్రీ గురుభ్యోనమః
     శ్రీ అమ్మగారికి తన భర్త ఎప్పుడు చనిపోతాడో ముందే తెలుసు అంతే కాదు శ్రీ అమ్మవారు గాంధీ గారిని తన కొడుకుగా భావించేవారు తన దర్శనానికి మహాత్మా గాంధీ గారు వచ్చినప్పుడు ఆయనతో ప్రేమగా సంభాషించింది శ్రీ మహాత్మా గాంధీ గారు చనిపోయే రోజు తన భక్తులతో ఆ విషయాన్ని గురించి ముందే చెప్పింది ఇలా ఎన్నో మత్యాలను చూపిన అమ్మ శక్తి నేటికీ ఆమెను నమ్మినవారికి అందుతూనే ఉంది

Wednesday, August 23, 2023

యజుర్వేదం

         ఋగ్వేదం విశ్వమే భగవంతుడని విశ్వమంతా వ్యాపించినది జ్ఞానమేనని వివరిస్తుంది జ్ఞానమే భగవంతుడని తెలియజేస్తుంది ఋగ్వేదం. రాగద్వేషాలకు అతీతంగా ఉన్నప్పుడే శక్తి పెరుగుతుంది శక్తి పెరుగుతూ ఉంటే దాన్నినే అనంతము అంటారు అనంతమైన జ్ఞానమే భగవంతుడు అందుకే ఋగ్వేదాన్ని శాస్త్ర యుక్తంగా అవగాహన చేసుకుంటే రాగద్వేషాలు తొలగుతాయి వాటికి అతీతంగా జీవించే జీవన విధానం పెరుగుతుంది ఋగ్వేదం అంతరిక్ష శాస్త్రం విశ్వాన్ని విశ్వ కదలికలను మాత్రమే తెలియజేస్తూ విశ్వమే భగవంతుడు అని తెలియజేసి మానవుని గురించి విస్మరించడం జరిగింది. అది మానవ జీవితాన్ని పరిపూర్ణం చేసేందుకు అవసరమైన జ్ఞానాన్ని పూర్తిగా అందించలేదు కాబట్టే ఋగ్వేదం ద్వారా మనిషికి సంతృప్తి కలుగదు కేవలం అసంతృప్తి కలుగుతుంది .
       యజుర్వేదం యొక్క మహా వాక్యం అహం బ్రహ్మాస్మి అహం బ్రహ్మాస్మి అంటే నేను సాక్షాత్తు భగవంతుడను పరమాత్మను సచ్చిదానందాన్ని అని తెలియజేస్తూ పరమాత్మను ప్రయోగపూర్వకంగా నిరూపించేది యజుర్వేదం. ఆత్మవిజ్ఞాన శాస్త్రం యజుర్వేదం మనిషి అంతరంగాన్ని తృప్తి పరచడానికి కారణం నేను మేనుల మధ్య ఉన్న సమన్వయాన్ని తెలియజేసి మేనును కరిగించి నేనులో కలుపుతుంది కాబట్టి జీవభావం తొలగి శరీర మమకారం తగ్గిపోయి ఇంద్రియ నిగ్రహం కలిగి జీవితమంతా సున్నాయే అనే భావన కలుగుతుంది అంటే శరీరం లేదు అనే స్థితికి తీసుకెళ్తుంది ఆ స్థితికి వెళ్లిన మనిషి యొక్క అంత రంగం తృప్తి చెందుతుంది అందుకే లేని శరీరానికి ప్రాధాన్యత ఇవ్వటమే అజ్ఞానం అవుతుందని యజుర్వేదం తెలియజేస్తుంది శరీరమే లేనప్పుడు శారీరక మమకారం ఎక్కడి నుంచి వస్తుంది
        మానవతత్వం శుద్ధ చైతన్యం నుండి ప్రాణశక్తి ప్రాణ శక్తి నుండి విశ్వం విశ్వం నుండి భూమి నుండి మానవ శరీరం మానవ శరీరంలో కణాలు ఉంటాయి ప్రతి కణంలో కేంద్రకం ఉంటుంది మానవ దేహంలో 100 త్రిలియన్ కణజాలాలు ఉంటాయి అందుకే మానవదేహానికి ఒకే ఒక మూల ప్రమాణం కణం మానవదేహం పంచభూతాత్మకం అది ఎలాగో చూద్దాం భూమి తత్వం ఎముకలు, కండరాలలో నిక్షిప్తమై ఉంటుంది నీటి తత్వం శరీరంలో నీటి రూపంలో ఉంటుంది అగ్నితత్వం వేడి రూపంలో ఉంటుంది వాయువు శ్వాస రూపంలో ఉంటుంది ఆకాశం ప్రాణ శక్తి రూపంలో ఉంటుంది ఎముకలు కండరాలు తమోగుణాన్ని కలిగి ఉంటాయి నీరు తమోగుణం రజోగుణం సత్వగుణంతో కూడి ఉంటుంది వేడి రజోగుణంతో ఉంటుంది వాయువు రజోగుణంతో ఉంటుంది ఆకాశం సత్వగుణంతో ఉంటుంది భూమి ముక్కు --వాసన--- శరీరం దీన్ని ఫిజికల్ బాడీ అంటారు నాలుక ---రుచి-- శరీరం ప్రానిక్ బాడీ ...అగ్ని --కన్ను---- దృష్టి-- శరీరం మెంటల్ బాడీ ...వాయువు-- చర్మం-- స్పర్శ--శరీరం ఆస్ట్రల్ బాడీ ...ఆకాశం-- చెవులు-- శబ్దము-- శరీరం యాత్రిక్ బాడీ ....విశ్వమంతా వ్యాపించిన శక్తి మోతాదును పరమాత్మ అంటారు అటువంటి శక్తి వ్యక్తి దేహానికి పరిమితమైతే దాన్ని దేహాత్మ జీవాత్మ అంటారు
    అది మానవదేహంలో ప్రతి అణువులో ప్రాణ శక్తిగా ఉంది సౌర కుటుంబంలో కక్షలో తిరుగుతున్న భూమి అనే గ్రహానికి ఉన్న ప్రత్యేక లక్షణం అయస్కాంత శక్తి ఆ ఇయస్కాంత శక్తి వల్లనే వాతావరణం ఏర్పడింది వాతావరణం జీవి మనుగడకు ఆధారం అవ్వటం వలన భూమిపై సమస్త ప్రాణికోటి ఆవిర్భవించింది వాతావరణం నుండి కర్బన కర్బన పదార్థం ఏర్పడగా కర్బన పదార్థం నుండి జీవపదార్థం ఏర్పడింది జీవపదార్థం నుండి వైరస్ జీవి కాదు ఇది నిర్జీవి మాత్రమే వైరస్ నుండి బ్యాక్టీరియా ఆ బ్యాక్టీరియా నుండి ఏకకణ జీవులు ఏకకణ జీవుల నుండి జంతువులు వృక్షాలు ఏర్పడ్డాయి ముందుగా జంతువులు ఆ తర్వాత వృక్షాలు ఏర్పడ్డాయి మళ్లీ ఆ జంతువులలో బహుకణ జీవులు ఏర్పడ్డాయి బహుకణ జీవులలో వెన్నుముక లేనివి వెన్నముఖ కలిగిన జీవులు ఏర్పడ్డాయి వెన్నెముక కలిగిన జీవులలో అకశేరుకాలు సకచేరు కాలు ఉద్భవించగా సకసీరు కాల నుండి శీతల జంతువులు ఉష్ణ మండల జంతువులు ఏర్పడ్డాయి ఉష్ణ మండల జంతువులలో పక్షులు అంటే ఈకలు కలిగినవి క్షీరదాలు అంటే వెంట్రుకలు కలిగినవి ఏర్పడ్డాయి క్షీరదాల అత్యున్నత పరిణామ క్రమంలో మానవుడు ఉద్భవించాడు మానవ దేహం ముందుగా కారణ శరీరం ద్వారా అభివృద్ధి చెందుతుంది కారణ శరీరం కావాలంటే స్త్రీ పురుషుల అర్థబీజాల కలయిక కావాలి రెండు అర్థబిజాల సంయుక్త కలయికయే కారణ శరీరం దీన్నే gygote అంటారు కారణ శరీరం తల్లి గర్భంలో మానవ దేహంగా రూపాంతరం చెందుతుంది తల్లి గర్భంలో మానవదేహంగా రూపాంతరం చెందాలంటే పంచభూతాల శక్తి అవసరం అందుకే ఈ మానవదేహాన్ని పంచభూతాత్మకం అంటారు.
              పంచభూతాలలో నిండి ఉన్నది అనువులు పరమాణువులు రేణువులు రేణువులకు ఆధారం ప్రాణశక్తి ఆ ప్రాణ శక్తికి ఆధారం శుద్ధ చైతన్యం నేను అంటే శుద్ధ చైతన్యం శుద్ధ చైతన్యమే భగవంతుడు నేను నుండి ఏర్పడినదే నేను నేను లేకుండా నేను రాదు మేనుకు ఆధారం నేను నేను నుండి ఏర్పడిన మేను తిరిగి మరల నేనులో కలిసిపోతుంది మేనుకు పుట్టుక మరణాలు ఉంటాయి కాబట్టి మేనులో నిరంతరం మార్పులు జరుగుతాయి కాబట్టి అది అశాశ్వతం నేనుకు పుట్టుక మరణాలు ఉండవు అది నిరంతరం కొనసాగుతుంది నేను అంటే అహం అహం అంటే భగవంతుడు భగవంతుడు అంటే ఏకత్వం మేను అంటే నేను ప్లస్ అహం అహంకారం అహంకారం భిన్నత్వం నేను దేహాత్మ జీవాత్మ అయితే మేను అనేది దేహము లేక జీవుడు నేను అఖండం అనంతం దేహానికే పరిమితం కాదు
         నేను అనేది పరిమితం ,ఖండం విశ్వంలో అది ఒక భాగం నేను కంటికి కనిపించదు వేరు చేసి చూడలేం నిరూపణకు సాధ్యం కాదు మేలు కనిపిస్తుంది మార్పు చెందుతుంది నేను నేను ఏర్పడటానికి ఉపయోగపడుతుంది మేను చివరికి తిరిగి నేనుగా మారుతుంది నేను నిరాకారం నిరంజనం నిర్గుణం మేలు మాత్రం సహకారం సామీప్యం సగుణం నేను విష్టి మేధస్సు ద్వారా శరీరం ఏర్పడటానికి ఉపయోగపడుతుంది నేను వెస్టిమేధస్సుకు అనుగుణంగా జీవితం కొనసాగించడానికి అవసరమవుతుంది నేను లేకపోతే నేను లేదు నేను లేకపోతే నేనును గుర్తించలేము నేనుకు అవరోధాలు ఏమిటంటే ఒకటి శరీరం రెండవది ఇంద్రియాలు మూడవది మనసు నాలుగవది బుద్ధి ఆత్మస్థితికి చేరాలంటే శారీరక మమకారం కరిగిపోయి ఇంద్రియ నిగ్రహం కలగాలి మనసు నిచ్చలంగా ఉండి బుద్ధి సమత్వంలో పనిచేయాలి బుద్ధి సమత్వంలో పనిచేయాలంటే జీవితం పట్ల చక్కటి అవగాహన విచక్షణ వివేకము ఉండాలి జీవితమంటే పుట్టుక మరణాలతో కూడి ఉండి ద్వంద్వాలతో కొనసాగుతుంది జీవితానికి గతము వర్తమానము భవిష్యత్తు ఉంటాయి. జీవితం అంటే తాత్కాలికమైనది ఏది నీది కాదు వస్తూ వట్టి చేతులే పోతో వట్టి చేతులే ఏది ముఖ్యం కాదు ఏది ఎక్కువ తక్కువ కాదు జీవితంలో సాధించింది లేదు సాధించాల్సింది లేదు సాధిస్తున్నది లేదు సాధన చేయాల్సింది లేదు ఎందుకంటే జీవితం 0 అదే శూన్యం శూన్యమే శుద్ధ చైతన్యం శుద్ధ చైతన్యమే నేను నేనే భగవంతుడు.
         శారీరక మమకారం ఉన్న ఏ వ్యక్తి ఆత్మస్థితికి చేరలేడు శారీరక మమకారం ఉన్న వ్యక్తి రాగద్వేషాలలో ఉంటాడు రాగద్వేషాలలో ఉన్న వ్యక్తి ద్వంద్వాలకు అతీతంగా జీవించలేడు శారీరక మమకారం ఉన్న వ్యక్తి భిన్నత్వంలో జీవిస్తాడు భిన్నత్వంలో జీవించే వ్యక్తి ఏకత్వానికి దూరం అవుతాడు ఏకత్వానికి దూరమైతే ఉన్నది ఒక్కటే అన్న సత్యం అవగతం కాదు సత్యం అవగతం కాకపోతే సత్య దర్శనం జరగదు సత్య దర్శనం కాకపోతే ఆత్మస్థితి కలుగదు
        శరీరాన్ని సుచిగా శుభ్రంగా ఉంచాలి. శరీరాన్ని చివరి దశ వరకు పోషించాలి. శరీరానికి ఏది అవసరమో దాన్ని అందిస్తూ ఉండాలి. శారీరక మమకారం దూరమైనప్పుడే ఇంద్రియ నిగ్రహం కలిగి బుద్ధి సమత్వంలో ఉంటుంది శరీరమే లేదు అనే స్థితికి చేరిన తర్వాత ప్రాణ శక్తి శరీరంలోని ప్రతి అణువణును పరిశుద్ధం చేసి శరీరాన్ని ఆరోగ్యవంతంగా మార్చుతుంది.
          శారీరక మమకారం ఉన్న వారికే ఇంద్రియ చైతన్యం అధికంగా ఉంటుంది ఇంద్రియ చైతన్యం అధికంగా ఉంటే కోర్కెలు పెరుగుతాయి అవి బంధాలకు దారితీసి స్వేచ్ఛను హరించి వేస్తాయి స్వేచ్ఛను కోల్పోయిన మరుక్షణం ఈ శరీరంలో జబ్బులు సమస్యలు బాధలు అందుకే అంటారు  
    అటాచ్మెంట్ ఇస్ మదర్ ఆఫ్ మిజరీస్ సారో సఫరింగ్ అండ్ డిసీజ్ ‌అందుకే మనసు  అదుపులో ఉండాలంటే ఇంద్రియ నిగ్రహం చాలా అవసరం బుద్ధి పక్షపాతంలో ఉంటే భిన్నత్వం కనిపిస్తుంది విచక్షణ వివేకం విజ్ఞత కోల్పోయి చెడు నిర్ణయాలు తీసుకోవడంతో జీవితం పతనమవుతుంది కాబట్టి బుద్ధిని సమత్వంలో పని చేయించాలంటే మనసుని నిచ్చలంగా ఉంచగలగాలి అహం బ్రహ్మాస్మి అనే పదానికి అర్థం అహం అంటే నేను బ్రహ్మమంటే భగవంతుడు నేనే భగవంతుడను అనే సారాన్ని మనకు యజుర్వేదం అందిస్తుంది అన్నింటికీ ఆధారమైన శుద్ధ చైతన్యాన్ని నేను అని అనుకుంటే శుద్ధ చైతన్యం అనేది భగవంతుడైనప్పుడు నేనే భగవంతుడు అనేది తప్పక సత్యం అవుతుంది అందుకే యజుర్వేద సారాంశం మనిషిని ఆత్మస్థితికి చేరడానికి చేర్చడానికి ఉపయోగపడుతుంది
  మానవ జీవితం దేనికి అంటకుండా ద్వంద్వాలకు అతీతంగా సాగుతూ పుట్టుక మరణాలను సమానంగా భావిస్తూ జీవితమంతా సున్నాయే అని తెలుసుకొని జీవితం పట్ల చక్కగా అవగాహన ఉండాలి యజుర్వేదం అనేది ఆత్మవిజ్ఞాన శాస్త్రం అది మానవుని యొక్క పరబ్రహ్మ తత్వాన్ని తెలియజేస్తుంది పరిపూర్ణజ్ఞానం అనుభవంలోనికి రాకుండా సాధన కఠిన తరమవుతుంది అసలు శరీరమే లేదు అనే జ్ఞానం అనుభవం లోనికి వచ్చిన తర్వాత సాధన ఎక్కడ ఉంటుంది సాధన చేయటం అజ్ఞానం సాధన చేయటం అవసరం లేదు అనే స్థితికి లేంతవరకు సాధన చేయాలి కఠోర సాధన చేయటం అతి ప్రమాదకరం నిస్వార్ధంగా లోక కళ్యాణం కోసం ఆలోచన చేస్తే అనంతమైన జ్ఞానం అంతరంగం నుండి లావా లాగా పొంగుతుంది
 

సర్వేజనా సుఖినోభవంతు

సామవేదం

    నాలుగు వేదాలలో అత్యంత కీలకమైనది సామవేదం. ఋగ్వేదం పాక్షికమైనది యజుర్వేదము పాక్షికమైనది వాటిని కలిపి చూడటమే సామవేదం. సామవేదం యొక్క మహా పదం "తత్వమసి" తత్ అంటే నీవు త్వం అంటే నేను అసి అయి ఉన్నాను .అంటే నీవే నేను అయి ఉన్నాను పరమాత్మ జీవాత్మ ఒకటే అయి ఉన్నది అని అర్థము ఋగ్వేదం విశ్వతత్వానికి సంబంధించినదైతే యజుర్వేదం మానవ తత్వానికి సంబంధించినది ఈ రెండింటిని ఒక్కటి చేసి చూపేదే సామవేదం.
          విశ్వమంతా బ్రహ్మమయమైనప్పుడు మానవదేహమంతా బ్రహ్మమయమైనప్పుడు రెండూ ఒక్కటే రెండింటిలో ఉన్నది బ్రహ్మమే అని తెలియజేసేది సామవేదం విశ్వమంతా సమిష్టి మేధస్సు ద్వారా ఆవిర్భవించింది అందుకే విశ్వం అనంతం అది బ్రహ్మమయం అందులో వందల కోట్ల నక్షత్ర మండలాలు కూటములు గ్రహాలు ఉంటాయి నక్షత్రాలన్నీ గురుత్వాకర్షణ శక్తి చేత బంధించబడి ఉంటాయి విశ్వంలో నిరంతరం మార్పులు జరుగుతూ ఉంటాయి దానిని భౌతిక పరిణామం అంటారు విశ్వమంతా గనము ద్రవము వాయువులుగా జీవ నిర్జీవ పదార్థాలుగా విభజించబడి ఉంటుంది విశ్వం పంచభూతాత్మకం విశ్వాన్ని నడిపించే శక్తి ప్రాణ శక్తిగా గురుత్వాకర్షణ శక్తిగా అయస్కాంత శక్తిగా ఆకర్షణ శక్తిగా వికర్షణ శక్తిగా విద్యుత్తులుగా రూపాంతరం చెందును విశ్వంలో సృష్టి స్థితి లయలు ఉంటాయి విశ్వంలో ఖాళీ ప్రదేశంలో ఎక్కువ విశ్వమంతా కనిపించే భిన్నత్వంలో దాగి ఉన్నది ఏకత్వమే అదే భగవంతుడు ప్రజ్ఞ కుషించుకుంటే భిన్నత్వం ప్రజ్ఞ విస్తరించే కొలది ఏకత్వం విశ్వతత్వంలో ఆత్మ అణాత్మ పరస్పరం కలిసి ఉంటాయి. 
      విశ్వమంతా వ్యాపించి ఉన్న ఆత్మనే విశ్వాత్మా లేక పరమాత్మ అంటారు విశ్వమంతాకి ఆధారం శుద్ధ చైతన్యమే అందుకే సిద్ధ పురుషులు విశ్వంలో ఉన్న ప్రతి వస్తువులో భగవంతుడిని చూస్తారు ఇలా విశ్వాన్ని గురించి విశ్వతత్వాన్ని అందులో విస్తరించిన భగవంతుడిని గురించి తెలియజేసేది ఋగ్వేదం అందుకే దీనిని అంతరిక్ష శాస్త్రం అంటారు
       మానవదేహము వ్యష్టి మేధస్సు ద్వారా ఆవిర్భవించింది అందుకే అది పరిమితమైనది మానవదేహమంతా అణువులమయం ప్రతి అణువులో శుద్ధ చైతన్యం ఉంటుంది ఆ శుద్ధ చైతన్యానికి ఆధారం భగవంతుడు కాబట్టి మానవదేహమంతా బ్రహ్మమయం మానవదేహం కూడా పంచభూతాత్మకంగా ఉండి పంచభూతాలు నిరంతరం దేహం లోపల కు ప్రవేశించి బయటకు విడుదల అవుతూ ఉంటాయి మానవదేహానికి పుట్టుక జీవించుట మరణించుట ఉంటాయి
         కాబట్టి మార్పులు చెందే మానవదేహం అశాశ్వతం ఆత్మ దేహము పరస్పరం కలిసి ఉంటాయి మేనుకు ఆధారం నేను అంటే ఆత్మ నేను అంటే శుద్ధ చైతన్యం నేను అంటే భగవంతుడు ఆత్మస్థితి కలిగిన క్షణంలో మాత్రమే సత్య దర్శనం అవుతుంది సత్య దర్శనాన్ని పొందిన సిద్ధ పురుషులు దేహంలోని ప్రతి భాగంలో భగవంతుని దర్శిస్తారు విశ్వాన్ని మానవదేహానికి మధ్యగల సూక్ష్మమైన సంబంధాన్ని గురించి వివరించేదే సామవేదం.
        వేదం ఒక్కటే అని ప్రయోగపూర్వకంగా నిరూపించేదే సామవేదం ఋగ్వేదాన్ని యజుర్వేదాన్ని అనుసంధానం చేసినదే సామవేదం. సామవేదం అంతాపూర్ణమే అని తెలియజేస్తుంది విశ్వతత్వంలో ఉన్నది మానవతత్వంలో ఉన్నది అంతా ఒక్కటే అని ప్రయోగపూర్వకంగా వివరించి నిరూపించే శాస్త్రమే సామవేదం.
        రెండవది లేదు ఉన్నది ఒక్కటే అని బ్రహ్మం తప్ప వేరే మరొకటి లేదని ఏకత్వం ఒక్కటే అని అదే అనేక రూపాలుగా కనబడుతున్నదని లోపల బయట అంతటా ఒక్కటే ఉందని వివరించేదే సామవేదం అందరూ నీవే అన్నింటిలో ఉన్నది నీవే నీకు పుట్టుక మరణాలు లేవు నీవు విశ్వానికి తండ్రివి నీవు విశ్వానికి యజమానివి అని తెలియజేసేదే సామవేదం రెండవది లేదు ఉన్నదంతా ఒక్కటే అని తెలిపేదే అద్వైత శాస్త్రం.
         శారీరక మమకారం ఉంటే దేహమే నీవు అనే భ్రమలో ఉంటావు శారీరక మమకారం తొలగిపోతే దేహానికి విడిగా ఉంటావు విడిగా ఉన్న దేహానికి ఆధారమైన నేను అనేది భగవంతుడే సూక్ష్మతత్వమైన శుద్ధ చైతన్యం గురించి స్థూలతత్వమైన స్థూల జగత్తు గురించి తెలిపి వాటి మధ్య ఉన్న ఏకత్వమే భగవంతుడని వివరించేదే సామవేదం.
విశ్వంలో ఏదైతే ఉందో అదంతా మానవుని లోనే ఉందని మానవుడు విశ్వానికి ప్రతిరూపమని తెలియజేస్తూ విశ్వం బ్రహ్మమైనప్పుడు మానవుడు కూడా బ్రహ్మమే అని నిరూపిస్తుంది సామవేదం.

 సర్వేజనా సుఖినోభవంతు స్వస్తి

ఋగ్వేదం

                ఋగ్వేదం యొక్క మహా వాక్యం" ప్రజ్ఞానం బ్రహ్మ" అంతరిక్ష శాస్త్రం గురించి తెలియజేసేది ఋగ్వేదం అంటే విశ్వం గురించి విశ్వ కదలికలను గురించి విశ్వం ఆవిర్భవించడానికి వెనుక దాగిన మూల కారణం గురించి వివరించేదే ఋగ్వేదం .
       విశ్వమంతా జ్ఞానమయం జ్ఞానం లేని ప్రదేశం లేదు జ్ఞానం రెండు రకాలు భౌతిక జ్ఞానం మరియు ఆత్మజ్ఞానం. సృష్టికి సంబంధించిన విషయాలను తెలిపేది భౌతిక జ్ఞానం, సృష్టికర్తకు సంబంధించిన విషయాలను తెలిపేది ఆత్మజ్ఞానం దానినే బ్రహ్మ జ్ఞానము అద్వైత జ్ఞానము అంటారు.
        భౌతిక జ్ఞానం మూడు రకాలుగా వస్తుంది ఒకటి పంచ జ్ఞానేంద్రియాల ద్వారా లభించేది ,రెండవది పనులు చేయటం ద్వారా కర్మలను ఆచరించడం ద్వారా వచ్చిన ఆ అనుభవ సారం ద్వారా లభించేది, మూడవది భూమండలం అంట ఆలోచనలు పరిభ్రమిస్తూ ఉంటాయి. వాటిని వాసన బీజాలు అంటారు ఆ వాసన బీజాల ద్వారా లభించే జ్ఞానమే భౌతిక జ్ఞానం.
        భౌతిక జ్ఞానం స్థూలత్వానికి సంబంధించినది కానీ ఆత్మ జ్ఞానం సూక్ష్మత్వానికి సంబంధించినది, ఆత్మజ్ఞానం సృష్టికి మూలమైన సృష్టికర్తను గురించి తెలుపుతుంది ఈ విషయాన్ని అనుభవంలోనికి తెచ్చుకునే వారినే బ్రహ్మజ్ఞానులు అంటారు. అంటే ఉన్నదంతా ఏకత్వమే అన్న బ్రహ్మజ్ఞానాన్ని తెలుసుకునే వ్యక్తులు బ్రహ్మజ్ఞానులన్నమాట.
            వేదాంతపరంగా అయితే ఈ బ్రహ్మజ్ఞానాన్ని చిత్ అంటారు దాన్ని నిల్వ చేసుకునే భాగమే చిత్తము విశ్వమంతా జ్ఞానమయమైనప్పుడు జ్ఞానం లేని ప్రదేశమే లేనప్పుడు ఉన్నదంతా ఒక్కటే అదే భగవంతుడు అని తెలుసుకోవటానికి జ్ఞాన సమపార్జన అంటారు జ్ఞానాన్ని లోపలికి స్వీకరించి భద్రపరిస్తే దాన్నే విజ్ఞానము అంటారు ప్రజ్ఞానం అనంతంగా విస్తరింప చేసే ఋగ్వేదాన్ని తెలియజేసే జ్ఞానం కాబట్టి దాన్ని ప్రజ్ఞానం బ్రహ్మ అన్నారు.
           ప్రజ్ఞ అంటే చేతనత్వం అంటే అనంతంగా విస్తరించిన చేతనత్వం గురించి తెలియజేసేదాన్ని ఋగ్వేదము అంటారు ప్రజ్ఞ అనంతంగా విస్తరించే కొలది సూక్ష్మాతి సూక్ష్మమైన విషయాలు అవగాహన అవుతాయి అంటే విశ్వంలో జరిగే సూక్ష్మ కదలికలు గోచరమవుతాయి అంటే ఉన్న సత్యాన్ని గ్రహించాలంటే మానవుడు తన మనసుని విస్తరింప చేయాలి మనసు కుంచికొని ఉంటే స్థూలత్వానికి వెళతారు అంటే భౌతిక పరమైన అంశాలలో ఇరుక్కుపోతారన్నమాట.
      భౌతిక ప్రపంచంలో ఏ జ్ఞానం ఉన్నా అంతరంగంలో దాన్ని పొందే సంస్కారాలు లేకపోతే ఆ జ్ఞానం ఉన్నా లేనట్లే అంతరంగంలో ఉన్న సంస్కారాలను బట్టే జ్ఞానం కోసం పరితపిస్తాం మనం చూసే భౌతిక ప్రపంచమంతా మన అంతరంగం యొక్క సృష్టి.
       శారీరక ఇంద్రియ మానసిక బుద్ధి మట్టాల పరిధిలో జీవించే వ్యక్తులు భౌతిక సమాచారాన్ని మాత్రమే స్వీకరించగలుగుతారు ఎవరైతే సంస్కారాలను కరిగించుకొని ఆత్మస్థితికి చేరతారో అటువంటి వ్యక్తులు స్వీకరించే జ్ఞానాన్ని ఆత్మజ్ఞానం అంటారు ఆత్మస్థితికి చేరిన వ్యక్తుల మాట వేదమవుతుంది కొంతమంది ఉత్తమ జాతి వ్యక్తుల అత్యున్నత స్థితి నుండి వేద జ్ఞానం ఆవిర్భవించింది వేద విజ్ఞానం యొక్క అంతిమసారమే అద్వైత జ్ఞానం అదే బ్రహ్మజ్ఞానం ఆత్మజ్ఞానం ఒక వ్యక్తి ఆత్మజ్ఞానాన్ని పొంది పరిపూర్ణుడు కావాలంటే పూర్ణ అద్వైత బ్రహ్మజ్ఞానం తెలిసిన ఒక గురువు ద్వారా జ్ఞానాన్ని పొంది గురువు యొక్క అవసరం లేని స్థితికి ఎదిగి స్వయం సాధన ద్వారా సత్య దర్శనాన్ని అనుభూతి చెందవలసి ఉంటుంది.
       సత్య దర్శనం పొంది ఆత్మస్థితికి చేరిన తర్వాత బాహ్య గురువు యొక్క అవసరం ఏమాత్రం ఉండదు. విశ్వం అనేది వందల వేల లక్షల కోట్ల పాలపుంతలతో నక్షత్ర మండలాలు నక్షత్ర కూటములు నక్షత్రాలు సౌర కుటుంబాలతో గ్రహాలు ఉపగ్రహాలతో కూడి ఉంటుంది విశ్వమనేది పంచభూతాలతో నిర్మితమై ఉంటుంది అవి ఒకటి భూమి రెండవది నీరు మూడవది అగ్ని నాలుగవది వాయువు అయిదవది ఆకాశం .
     లపంచభూతాలన్నింటిలో అణువులు పరమాణువులు రేణువులు ఉంటాయి. భూమిలో ఉన్న అణువుల సంఖ్య ఎక్కువగా ఉండటం వల్ల అది ఘనమైన పదార్థమై బరువు ఎక్కువగా ఉంటుంది నీటి యందు అణువుల సంఖ్య భూమి కంటే తక్కువగా ఉండడం వల్ల ద్రవరూపంలో ఉండి బరువు కూడా తక్కువగా ఉంటుంది అగ్ని యందు అణువుల సంఖ్య నీటి కంటే తక్కువగా ఉండడం వల్ల చాలా తేలికగా ఉంటుంది వాయునందు అగ్ని కంటే తక్కువగా అణువులు ఉంటాయి. ఆకాశంలో కూడా అతి తక్కువ సంఖ్యలో అణువులో ఉంటాయి. ఆకాశము నుండి వాయువు వాయువు నుండి అగ్ని అగ్ని నుండి నీరు నీటి నుండి భూమి ఏర్పడ్డాయి వీటన్నిటికీ మూలం అణువులు అణువులకు మూలం పరమాణువులు పరమాణువులకు మూలం రేణువులు రేణువులకు మూలం ప్రాణశక్తి ఘనీభవించడం ప్రాణ శక్తి గనీభవించడానికి కారణం సంకల్పశక్తి ప్రాణ శక్తికి ఆధారం శుద్ధ చైతన్యం.
        ఆ శుద్ధ చైతన్యం అంటే అది సాక్షాత్తు భగవంతుడే భగవంతుడు అంటే సత్యం నిత్యం నిరాకారం నిరంజనం నిర్గుణం స్థిరం శాశ్వతం సర్వవ్యాపితం స్వచ్ఛం పరిశుద్ధం విశ్వంలో ఉన్న గ్రహాలు ఉపగ్రహాలు ఒక కేంద్రం చుట్టూ వేరువేరుగా తిరుగుతూ ఉన్నప్పటికీ అవి ఒకదానికొకటి విడిపోయి ఢీకొట్టకుండా గురుత్వాకర్షణ శక్తితో బంధించబడి ఎటువంటి ప్రళయాన్ని సృష్టించవు ఎన్నో నక్షత్ర కుటుంబాలలో సౌర కుటుంబం ఒకటి సౌర కుటుంబంలో భూమి అనే ఒక గ్రహంపై జీవి మనుగడ ఏర్పడటానికి కారణం వాతావరణ పరిస్థితులు జీవి మనుగడకు అవకాశం కలిగి ఉండటం భూమి తన కక్షలో తిరుగుతూ సూర్యుడిని ఒకసారి చుట్టి రావడానికి పట్టేకాలం 365 రోజులు తన చుట్టూ తాను తిరిగి రావటానికి పట్టేకాలం 24 గంటలు విశ్వంలో ఉన్న పదార్థం భౌతిక శాస్త్ర పరంగా విశ్లేషిస్తే ఘన ద్రవ వాయువు రూపాత్మకం జీవశాస్త్ర పరంగా అయితే జీవులు నిర్జీవులుగా విభజించవచ్చు విశ్వంలో ఉన్న పదార్థం నిరంతరం మార్పులు చెందుతుంది అంటే జీవులు నిర్జీవులలో కూడా పరిణామం జరుగుతుంది జీవులలో ఈ పరిణామం వేగంగా జరుగుతుంది నిర్జీవులలో మాత్రం జీవపరిణామం నెమ్మదిగా జరుగుతుంది జీవులలో వచ్చే పరిణామాన్ని జీవపరిణామం అంటారు నిర్జీవలలో వచ్చే పరిణామాన్ని భౌతిక పరిణామం అంటారు జీవులలో నిర్జీవులలో ఉన్నవి పంచభూతాలే పంచభూతాలకు ఆధారం ప్రాణశక్తి ప్రతి పదార్థంలో ప్రాణ శక్తి ఉంటుంది మరొక మాటలో చెప్పాలంటే పదార్థము శక్తి అన్యోన్యశ్రమాలు.
        అంటే విడదీయడానికి వీలు లేనివి అందుకే పదార్థంలో దాగిన పరమాణువును తెలుసుకుంటే అనంత శక్తితో కూడిన పాలపుంతను తెలుసుకున్నట్లే సులభంగా అర్థమయ్యేట్లు చెప్పాలంటే విశ్వంలో పదార్థం లేదు శక్తి మాత్రమే ఉంది పదార్థంగా చూస్తే స్థూలత్వం శక్తి పరంగా చూస్తే సూక్ష్మత్వం సూక్ష్మత్వం తెలుసుకుంటే స్థూలత్వం కూడా అవగతం అవుతుంది శుద్ధ చైతన్యంలోని కదలికల ద్వారా సంకల్పశక్తి సంకల్ ప శక్తి ద్వారా ప్రాణశక్తి ప్రాణ శక్తి గనీభవనం చెంది ఎలెక్ట్రాన్ ప్రోటాన్ న్యూట్రాన్లతో కూడిన రేణువు ఆవిర్భవించింది రేణువుల ద్వారా పరమాణువులు పరమాణువుల ద్వారా అణువులు అణువుల ద్వారా పంచభూతాలు ఏర్పడ్డాయి అదే సృష్టి.
       అవ్యక్తమైన శుద్ధ చైతన్యం నుండి వ్యక్తమైనదే ఈ స్థూల జగత్తు మరి ఆత్మ యొక్క స్వరూపం ఏమిటో చూద్దాం. ఆత్మా అనేది కంటికి కనిపించేది కాదు రుచి చూసేది కాదు వాసన చూసేది కాదు దహించేది కాదు ఆత్మ ఉందని నిరూపించలేము లేదు అని తిరస్కరించనూ లేము ఆత్మ అన్నింటికీ ఆధారమే గాని దానికి ఎటువంటి ఆధారమూ లేదు ఆత్మ అంటే రెండు పార్ట్ ఆఫ్ ద ఎంటైర్ యూనివర్స్ ఆత్మ అంటే బిగినింగ్ పార్ట్ ఆఫ్ ద ఎంటైర్ యూనివర్స్ ఆత్మహత్య ఆత్మ సాక్షాత్కారం అనే పదాలు రెండు తప్పు ఆత్మస్థితి ఆత్మానుభూతి అనే పదార్థాలు మాత్రమే సత్యం. ఆత్మస్థితి కానీ ఆత్మానుభూతిని కానీ ఎవరికి వారుగా అనుభవించవలసిందే కానీ ప్రత్యక్ష నిరూపణకు సాధ్యం కాదు నిజంగా ఆత్మస్థితి పొందాలంటే పంచభూతాలను జయించాలి ముఖ్యంగా శరీరాన్ని కలిగించినప్పుడు శరీరాన్ని జయించినప్పుడే ఆత్మస్థితి కలుగుతుంది విశ్వమంతా వ్యాపించిన అనంతమైన శక్తి స్వరూపమే పరమాత్మ లేదా ఆత్మ అటువంటి శక్తి జీవి శరీరంలో నిక్షిప్తమై ఉంటుంది దాన్నే జీవాత్మ అంటారు.
      ఆత్మ అనేది స్థూల జగత్తుకు ఆధారమైనది ఆత్మ నుండి వచ్చినదే అనాత్మ దీన్ని ఆధ్యయము అనవచ్చు ఆత్మ స్వచ్ఛమైనది నిర్మలమైనది అండ్ ఆత్మ నిరంతరం మార్పులకు గురవుతూ ఉంటుంది ఆత్మ కనిపించదు అణాత్మకనిపిస్తుంది ఆత్మ అనాత్మలో అంతర్లీనంగా ఉంటుంది అణాత్మలో ఆత్మ ఉండదు. ఆత్మ ఏకత్వంలో ఉంటుంది తన ఆత్మ భిన్నత్వంలో ఉంటుంది విశ్వంలో ఆత్మ వైశాల్యం చాలా ఎక్కువ విశ్వంలో అనాత్మ వైశాల్యం చాలా చాలా తక్కువ ఆత్మ అనుభవించవలసిందే కానీ నిరూపించడం సాధ్యం కాదు అనాత్మ రుజువులు ఆధారాలతో కూడి ఉంటుంది అనాత్మను నిరూపించవచ్చు ఆత్మ నిరాకారం నిరంజనం నిర్గుణం కంటికి కనిపించదు, ఆకారము లేదు ఏ గుణము లేదు అనాత్మ సహకారం సామీప్యం సగుణం అంటే రూపంతో ఉండి కంటికి కనబడుతూ దగ్గరగా ఉండి గుణాలతో కూడినది అని అర్థం అంతిమంగా ఆత్మ అంటే అన్నింటికీ ఆధారమైనది అని అర్థం స్థూల జగత్తు ఏర్పడటం సృష్టి అయితే అది కొనసాగటం స్థితి చివరకు విచ్చినం కావటాన్నే లయము అంటారు సృష్టికి అధిపతి బ్రహ్మ స్థితికి అధిపతి విష్ణువు లయానికి అధిపతి శివుడు అందుకే వీరి పక్కన శక్తిని ఇవ్వటం కోసం బ్రహ్మకు పక్కన సరస్వతిని విష్ణువుకు పక్కన లక్ష్మీదేవిని శివుడికి పక్కన పార్వతిని ఏర్పరిచారు.
      సృష్టి స్థితి లయలకు కారణం వ్యక్తులు కాదు అనంతమైన శక్తి తత్వం అని అర్థం చేసుకోవచ్చు ప్రతి రేణువులో ఉన్న ఎలక్ట్రాన్ ప్రోటాన్ న్యూట్రాన్ల శక్తులే సృష్టి స్థితి లయలు మట్టి కుండలు మట్టి నుండి ఏ విధంగా ఆవిర్భవించాయో బంగారు ఆభరణాలు బంగారం నుండి ఏ విధంగా ఆవిర్భవించాయో అదే రీతిలో మార్పులకు గురికాని అనంతమైన సత్యం నుండి మార్పులకు గురయ్యే స్థూల జగత్తు ఉద్భవించింది స్థూల జగత్తులో ఏర్పడ్డ ప్రతి పదార్థంలో దాగిన అంతిమ పదార్థం భగవంతుడే అంటే స్థూల జగత్తులో ఏర్పడిన ప్రతి పదార్థం పంచభూతాత్మకం పంచభూతాలు నిరంతరం మార్పులు చెందుతూ ఉంటాయి మార్పులు చెందేది ఏది సత్యం కాదు మార్పు చెందనిదే సత్యం సత్యమే భగవంతుడు అందుకే మార్పులు చెందే స్థూల జగత్తును భగవంతుడు అని పిలవకూడదు .
         అనంతమైన సత్యం నుండే మార్పులు చెందే స్థూల జగత్తు ఆవిర్భవించింది స్థూల జగత్తు అంతటా నిండి ఉన్న సత్యాన్ని గ్రహించినప్పుడే సత్య దర్శనం అవుతుంది సత్య దర్శనమైన వారికి ఆత్మస్థితి కలుగుతుంది ఆత్మస్థితిలో జీవించే వారికి సమదృష్టి ఉంటుంది వారిని సిద్ధపురుషులు అంటారు ఆత్మస్థితిలో జీవించే వ్యక్తులలో రాగద్వేషాలకు అవకాశం ఉండదు రాగద్వేషాలు రెండో పోతే అదే సమాధి సిద్ధ పురుషుల ఆలోచన వేదమవుతుంది మాట మంత్రం అవుతుంది పని యజ్ఞం అవుతుంది ఆత్మని అనాత్మని విభజిస్తే ద్వైతం ఆత్మాలో అణాత్మ ఓక భాగం అని అనుకుంటే దాన్ని విశిష్టాద్వైతం అంటారు అంతా ఒక్కటే అనుకుంటే అద్వైతం .
     ద్వైత విశిష్టాద్వైతాలలో ఇరుక్కుంటే సత్యం గోచరం కాదు ఇది చాలా ప్రమాదం అందుకే అద్వైత దర్శన జ్ఞానం తప్పనిసరి దాని ద్వారా మాత్రమే ఏకత్వం బోధపడుతుంది భారతదేశ ఆధ్యాత్మికత ద్వైత విశిష్టాద్వైతాలలో ఇరుక్కుపోయి విగ్రహ పూజలు వ్యక్తి పూజలకు పరిమితమైపోయింది దాన్ని దాటి అద్వైతంలో ప్రవేశించడమే నిజమైన ఆధ్యాత్మికత .


సర్వేజనా సుఖినోభవంతు స్వస్తి.

శ్రీశ్రీశ్రీ మల్లెంకొండ గుర్రప్ప స్వామి చరిత్ర

instagram link; @MADHU.GURUJI.5 https://instagram.com/madhu.guruji.5?igshid=ZDc4ODBmNjlmNQ==

శ్రీశ్రీశ్రీ మైలవరం గుర్రప్ప స్వామి చరిత్ర
video link:
https://youtu.be/kL-bwyDP8wc

శ్రీశ్రీశ్రీ మద్దిమాను గుర్రప్ప స్వామి చరిత్ర
video link;
https://youtu.be/SYhbsU6cKbU

మల్లెం కొండయ్య గుర్రప్ప స్వామి కథ చదవండి:
సోమశిల నుండి మాల ఆకారంలో గోపవరం చుట్టుకుని చిన్నారి పల్లె దగ్గర ముగుస్తుంది ఈ మల్లెం కొండ ప్రాంతం.         ప్రధాన దేవుడు మల్లెం కొండేశ్వర స్వామి మాల ఆకారంలో ఉంది కాబట్టి మాల్యాద్రి పర్వతం అంటారు సీతాదేవిని వెతుకుతున్నప్పుడు కార్తీక మాసం కావడంతో రాముడు ఈ ప్రదేశంలో ఉండటం వల్ల పూజ కోసం శివలింగాన్ని ఏర్పాటు చేశారని కొందరు చెబుతారు ఇక్కడ ప్రధాన దేవతలు శివుడు గుర్రప్ప స్వామి మరియు అంకమ్మ తల్లి ఈ ప్రాంతంలో మనం కప్పులేని మొండి గోడలతో ఉన్న దేవాలయాన్ని చూస్తాం ఎన్నిసార్లు ఇక్కడ గోపురం కట్టాలనుకున్న అది నిలవలేదు అది స్వామి మహత్యం గా చెప్పుకుంటారు కడప జిల్లాలోని బద్వేలు తాలూకా గోపవరం మండలం మల్లెం కొండలో మల్లం కొండేశ్వర స్వామి ఆలయం ఉంది ఈ ఆలయానికి అత్యంత పురాతనమైన చరిత్ర ఉంది ఈ ప్రదేశానికి చేరుకోవాలంటే దాదాపుగా ఏడు నుంచి ఎనిమిది కిలోమీటర్లు కొండల్లో కాలినడకన ట్రెక్కింగ్ చేయాలి.                          ఇక చరిత్ర విషయానికి వస్తే అంకమ్మ అనే శివ భక్తురాలు ఈవిడ రాజవంశానికి చెందిన వ్యక్తి అయితే ఆమె కాశీయాత్రకు వెళ్తూ మార్గమధ్యంలో మల్లంకొండ శివాలయం ఉందని తెలుసుకొని తన అనుచరులతో పాటు అక్కడికి చేరుకొని రాత్రిపూట శివుని పూజించింది ఉదయాన్నే జలపాతం లో స్నానం చేసి శివున్ని పూజిస్తుండగా ఆ ప్రాంతానికి రాక్షస జాతికి చెందిన మనుషులు దుర్మార్గులైన మనుషులు వచ్చారు.
       ఆమెను చుట్టుముట్టి హింసిస్తుండగా అడ్డం వచ్చిన అనుచరులందరినీ నరికి చంపారు ఆ క్షణంలో అంకమ్మ శివుని వేడుకుని తన అనుచరులను చంపిన  వారిని సంహరించమని శివుడు తో కోరుకుంది.
     అప్పుడు ఆమె తో శివుడి ఇలా చెప్పాడు అమ్మ నేను ఈ రూపంలో ఎవరిని చంపలేను ఇది జన్మను అందించే రూపం అని చెప్పి అదృశ్యం అవుతాడు తర్వాత అక్కడి నుంచి తప్పించుకుని రాక్షస జాతిని అంతం చేయాలని ఉద్దేశంతో ఎన్నో యుద్ధ విద్యను నేర్చుకొని త్రిశూలం డమరుకం ఖడ్గం ధరించి యుద్ధానికి వెళ్లి రాక్షసులను సంహరిస్తూ ఉండగా చనిపోయిన వాళ్లంతా కూడా మళ్లీ బ్రతకడం మొదలుపెట్టారు వాళ్లను చంపలేక అలసిపోయి ఇంటికి వెళ్ళిపోతుంది.
         మళ్ళీ శివుడిని ధ్యానించగా శివుడు ప్రత్యక్షమై వరం కోరుకోమంటాడు ఆ క్షణంలో తనకు బిడ్డను ప్రసాదించమని కోరుకోగా ఫలితంగా ఆమెకు మగ బిడ్డ పుడతాడు ఆ పిల్లవాడికి మల్లెం కొండయ్య అని పేరు పెడుతుంది తనే తన దగ్గరున్న అన్ని విద్యలను కూడా బిడ్డకు నేర్పుతుంది సమాజం తండ్రి లేని కొడుకు అని నీచంగా ఆ బిడ్డను చూసినప్పుడు ఆ బిడ్డ ఇంటికి వచ్చి తల్లినీ నిలదీస్తాడు జరిగిన విషయం అంకమ్మ తన కొడుక్కి చెప్పగా మళ్లీ శివున్ని ధ్యానించడం కోసం అడవికి వెళ్తాడు.
            మల్లెం కొండయ్య కు శివుడు ప్రత్యక్షమై నువ్వు కారణజన్ముడవు నీవు ఒక కార్యం నెరవేర్చాల్సింది అని చెప్పి శివుడు ఆదేశిస్తాడు తల్లి దగ్గరకు వెళ్లి జరిగిన విషయం చెప్పి రాక్షసులను సంహరించడానికి నేను సహకరిస్తానమ్మ అంటూ తల్లికి చెప్పగా ఆ తల్లి రాక్షసులను సంహరించడంమే నా కర్తవ్యం నా లక్ష్యం అంటూ చెబుతుంది .
      అప్పుడు తన సేవకుడైన పోతురాజు ద్వారా ఆయుధాలను సేకరించుకొని తల్లి కొడుకులిద్దరూ కూడా గుర్రాలు ఎక్కి రాక్షసుల పైకి దండయాత్ర చేస్తారు అలా అమ్మ కొడుకు ఇద్దరూ కూడా యుద్ధం చేస్తూ ఉండగా రాక్షసుల రక్తపు బొట్టు కింద పడకుండా ఒక పాత్రలో పట్టుకొని ఆ రక్తంలో ఉన్న జీవాన్ని అంకమ్మ తన నాలుకతో సంహరించేది చివరికి అందరినీ సంహరిస్తారు.
        ఒక రాక్షసుడు మాత్రం పందిలోనికి పరకాయ ప్రవేశం చేస్తాడు ఆ పందిని చంపమని అంకమ్మ చెబితే ఆ పందిని కొండ అంచు నుండి కత్తితో కొట్టగా ఐదు ప్రదేశాల్లో ఆ భాగాలు లింగ రూపంలో పడిపోతాయి వాటిని పంచ లింగాల కోనలు గా చెబుతారు .
        ఆ తర్వాత శివుడు ఆ ప్రాంతంలో ఉన్న దుర్మార్గులను శిక్షించి ప్రజలను కాపాడినందుకు తన ఆలయాన్ని కాపాడినందుకు అంకమ్మను మల్లెం కొండయ్యను దీవించి అక్కడే ఉండమని ఆదేశిస్తాడు తనను భక్తితో సేవించుకొమ్మని శివుడు చెప్పి అంతర్ధానం అవుతాడు ఆ తరువాత తల్లి కొడుకు అక్కడి స్థిరపడిపోయి శివుడి నీ ధ్యానిస్తూ జీవితాంతం అక్కడే తమ జీవితాన్ని కొనసాగించి చివరకు శివుడిలో ఐక్యమవుతారు ఇది ఆలయ చరిత్ర.

 ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకొని ఈ బ్లాగును చూసినందుకు ధన్యవాదాలు

Demo class 7 days yoga class registration

Loading… ఫారం సబ్మిట్ చేసిన తర్వాత WhatsApp లో మమ్మల్ని సంప్రదించండి 🙏 📲 Contact on WhatsApp Your free book View ...